AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

iPhone Wedding Card: వైజాగ్ జంట వెడ్డింగ్‌ కార్డు ఐడియా అదుర్స్.. ‘అచ్చం ఐఫోన్ మాదిరుందే!’ వీడియో వైరల్

పెళ్లంటే ఆకాశమంత.. పందిరి, భూదేవంత పీటలు వేసి, కోట్లు కుమ్మరించి.. విందు, చుట్టాలు, వేలాది మందికి భోజనాలు, అంగరంగ వైభవంగా జరిపించాలని కలలు కంటుంటారు. ఇటీవల అంబానీల ఇంట పెళ్లి ఈ వర్ణనకు తగ్గట్టు జామ్‌జామ్‌గా జరిగింది. అయితే తాజాగా ఓ జంట ఇంతకు మించి అన్నట్లు వినూత్నంగా ఆలోచించారు. తమ పెళ్లికి ఏకంగా ఐఫోన్లలో వెడ్డింగ్ కార్డ్‌లు పంచారు. అదేంటీ అనుకుంటున్నారా? అవును..

iPhone Wedding Card: వైజాగ్ జంట వెడ్డింగ్‌ కార్డు ఐడియా అదుర్స్.. 'అచ్చం ఐఫోన్ మాదిరుందే!' వీడియో వైరల్
Iphone Wedding Card
Srilakshmi C
|

Updated on: Jul 30, 2024 | 5:29 PM

Share

విశాఖపట్నం, జులై 30: పెళ్లంటే ఆకాశమంత.. పందిరి, భూదేవంత పీటలు వేసి, కోట్లు కుమ్మరించి.. విందు, చుట్టాలు, వేలాది మందికి భోజనాలు, అంగరంగ వైభవంగా జరిపించాలని కలలు కంటుంటారు. ఇటీవల అంబానీల ఇంట పెళ్లి ఈ వర్ణనకు తగ్గట్టు జామ్‌జామ్‌గా జరిగింది. అయితే తాజాగా ఓ జంట ఇంతకు మించి అన్నట్లు వినూత్నంగా ఆలోచించారు. తమ పెళ్లికి ఏకంగా ఐఫోన్లలో వెడ్డింగ్ కార్డ్‌లు పంచారు. అదేంటీ అనుకుంటున్నారా? అవును.. ఈ జంట తమ పెళ్లికి రావాలని అయినవాళ్లందరికీ ప్రత్యేకంగా ఐఫోన్లను పంచి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఇవి నిజంగా ఐఫోన్లు కాదండోయ్‌.. వీటిని ఓపెన్ చేస్తే వధూవరుల వివాహ ఆహ్వానం బలేగా చూపించారులే. ఇదెక్కడో విదేశాల్లోనో.. ఉత్తరాదిలోనో జరిగి ఉంటుందిలే అనుకుంటున్నారా? అస్సలు కాదు.. మన తెలుగు వాళ్ల క్రియేటివిటీలనే. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

వెడ్డింగ్‌ కార్డు కేవలం ఆహ్వానం మాత్రమే కాదు. ఇది దంపతుల అభిరుచికి ప్రతిబింబం. ఇటీవల జరుగుతున్న పెళ్లిళ్లలో కొందరు తమ అభిరుచికి తగ్గట్టు వెరైటీగా కార్డులను డిజైన్‌ చేసుకుంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వైజాగ్‌కు చెందని ఎ జంట ఐఫోన్ నేపథ్యంతో ప్రత్యేకంగా వివాహ ఆహ్వాన పత్రికను రూపొందిచారు. ఇందుకు సంబంధించిన వీడియోను లక్ష్మణ్ వెడ్డింగ్ కార్డ్స్ తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోలో అచ్చం ఐఫోన్‌ మాదిరి ఉన్న వెడ్డింగ్‌ కార్డులను చూడొచ్చు. ఇందులో మూడు పేజీలు ఉన్నాయి. బుక్‌లెట్ లేఅవుట్‌తో డిజైన్‌ చేసిన ఈ ఫోన్ వెడ్డింగ్‌ కార్డులో కవర్ పేజీలో వాల్‌పేపర్ లాగా ఈ జంట ఫోటో ‘బ్యాక్‌గ్రౌండ్’లో కనిపిస్తుంది. ఫోటో పైన వివాహ సమయం, తేదీ వివరాలు స్క్రీన్‌పై చూపిస్తున్నట్ల వీడియోలో కనిపిస్తుంది. లోపల పేజీలలో ఒకదానిపై వాట్సాప్ చాట్ మెసేజ్ ఫార్మాట్ ఉంటుంది.సెండ్ లొకేషన్ క్యాప్షన్‌తో వివాహ వేదిక వివరాలు కనిపిస్తాయి.

ఇక ఇన్విటేషన్ ‘బ్యాక్ కవర్’ అద్భుతమైన కెమెరా ఇలస్ట్రేషన్‌తో 3డీ మాదిరిగా డిజైన్ చేసి ఉండటం వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియోకు ఇప్పటి వరకు 15 మిలియన్ల వ్యూస్‌, 6 లక్షలకుపైగా లైకులు, కామెంట్లు రావడంతో నెట్టింట సంచలనంగా మారింది. ఈ ఐడియా బలేగుంది గురూ.., ‘చాలా ఖరీదైన వెడ్డింగ్ కార్డ్’, ‘మీ ఆలోచనను అభినందిస్తున్నాను’, ‘బాస్.. నీ క్రియేటివిటీ అదిరింది’ అంటూ నెటిజన్లు పొగత్తలతో ముంచెత్తుతున్నారు. ఇంతకీ మీరేమంటారు..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
గ్యాస్ కష్టాలకు చెక్.. ఇరాన్ కాల్పుల విరమణ.. కేంద్రం కీలక ప్రకటన
గ్యాస్ కష్టాలకు చెక్.. ఇరాన్ కాల్పుల విరమణ.. కేంద్రం కీలక ప్రకటన