Karthika Deepam Serial: కార్తీక్ కోసం మళ్ళీ కుట్రకు తెరలేపిన మోనిత.. పిల్లల భవిష్యత్ కోసం డాక్టర్ బాబు అనూహ్య నిర్ణయం..

కార్తీక్..  దీప మధ్య పిల్లల భవిష్యత్ గురించి వాదన జరుగుతుంది. ఏ తల్లి కావాలని పిల్లని పేదరికంలోకి నెట్టెయ్యదు. కొన్ని రోజులు పొతే ఈ బండి ఓ హోటల్ గా మారవచ్చు.. మా కష్టం కాస్త పెరిగినా పిల్లలు సుఖంగా పెరగడానికి చాలినంత ఆదాయం పెరగవచ్చు..

Karthika Deepam Serial: కార్తీక్ కోసం మళ్ళీ కుట్రకు తెరలేపిన మోనిత.. పిల్లల భవిష్యత్ కోసం డాక్టర్ బాబు అనూహ్య నిర్ణయం..
Karthika Deepam
Follow us

|

Updated on: Apr 02, 2021 | 10:58 AM

Karthika Deepam Serial: తెలుగులోగిళ్ళలో కార్తీక దీపం అత్యంతఆదరణ సొంతం చేసుకుంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ సాయంత్రం 7.30 గంటలు అవుతుందంటే చాలు టివి స్క్రీన్స్ ముందు చేరుకుంటారు.. అంతగా ఆకట్టుకుంది ఈ సీరియల్ ఈరోజు ఏప్రిల్ 2న 1003 వ ఎపిసోడ్ కు చేరుకుంది. ఈరోజు ఎపిసోడ్ లోని హైలెట్స్ ఒక్కసారి చూద్దాం..!

కార్తీక్..  దీప మధ్య పిల్లల భవిష్యత్ గురించి వాదన జరుగుతుంది. ఏ తల్లి కావాలని పిల్లని పేదరికంలోకి నెట్టెయ్యదు. కొన్ని రోజులు పొతే ఈ బండి ఓ హోటల్ గా మారవచ్చు.. మా కష్టం కాస్త పెరిగినా పిల్లలు సుఖంగా పెరగడానికి చాలినంత ఆదాయం పెరగవచ్చు. అందాకా ఈ బండిలాగే.. బతుకు బండిని తోసుకుంటూ ఉంటానని చెబుతుంది దీప.  నీకు ఆదాయం పెరిగినంతమాత్రన పిల్లల భవిష్యత్ లో ఏ మాత్రం మార్పు రాదు.. పిల్లల్ని చెరో ఇడ్లి బండి పెట్టించేటంత ఆదాయం వస్తుందేమోగాని.. డాక్టరుగానో కలెక్టర్ గానో చూడలేవు అంటాడు. మీకు ఎటువంటి అనుమానం అక్కర్లేదు.. వంటలక్క అన్న పేరు నాకే వచ్చింది.. నాతోనే పోతుంది చాలా అంటుంది. ఈ సమస్య నాది నీది లేదా పిల్లలది.. మధ్యలోకి పిలల్లల్ని లాగి వారిని సమస్యలోకి నెట్టేస్తున్నావు నువ్వు.. మీరు పిలల్లని మన సమస్యల్లోకి ఎందుకు లాగుతున్నారో నాకు తెలుసు.. ఏమిటి.. పిల్లలు నామీద ఉన్న ప్రేమతో నాన్న అని పేరుపెట్టారు.. ఆ బోర్డు చూసినప్పుడల్లా నీకు అనిపించడంలేదా.. పిల్లలల్ని తీసుకొచ్చి తప్పు చేశాను అని అంటుంది. మీరు నన్ను అన్నమాటలు చాలు అవన్నీ గాయాలై ఇంకా నా మనసులోనే ఉన్నాయి. అవి మరచిపోలేకేనే నేను మంచం పట్టాను.. ఇంకా ఇంకా నన్ను ద్వేషించకండి.. మీకు నా ఉనికి తెలియకూడదనే ఈ మారుమూలకొచ్చి బతుకుతున్నా.. అంటుంది. అయితే నన్ను వెళ్ళిపోమంటావా అంటాడు కార్తీక్.. నేను అలా అనలేదు డాక్టర్ బాబు.. నన్ను మళ్ళీ అపార్ధం చేసుకోకండీ అని వేడుకుంటుంది దీప.

ఇక మరోవైపు కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని.. మోనిత కోపంలో రగిలిపోతుంది. ఇంటిలోని సామాన్లు అన్నీ పడేసి.. నా కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.. మురళీ కృష్ణ దీప దొరికిందని ఎవరికీ చెప్పలేదు.. మరి నా కార్తీక్ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.. ఏమైపోయాడు.. అంటూ మళ్లీ ఎదో కంట్రీ ప్లాన్ చేస్తుంది.

