AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rang Panchami 2021: రంగుల పంచమితో ముగిసే హొలీ వేడుకలు.. పంచభూతాలకు గుర్తుగా జరుపుకునే పండగ..

Rang Panchami 2021:భారతదేశంలో ప్రధాన హిందూ పండుగలలో హోలీ ఒకటి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ పండుగను కొవిడ్ నిబంధనల మధ్య జరుపుకున్నారు. అయితే ఈ హొలీ పండగను వివిధ ప్రాంతాల్లో విభిన్న పద్ధతుల్లో జరుపుకుంటారు. ఈ రోజు రంగుల పంచమి...

Rang Panchami 2021: రంగుల పంచమితో ముగిసే హొలీ వేడుకలు.. పంచభూతాలకు గుర్తుగా జరుపుకునే పండగ..
Rang Panchami
Surya Kala
|

Updated on: Apr 02, 2021 | 10:54 AM

Share

Rang Panchami 2021:భారతదేశంలో ప్రధాన హిందూ పండుగలలో హోలీ ఒకటి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ పండుగను కొవిడ్ నిబంధనల మధ్య జరుపుకున్నారు. అయితే ఈ హొలీ పండగను వివిధ ప్రాంతాల్లో విభిన్న పద్ధతుల్లో జరుపుకుంటారు. ఈ రోజు రంగుల పంచమి.. ఈ పండగను ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలతో పాటు మరి కొన్ని ఇతర ఉత్తర భారత ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు జరుపుకుంటారు. రంగ్ పంచమి ఫల్గుణ మాసంలోని పంచమి తిథినాడు వస్తుంది

హిందూ పురాణాల ప్రకారం.. ఈ రంగుల పంచమితో హోలీ ఉత్సవాలు ముగుస్తాయి. పేరులో ఉన్నట్లుగానే ఈ పంచమిని ఐదు రకాలుగా నిర్వహిస్తారు. పంచభూతాలైన నీరు, గాలి, భూమి, ఆకాశం మరియు అగ్ని. ఈ పంచ భూతాలపై ఆధారపడి ప్రతి ఒక్కరి ఉనికి గుర్తుగా ఈ రంగుల పంచమి వేడుకలను నిర్వహిస్తారు.

ఈరోజు పవిత్రమైన అగ్నిని వెలిగించినప్పుడు ప్రతికూల లక్షణాలు తొలిగిపోయి మంచి జరుగుతుందని విశ్వాసం. అంటే మనిషి పుట్టుక జీవితం, మరణ చక్రం.. వీటి నుంచి విముక్తి కలిగించే ప్రతికూల శక్తులను అంతం చేస్తుందని .. ఒక్క సాత్విక గుణం మాత్రమే మిగిలి ఉంటుందని నమ్మకం .

అగ్ని దహనంతో ప్రతికూల పరిస్థితులు తొలగించబడతాయి.. వాతావరణం సానుకూలతతో ఉండి దైవంతో నిండిపోతుంది. కనుక ఈ వేడుకలకు గుర్తుగా రంగ్ పంచమి .. రోజున ప్రజలు రంగులతో ఆడతారు.. ఆనందకరమైన పాటలు పాడతారు. ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు.

Also Read: ఒకరు కాదు ఇద్దరు కాదు..వందల మందిని మడతపెట్టేసిన కిలాడీ.. హానీ ట్రాప్ కేసులో ఎవరా లేడీ..! ఇదే ఇప్పుడు సస్పెన్స్

మీ పాన్ కార్డులో ఉండే 10 అంకెల అర్థం ఏమిటో తెలుసా..? ఆ డిజిట్స్‌లోనే పూర్తి వివరాలు ఉంటాయి