AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAN Card: మీ పాన్ కార్డులో ఉండే 10 అంకెల అర్థం ఏమిటో తెలుసా..? ఆ డిజిట్స్‌లోనే పూర్తి వివరాలు ఉంటాయి

PAN Card: ఆదాయపు పన్ను శాఖతో ప్రతి లావాదేవీకి శాశ్వత ఖాతా సంఖ్య తప్పనిసరి చేయబడింది. బ్యాంక్ ఖాతాలను తెరవడం, బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేయడం, డీమాట్ ఖాతా...

PAN Card: మీ పాన్ కార్డులో ఉండే 10 అంకెల అర్థం ఏమిటో తెలుసా..? ఆ డిజిట్స్‌లోనే పూర్తి వివరాలు ఉంటాయి
Pan Card
Subhash Goud
|

Updated on: Apr 02, 2021 | 9:56 AM

Share

PAN Card: ఆదాయపు పన్ను శాఖతో ప్రతి లావాదేవీకి శాశ్వత ఖాతా సంఖ్య తప్పనిసరి చేయబడింది. బ్యాంక్ ఖాతాలను తెరవడం, బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేయడం, డీమాట్ ఖాతా తెరవడం, స్థిరమైన ఆస్తుల లావాదేవీ, సెక్యూరిటీలలో వ్యవహరించడం వంటి అనేక ఇతర ఆర్థిక లావాదేవీలకు కూడా ఇది తప్పనిసరి.

ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే పర్మినెంట్‌ అకౌంట్‌ నెంబర్‌ అయిన పాన్‌ కార్డుపై 10 డిజిట్స్‌ ఉంటాయి. వ్యక్తిగతంగా కార్డు తీసుకున్నా.. లేదా ఏదైనా సంస్థ తీసుకున్నా పాన్‌ నెంబర్‌లో 10 డిజిట్స్‌ ఉండటం తప్పనిసరి. అయితే పాన్‌ నెంబర్‌లోని 10 అంకెల్లో ఒక్కో డిజిట్‌కు ఒక్కో అర్థం ఉంటుంది. ఆ నెంబర్లకే ప్రత్యేక ఉంటుంది. ఈ విషయాలు పెద్దగా ఎవరికి తెలిసి ఉండదు.

అయితే పాన్‌ నెంబర్‌లోని మొదటి మూడు డిజిట్స్‌ AAA నుంచి ZZZ వరకు ఉంటాయి. అది కూడా ఆల్ఫాబెటిక్ సిరీస్‌గా ఉంటాయి. నాలుగో అంకె పాన్‌ హోల్డర్‌ స్టేటస్‌ను తెలియజేస్తుంది. అయితే ఆదాయపు పన్ను శాఖ పాన్‌ కార్డు సంస్థలతో పాటు వ్యక్తులకు జారీ చేస్తుంది. పాన్‌ హోల్డర్‌ స్టేటస్‌ను బట్టి పాన్‌ నెంబర్‌లో నాలుగో అంకె ఉంటుంది. అవి ఎలాగంటే..

A- అసోసియేట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ B – బాడీ ఆఫ్‌ ఇండివిజువల్స్‌ C – కంపెనీ (సంస్థ) F- ఫర్మ్‌ (లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్‌షిప్) G – గవర్నమెంట్‌ ఏజన్సీ (ప్రభుత్వ సంస్థ) H – హిందూ అవిభాజ్య కుటుంబం (HUF) J- ఆర్టిఫిషియల్‌ జ్యురిడికల్‌ పర్సన్‌ L – లోకల్‌ అథారిటీ P – పర్సన్‌ (వ్యక్తి) T – ట్రస్ట్‌ అనే ఈ లెటర్స్‌ ఉంటాయి.

వ్యక్తిగతంగా పాన్ కార్డ్ తీసుకునేవారందరికీ నాలుగో లెటర్ ‘P’ అనే ఉంటుంది. ఇక పాన్‌ నెంబర్‌లో ఐదో లెటర్‌ దరఖాస్తుల వ్యక్తి లేదా, ఇంటి పేరులో మొదటి అక్షరంగా ఉంటుంది. పాన్‌ నెంబర్‌లో 6 నుంచి 9వ లెటర్‌ 0001 నుంచి 9999 నెంబర్‌ మధ్య ఉంటుంది. ఇక పాన్‌ నెంబర్‌లోని 10వ డిజిట్‌ను ఆల్ఫబెటిక్‌ చెక్‌ డిజిట్‌ అంటారు. మొదటి 9 డిజిట్స్‌కు ఫార్మూలా అప్లై చేసి చివరి డిజిట్‌ను కంప్యూటర్‌ జెనరేట్‌ చేస్తుంది. ఇలా దరఖాస్తు దారుడు పేరు, ఇంటి పేరు, వ్యక్తిగతంగా దరఖాస్తు చేస్తున్నాడా..? లేదా ఏదైనా వ్యాపార సంస్థ తరపున చేస్తున్నారా.? అనే వివరాలను బట్టి ఈ 10 డిజిట్స్‌ను క్రియేట్‌ చేస్తుంది ఆయదాపను పన్ను శాఖ.

ఇవీ చదవండి: Gold Price Today: బ్యాడ్‌న్యూస్‌.. భారీగా పెరిగిన బంగారం ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

Honda Vehicles Recalls : ఏకంగా 7,61,000 వాహనాలు వెనక్కి రప్పించిన హోండా కంపెనీ.. కారణం ఏమిటంటే..?

మీకు పోస్టాఫీసులో ఖాతా ఉందా..? అయితే ఈ కొత్త రూల్స్‌ను తప్పనిసరిగా తెలుసుకోండి.!