AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sachin Tendulkar Hospitalised: కరోనా ఎఫెక్ట్.. ఆస్పత్రిలో జాయిన్ అయిన సచిన్ టెండూల్కర్.. ఇప్పుడెలా ఉందంటే..

Sachin Tendulkar: భారత మాజీ క్రికెట్ సచిన్ టెండూల్కర్‌ ఆస్పత్రిలో చేరారు. ఇదే విషయాన్ని సచిన్ ట్విట్టర్

Sachin Tendulkar Hospitalised: కరోనా ఎఫెక్ట్.. ఆస్పత్రిలో జాయిన్ అయిన సచిన్ టెండూల్కర్.. ఇప్పుడెలా ఉందంటే..
Sachin Tendulkar Hospitalis
Shiva Prajapati
| Edited By: Narender Vaitla|

Updated on: Apr 02, 2021 | 6:54 PM

Share

Sachin Tendulkar: భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ ఆస్పత్రిలో చేరారు. ఇదే విషయాన్ని సచిన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రోడ్ సేఫ్టీ ట్రోఫీ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్ అని తేలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్యుల సూచనలు, ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఆస్పత్రిలో చేరినట్లు సచిన్ టెండూల్కర్ వెల్లడించారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేసిన, తన క్షేమం కోరిన వారందరికీ సచిన్ ధన్యవాదాలు తెలిపారు. కొద్ది రోజుల్లోనే ఇంటికి తిరిగి వస్తానని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. అందరూ జాగ్రత్తగా, సురక్షితంగా ఉండాలని ప్రజలకు సచిన్ టెండూల్కర్ విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో భారత క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలిచి 10 ఏళ్లు అవుతున్న సందర్భంగా టీమిండియాకు, భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

కాగా, మార్చి 27వ తేదీన ఆరోగ్యంలో స్వల్ప తేడాలు కనిపించడంతో సచిన్ టెండూల్కర్ కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఈ టెస్ట్‌లో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో.. సచిన్ హోమ్ ఐసోలేషన్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు సచిన్.. ఆస్పత్రిలో చేరారు.

Sachin Tendulkar:

Also read:

గుర్తుందా.. వినబడరుతోందా.. ఆ శబ్ధం.. ధోని సిక్సర్.. విశ్వవిజేతగా టీమిండియా.. ఆ అద్భుతానికి సరిగ్గా పదేళ్లు..

Karthika Deepam Serial: కార్తీక్ కోసం మళ్ళీ కుట్రకు తెరలేపిన మోనిత.. పిల్లల భవిష్యత్ కోసం డాక్టర్ బాబు అనూహ్య నిర్ణయం..

India Corona Cases Updates: భారత్‌లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. భారీగా నమోదైన పాజిటివ్ కేసులు..