I-T Dept Raids MK Stalin’s Son-in-law: డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కుమార్తె ఇంటిపై ఐటీ దాడులు.. అందుకేనా..!
తమిళనాడు ఎన్నికల వేళ ధన ప్రవాహం ఏరులై పారుతోంది. పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ...కట్టలకు కట్టల నోట్లు బయటపడుతున్నాయి.
I-T Dept Raids: తాజాగా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కుమార్తె ఇంటిపై దాడులు చేశారు ఐటీ అధికారులు. చెన్నై శివారులోని నీలాంగరైలో..స్టాలిన్ కుమార్తె సేంతామరైకి చెందిన ఇంట్లో తనిఖీలు చేపట్టారు.
తమిళనాడు ఎన్నికల వేళ పార్టీలకు షాకిస్తోంది ఐటీ శాఖ. ఉచిత హామీలు, మాటల తూటాలతో పొలిటీషియన్స్ దుమ్ము రేపుతుంటే..రైడ్స్‌తో కాక పుట్టిస్తున్నారు ఐటీ అధికారులు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా..దాడులతో దడ పుట్టిస్తున్నారు. పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ తనిఖీలు ముమ్మరం చేశారు. ఐటీ సోదాల్లో కట్టలకు కట్టల నోట్లు బయటపడుతున్నాయి. కోట్లాది రూపాయల సొమ్ము పట్టుబడుతోంది.
తాజాగా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కుమార్తె సేంతామరై ఇంటిపై దాడులు చేశారు ఐటీ అధికారులు. చెన్నై శివారులోని నీలాంగరైలో..స్టాలిన్ అల్లుడు శబరీశన్ ఇంటితో పాటు..కార్యాలయాల్లోనూ మొత్తం నాలుగు చోట్ల విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
ఇక ఇటీవలే పలువురు డీఎంకే, అన్నాడీఎంకే, కమల్‌హాసన్ పార్టీ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు రైడ్స్ చేశారు. ఈ దాడుల్లో వందల కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 3వందల కోట్ల రూపాయల వరకు మనీ పట్టుబడినట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఐటీ కన్ను..తమిళనాడుపై పడింది. అన్ని పార్టీల నేతలు, వారి బంధువుల ఇళ్లపై గురిపెట్టింది. ఎన్నికల టైంలో నాయకుల ఇళ్లపై వరుస ఐటీ దాడులు.. తమిళనాట ఎలక్షన్ హీట్‌ను అమాంతం పెంచేశాయి. పదుల సంఖ్యలో బృందాలు ఒక్కసారిగా దాడి చేసి కోట్ల రూపాయలు పట్టుకుంటున్నారు.