Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Practice for longer life: ఎక్కువ కాలం జీవించాలంటే.. ఇలాంటి అలవాట్లను ఫాలో అవ్వండి..!

మన ఆరోగ్యానికి అత్యంత హనికరమైన అలవాటు స్మోకింగ్‌.. ఇది మన ఆరోగ్యాన్ని అతి వేగంగా దెబ్బ తీస్తుంది. స్మోకింగ్ వల్ల జీవితకాలం క్రమంగా తగ్గుతుంది. అందుకే ఎక్కువ కాలం జీవించాలంటే కచ్చితంగా స్మోకింగ్‌ మానేయాలని నిపుణులు చెబుతున్నారు.

Practice for longer life: ఎక్కువ కాలం జీవించాలంటే.. ఇలాంటి అలవాట్లను ఫాలో అవ్వండి..!
Practice For Longer Life
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 30, 2024 | 6:48 PM

సానుకూల ఆలోచన మీ శరీరం, మనస్సుపై ప్రభావం చూపుతుంది. ఒత్తిడి తగ్గుతుంది, రక్తపోటు అదుపులో ఉంటుంది. మీ జీవితకాలం, ఆయుష్షు పెరుగుతుంది. ఒత్తిడిని ఎంతగా నియంత్రించుకుంటే అంత మంచిది. దీర్ఘకాలిక ఒత్తిడి, మానసిక ఆరోగ్యం పై హానికరమైన ప్రభావాన్ని చూపిస్తుంది.

రోజూ యోగా చేయండి..

యోగా మీ ఎముకలు, కండరాలను బలపరిచే సులభమైన, సమర్థవంతమైన వ్యాయామం. ఒక అధ్యయనం ప్రకారం, రెగ్యులర్‌గా యోగా చేయడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. యోగా, లోతైన శ్వాస, ధ్యానం వంటివి వ్యాయామాలు మెదడుకు స్పష్టతను, జ్ఞాపకశక్తిని, మంచి దృష్టిని అందిస్తాయి. మెదడు ఎంత ఆరోగ్యంగా ఉంటే జీవితం అంత చక్కగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

త్వరగా పడుకోవటం అలవాటు చేసుకోండి..

మంచి నిద్ర మీ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ప్రతిరోజూ నిర్ణీత సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోండి. నిద్రపోయే ముందు ఫోన్ లేదా కంప్యూటర్ వాడకాన్ని తగ్గించండి.

పప్పులు, తృణధాన్యాలు తినండి..

పప్పులు, వోట్స్, బ్రౌన్ బ్రెడ్ వంటి తృణధాన్యాలు తినడం వల్ల మీ జీవితకాలం పెరుగుతుంది. వాటిలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మంచిది. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది.

పులియబెట్టిన ఆహారాలు తినండి..

దోస, దోక్లా, పెరుగు వంటి పులియబెట్టిన ఆహారాలు మీ కడుపులో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తాయి. ఈ ఆహార పదార్థాలను తినడం వల్ల మీ జీవితకాలం పెరుగుతుంది.

పెంపుడు జంతువులతో కాలక్షేపం..

ప్రతి రోజూ పెంపుడు జంతువులతో కొంత సమయం గడపడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మీ మూడ్ బాగుంటుంది. పెంపుడు జంతువులతో కాలక్షేపం చేసే వారు ఎక్కువ కాలం జీవిస్తారని పరిశోధనలు చెబుతున్నాయి.

ఎప్పటికప్పుడు మీ రక్తపోటు చెక్‌ చేసుకోవటం మంచిది..

అధిక రక్తపోటు అనేక వ్యాధులకు కారణమవుతుంది. అందువల్ల, మీ రక్తపోటును క్రమం తప్పకుండా చెక్‌ చేసుకోవటం మంచిది. అవసరమైతే, వైద్యుడిని సంప్రదించండి.

ఆరోగ్యకరమైన ఆహారం…

సమతుల్య ఆహారంలో పుష్కలంగా పండ్లు, కూరగాయలు, చేపలు, చిక్కుళ్ళు వంటి లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు ఉంటాయి. ఈ ఆహారాలు శరీరానికి, రోగనిరోధక శక్తి పనితీరు, మీ మొత్తం ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

స్మోకింగ్ అత్యంత హనికరం..

మన ఆరోగ్యానికి అత్యంత హనికరమైన అలవాటు స్మోకింగ్‌.. ఇది మన ఆరోగ్యాన్ని అతి వేగంగా దెబ్బ తీస్తుంది. స్మోకింగ్ వల్ల జీవితకాలం క్రమంగా తగ్గుతుంది. అందుకే ఎక్కువ కాలం జీవించాలంటే కచ్చితంగా స్మోకింగ్‌ మానేయాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని TV9 Telugu.com (టీవీ9 తెలుగు) ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..