బ్లూ టీ తాగితే ఆరోగ్యంతో పాటు అందం అమాంతం పెరుగుతుందా? లాభాలు తెలిస్తే..
మిల్క్‌టీ, అల్లం టీ, బ్లాక్ టీ, మసాలా టీ, గ్రీన్ టీ ఇలా ఎన్నో రకాల టీలను మీరు చూసి ఉంటారు. అన్ని రకరకాల టీలను మనం ట్రై చేస్తూ ఉంటాం. అయితే మీరు ఎప్పుడైనా బ్లూ టీని ట్రై చేశారా..? దీనిని రోజూ తీసుకోవడం వల‌్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ టీని శంకుపూలు.. వీటిని అపరాజిత పూలు అని కూడా అంటారు.. బ్లూ టీనే బటర్‌ఫ్లై పీ ఫ్లవర్ టీ అని కూడా పిలుస్తారు. ఇది నీలం రంగులో ఉంటుంది. ఈ బ్లూ టీ వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
Updated on: Jul 30, 2024 | 7:31 PM

రెగ్యూలర్‌గా బ్లూ టీ తాగడం వల్ల శరీర బరువును అదుపులో ఉంచుకోవచ్చు అంటున్నారు. అపరాజిత పూలలోని ఔషధ గుణాలు కొవ్వు కణాలు పెరుగుదలను నియంత్రించి మన శరీర బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ టీలో ఉండే పైటోకెమికల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ గొప్ప నిర్విషీకరణ శక్తి కలిగి ఉంటుంది. ఇది శరీరంలో ఉండే మలినాలను తొలగించి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. బ్లూ టీని క్రమం తప్పకుండా రోజూ తాగడం వల్ల వృద్ధాప్య ఛాయలను తగ్గించుకొని యవ్వనంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

బ్లూ టీలో యాంటీ-గ్లైకేషన్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. బ్లూ టీలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలను బలపరుస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే ఆంథోసైనిక్ స్కాల్ప్‌పై బ్లడ్ సర్క్యులేషన్‌ని పెంచుతాయి. బ్లూ టీతో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ బ్లూ టీలో ఉండే పోషకాలు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగేలా చేస్తాయి. తద్వారా ఇది మనల్ని దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.

ఈ టీని రోజూ తాగడం వల‌్ల మన మానసిక స్థతిని మెరుగుపరుస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. బ్లూ టీ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బ్లూ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. బ్లూటీలో ఉండే యాంటీ గ్లైసెటీన్ ప్రాపర్టీస్ వలన చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. మధుమేహంతో బాధపడేవారు రెగ్యులర్‌గా ఈ టీ తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

చర్మం ఆరోగ్యంగా ఉండడానికి బ్లూ టీ తాగాలి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే ఫ్లేవనాయిడ్లను కలిగి ఉండి చర్మం స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది. నల్ల మచ్చలను తొలగిస్తుంది. ఇది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో సాయపడుతుంది. దాంతో చర్మం ప్రకాశవంతంగా, ఆరోగ్యవంతంగా తయారవుతుంది. బ్లూ టీలో ఆంథోసైనిన్ ఉన్నందున జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది. ఇది తలలో రక్త ప్రసరణను పెంచడానికి, జుట్టు కుదుళ్లకు బలాన్నిస్తుంది.

బ్లూ టీ తాగడం వల్ల కంటి ఆరోగ్యానికి మంచిది. దీంతో రెటీనా దెబ్బతినడం, కంటి మచ్చల క్షీణత, గ్లాకోమా, అస్పష్టమైన దృష్టి వంటి కంటి వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బ్లూ టీలో యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేసే టెర్నాటిన్‌లను కలిగి ఉండి వ్యాధినిరోధక శక్తి పెంచుతుంది.

శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా నిరోధిస్తుందని కూడా పలు అధ్యయనాల్లో తేలింది. ఇది కడుపు కండరాలను సడలించడంలో సాయపడుతుంది. జీవక్రియను పెంచడంతోపాటు గట్‌లో పురుగులు పెరగకుండా చేస్తుంది.





























