Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రిపూట ఇంట్లో రోజూ 2 బిర్యానీ ఆకులను కాల్చితే ఏమవుతుందో తెలుసా..? ఇది నమ్మలేరు..

మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది చెడు కన్ను ప్రభావాలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇంటి వాస్తు లోపాలను పోగొట్టడానికి కూడా బిర్యానీ ఆకులు ప్రయోజకరంగా ఉంటాయి. ఇంటికి వాస్తు లోపాలు ఉంటే రాత్రిపూట రెండు బిర్యానీ ఆకులను కాల్చి దూపం వేస్తే వాస్తు లోపాలు తొలగిపోతాయి.

రాత్రిపూట ఇంట్లో రోజూ 2 బిర్యానీ ఆకులను కాల్చితే ఏమవుతుందో తెలుసా..? ఇది నమ్మలేరు..
Bay Leaf
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 30, 2024 | 10:16 PM

సాధారణంగా బిర్యానీ ఆకులను వివిధ రకాల ఆహారాల్లో మసాలా దినుసుగా వాడుతుంటారు. ఇది ఆ వంటకు మరింత రుచిని అందిస్తుంది. కానీ, వాస్తుశాస్త్రం ప్రకారం బిర్యానీ ఆకులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రాత్రిపూట ఇంట్లో రెండు బిర్యానీ ఆకులను కాల్చితే ఏమవుతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అది మీ జీవితంలోని ఎన్నో ఇబ్బందులను తొలగిస్తుందని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మీకు ఇంట్లో ఏదైనా ప్రతికూలత అనిపిస్తే.. రోజూ రాత్రి రెండు బిర్యానీ ఆకులను కాల్చమని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలా చేయటం వల్ల అన్ని రకాల ప్రతికూల శక్తులను నాశనం చేస్తుంది. ఇది మీ ఇంట్లో నెగిటీవ్ ఎనర్జీని దూరం చేస్తుంది. రాత్రి పూట ఇంట్లో బిర్యానీ ఆకును కాల్చడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

మీ కుటుంబంలో నెలకొన్న మానసిక ఒత్తిడిని నివారించేందుకు ప్రతిరోజూ రాత్రిపూట ఇంట్లో బిర్యానీ ఆకులను కాలిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ఇది మీ ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు.. ఇది మీ కుటుంబ సభ్యులు తరచుగా అనారోగ్యానికి గురైతే మాత్రం ఇంట్లో సాయంత్రం తర్వాత 2 బిర్యానీ ఆకులను కాల్చండి. ఇది ఎన్నో వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే, కొంతమందికి రాత్రిపూట పీడకలలు పడుతుంటాయి. అలాంటి వారు రాత్రి రెండు బిర్యానీ ఆకులను కాల్చటం వల్ల మేలు చేస్తుంది.. ఇది చెడు కలల నుంచి బయటపడటానికి మీకు సహాయపడుతుంది.

ప్రతి రోజూ రాత్రి పూట ఇంట్లో బిర్యానీ ఆకులను కాల్చటం వల్ల మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది చెడు కన్ను ప్రభావాలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇంటి వాస్తు లోపాలను పోగొట్టడానికి కూడా బిర్యానీ ఆకులు ప్రయోజకరంగా ఉంటాయి. ఇంటికి వాస్తు లోపాలు ఉంటే రాత్రిపూట రెండు బిర్యానీ ఆకులను కాల్చి దూపం వేస్తే వాస్తు లోపాలు తొలగిపోతాయి.

ఇవి కూడా చదవండి

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..