Ganesh Puja: బుధవారం ఈ పూలతో వినాయకుడిని పూజిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయట..!
ప్రతి బుధవారం తప్పకుండా గణపతిని, లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఇంట్లో సఖల సౌభాగ్యాలు కలుగుతాయని చెబుతారు.. ఇలా చేయడం వల్ల జాతకంలో బుధుని స్థానం బలపడుతుంది. బుధ గ్రహం బలంగా ఉండటం వలన, మీ జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. బుధవారాలలో గుడికి వెళ్లి గణేశుడికి గరికె గడ్డి, లడ్డూను సమర్పించటం వల్ల గణపతిని సంతోషపరుస్తుంది. విఘ్నాధిపతి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయి.
బుధవారం.. వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున భక్తిశ్రద్ధలతో ఆ గణేశుడికి పూజలు చేయడం వల్ల కోరిన కోరికలు ఎలాంటి ఆటంకాలు లేకుండా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అయితే, కోరికలు నెరవేరాలంటే ఆ గణనాధుడికి ఇష్టమైన పూలు, పత్రాలు సమర్పిస్తుంటారు భక్తులు. పత్రి, ఫలం, గరిక, చిన్న బెల్లంముక్క, లేదంటే, గుప్పుడు గరిక సమర్పించినా ఆ లంభోధరుడు కరుణిస్తాడని నమ్మకం. అయితే వినాయకుడికి పూజ చేసేటప్పుడు 21 పత్రాలను సమర్పించాలని చెబుతారు. అలాంటి వాటిలో దానిమ్మ పూలు కూడా ఉన్నాయి. దానిమ్మ పూలతో వినాయకుడిని పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయట..!
బుధవారం రోజు వినాయకుడిని పూజిస్తే జీవితమంతా విజయాలే ఉంటాయని భక్తుల విశ్వాసం. గణనాథుడి అనుగ్రహం కోసం బుధవారం అనేక రకాల పూజలు చేస్తుంటారు చాలా మంది భక్తులు. అయితే దానిమ్మ పువ్వులతో గణేశుడిని పూజిస్తే జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి, సుఖసంతోషాలతో వారి జీవితం విరాజిల్లుతుందని పండితులు చెబుతున్నారు. ఇందుకోసం బుధవారం తెల్లవారు జామునే నిద్రలేచి అభ్యంగ స్నానం చేయాలి. ఆ తరువాత గణనాథుడికి ఎంతో ప్రీతికరమైన దానిమ్మ పూలను తెచ్చుకోవాలి.
ఆ లంబోదరుడిని గరిక, దానిమ్మ పూలతో అలంకరించాలి. అటు పిమ్మట పూజా కార్యక్రమం ప్రారంభించాలి. ఇలా దానిమ్మ పూలతో పూజ చేయడం వల్ల అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇక మీ కష్టాలన్నీ తొలగిపోవడానికి వినాయకుడికి మోదక నైవేద్యాన్ని సమర్పించాలని చెబుతున్నారు. బుధవారం నాడు వినాయకుడికి మోదక నైవేద్యాన్ని పెట్టి ప్రార్థిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.
ప్రతి బుధవారం తప్పకుండా గణపతిని, లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఇంట్లో సఖల సౌభాగ్యాలు కలుగుతాయని చెబుతారు.. ఇలా చేయడం వల్ల జాతకంలో బుధుని స్థానం బలపడుతుంది. బుధ గ్రహం బలంగా ఉండటం వలన, మీ జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. బుధవారాలలో గుడికి వెళ్లి గణేశుడికి గరికె గడ్డి, లడ్డూను సమర్పించటం వల్ల గణపతిని సంతోషపరుస్తుంది. విఘ్నాధిపతి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయి.
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..