గుర్తుందా.. వినబడుతోందా.. ఆ శబ్ధం.. ధోని సిక్సర్.. విశ్వవిజేతగా టీమిండియా.. ఆ అద్భుతానికి సరిగ్గా పదేళ్లు..
World Cup 2011: ఓ అద్భుతానికి సరిగ్గా పదేళ్లు.. ఇదే రోజు మ్యాచ్‌ను ముగించేందుకు సైన్ ఆఫ్‌గా ధనా దన్ దోనీ కొట్టిన సిక్సర్ ఇప్పుటికీ భారతీయుల చెవుల్లో వినిపస్తోంది. అప్పుడు ధోని ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్ ఎ మాగ్నిఫిసెంట్ స్ట్రైక్ ఇన్ టు ద క్రౌడ్. ఇండియా లిఫ్ట్ ద వరల్డ్ కప్ ఆఫ్టర్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్’...
World Cup 2011 Victory: ఓ అద్భుతానికి సరిగ్గా పదేళ్లు.. ఇదే రోజు మ్యాచ్‌ను ముగించేందుకు సైన్ ఆఫ్‌గా ధనా దన్ దోనీ కొట్టిన సిక్సర్ ఇప్పుటికీ భారతీయుల చెవుల్లో వినిపస్తోంది. అప్పుడు ధోని ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్ ఎ మాగ్నిఫిసెంట్ స్ట్రైక్ ఇన్ టు ద క్రౌడ్. ఇండియా లిఫ్ట్ ద వరల్డ్ కప్ ఆఫ్టర్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్’… రవిశాస్త్రి కామెంటరీ సగటు భారత క్రికెట్ అభిమాని చెవుల్లో ఇప్పటికీ మారు మోగుతూనే ఉంటుంది. ఇదే రోజు ఏప్రిల్ 2న.. ముంబై వాంఖడే స్టేడియం టీమిండియా గెలుపుతో జరుపుకున్న సంబురం ఇప్పటికీ మరిచిపోలేక పోతున్నారు.
ఏప్రిల్ 2 2011 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ అంతే ఒకటే టన్షన్.. ఏం జరుగనుంది.. ఎవరిని విజయం ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ, ధోనీ బ్యాటింగ్ తీరుతో ఉత్సాహం, ఆ తర్వాత సంతోషం, భావోద్వేగం, ఆనంద భాష్పాలు…ప్రతి క్రికెట్ ప్రియుడి మది నిండిపోయింది.. పొంగిపోయింది.. ఇలా అభిమానుల సంబరాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఈ విజయం కోసం పోరాడిన ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకపోయింది.
అంతే.. స్టేడియంలోని ప్రేక్షకులతో పాటు దేశంలోని కోట్లాది మంది ప్రజలు పూనకం వచ్చినట్లు ఊగిపోయారు. ఊరు ఊరునా.. వాడ వాడలా జాతీయ పతాకాలు రెపరెపలాడాయి. ప్రతి భారతీయుడి మనసు సంతోషంలో నిండిపోయింది. మరి అప్పుడు జట్టు సాధించిన విజయం ఏమైనా సాధారణమైందా? కానే కాదు.. 28 ఏళ్ల ప్రపంచకప్ కలను నిజం చేసిన గెలుపది. రెండోసారి టీమిండియాకు వన్డే ప్రపంచకప్‌ను అందించిన విజయమది. స్వప్నం సాకారమైన ఆ క్షణానికి నేటితో పదేళ్లు. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ జరిగి ఈ రోజుతో దశాబ్దం గడిచింది.
భారత జట్టు రెండోసారి వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడి అప్పుడే దశాబ్దం గడిచిపోయిందా? శ్రీలంకతో ఆ ఫైనల్ మ్యాచ్ ఇప్పటికీ కళ్లు ముందు కదులుతోంది. ఛేదనలో ఆరంభంలో గంభీర్ (97) అద్భుత పోరాటం.. చివర్లో ధోని (91 నాటౌట్) అద్వితీయమైన ప్రదర్శన.. మ్యాచ్‌ను ముగించేందుకు సైన్ ఆఫ్‌గా ధనా దన్ దోనీ కొట్టిన ఆ సిక్సర్..స్టేడియంలో మోకాళ్లపై కూర్చొని యువీ కన్నీళ్లు కార్చిన దృశ్యం.. “ధోని ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్. ఏ మేగ్నిఫిషెంట్ స్ట్రైక్ ఇన్‌టూ ది క్రౌడ్! ఇండియా లిఫ్ట్ ది వరల్డ్ కప్ ఆఫ్టర్ 28 ఇయర్స్ అని గంభీరమైన గొంతుతో వ్యాఖ్యాతగా రవిశాస్త్రి చెప్పిన మాటలు.. ఈ విజయంతో సచిన్ చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన జట్టు ఆటగాళ్లు మ్యాచ్ ముగిశాక అతణ్ని భుజాలపై ఎత్తుకొని మైదానంలో తిరగడం.. ఇలా ఇప్పటికీ ఆ సన్నివేశాలు తాజాగా కనిపిస్తున్నాయి. 1983లో కపిల్‌దేవ్ సారథ్యంలో తొలి ప్రపంచకప్ విజయం తర్వాత.. 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అందిన ఈ మహత్తర విజయం.. సచిన్ కెరీర్‌ను పరిపూర్ణం చేసింది. సొంతగడ్డపై దక్కిన ఈ గెలుపు కెప్టెన్‌గా ధోనీకి ఘనకీర్తిని తెచ్చిపెట్టింది. మొత్తంగా క్రికెట్‌ను పిచ్చిగా అభిమానించే దేశానికి గొప్ప కిక్కును అందించింది.
Throwback to this day 2011, India won world Cup after 28 years under MS Dhoni’s captaincy and it was overall performance by the team ??❤#ViratKohli #SachinTendulkar #Cricket #MSDhoni #India #icc #worldcup2011 #SureshRaina #yuvrajsingh #virendrasehwag #GautamGambhir pic.twitter.com/TExbqRgmb5
— Dhaval Sharma (@Dhaval_1556_) April 1, 2021