ఇక దీప కార్తీక్ కోసం వంట చేస్తుంది.. జీవితాంతం వండిపెట్టే అదృష్టం నాకు ఎలాగా లేదు.. కనీసం ఒక్కపూటైనా వండి పెట్టుకుంటా అంటుంది. భోజనం పెట్టడానికి రెడీ అవుతుంటే.. ఇంతలో పిల్లలు వచ్చి.. అమ్మా బట్టలు సర్దుకోండి.. నాన్న అందరినీ తీసుకుని వెళ్తాడు.. త్వరగా రెడీ అవ్వండి.. నన్ను రమ్మని చెప్పలేదు కదా నాన్నా.. అంటుంది. నిన్ను వదిలి పిల్లలని తీసుకుని వెళ్తానంటాడా నీ పిచ్చిగాని.. అంటాడు మురళీ కృష్ణ . కారులోనే కదా.. అందరం కలిసి వెళ్దాం నాన్న అంటుంది. ఇంతలో కార్తీక్ వచ్చి.. మీరు ఎందుకు రెడీ అయ్యారు.. కారు ఎయిర్ పోర్ట్ వరకే మాట్లాడాను.. మళ్ళీ ఎయిర్ పోర్ట్ నుంచి తిరిగి వచ్చేయండి.. నేను పిల్లల్ని మాత్రమే తీసుకుని వెళ్తున్న అంటాడు కార్తీక్.. మరి అమ్మ అని అడుగుతుంది శౌర్య.. మీ అమ్మని చూడాలని పిస్తే.. అంజి మిమ్మల్ని తీసుకొస్తాడు.. లేక దీపకు పిల్లలని చుడాలనిపిస్తే తను వచ్చి చూస్తుందని అంటాడు.. దీంతో మురళీ కృష్ణ.. బాబు ఆడపిల్లలు బాబు.. ఈ వయసులోనే తల్లి అవసరం చాలా ఉంటుంది.. వాళ్ళని విడదీయకండి .. మీకు భార్య అక్కర్లేక పోవచ్చు.. కానీ పిల్లలకి తల్లి కావాలి.. అంటాడు మురళీ కృష్ణ. మీకు భార్య అక్కర్లేకపోవచ్చు.. పిల్లలకు తల్లితండ్రి ఇద్దరూ కావాలి.. ఉంచితే ఇక్కడే ఉంచండి.. లేదంటే నా బిడ్డను కూడా మీ బిడ్డలతో పాటు తీసుకుని వెళ్లండి.. అని వేడుకుంటాడు మురళీ కృష్ణ. దీంతో దీప కలుగజేసుకుని ‘డాక్టర్ బాబు నాకు నా జీవితంలో ఏ సుఖం లేదు.. ఏ సంతోషం లేదు.. నా బిడ్డలని చూసుకునే బతుకుతున్నాను. దయచేసి వాళ్లని వదిలెయ్యండి.. వాళ్లని మీ కూతుర్లులానే పెంచుతాను..’ అని దీప వేడుకుంటుంది. ఆ ఎలా పెంచుతున్నావో నేను వచ్చిన వెంటనే చూశా.. అని ఎద్దేవా చేస్తాడు కార్తీక్.. దీంతో శౌర్య వద్దు నాన్న అందరం కలిసే ఉందాం.. అవును నాన్న అమ్మని కూడా తీసుకుని వెళ్దాం అంటుంది హిమ..

నాకు తెలుసు మీ అమ్మా మీతో ఇలా చెప్పిస్తుందని.. మీకు మీ అమ్మే కావాలని అంటే.. జీవితంలో ఇంకెప్పుడూ నాన్న కనిపించడు.. అలా అనకు నాన్న అని వేడుకుంటారు. అయితే నాతొ రండి అని ఆర్డర్ వేస్తాడు కార్తీక్. మా కోసం నువ్వు ఎక్కువ కష్టపడితే నీ ఆరోగ్యం పాడవుతుంది. మేము నాన్నదగ్గరే ఉంటాం.. శనివారం రాత్రి వచ్చి.. ఆదివారం వెళ్ళిపోతం అంటుంది శౌర్య.. దానికి హిమ కూడా ఒప్పుకుంటుంది.

మురళీ కృష్ణ బాధగా వెళ్ళండి.. అందరూ వెళ్లిపోండి.. నా బిడ్డని.. కన్న బిడ్డలు కూడా అనాథలు చేసి పోతున్నారు.. డబ్బులు అంటుంటే.. మాకు ఎవరి దాన ధర్మాలు వద్దు.,. మీ విశాల హృదయానికి ఒక దణ్ణం అని కన్నీరుతో ఆవేదన వ్యక్తం చేస్తాడు మురళీ కృష్ణ.. హిమ అత్తమ్మా అంటూ .. ఏడుస్తుంది దీప.. అయితే ఇదంతా తన కల అని తెలుసుకుంటుంది.

దీప తెల్లారి లేచి చూసేసరికి పిల్లల మధ్య కార్తీక్ లేకపోవడం చూసి.. బాధపడుతుంది.. పిల్లలు కావాలని ఉన్నా నన్ను తీసుకుని వెళ్ళడానికి మనసు ఒప్పక్క వెళ్లిపోయారా అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. పిల్లలు నిద్ర లేచి నాన్న ఏడి అని అడిగితె ఏమని సమాధానం చెప్పాలని అనుకుంది మదన పడుతుంది. ఇంతలో పిల్లలు ఇద్దరూ లేచి నాన్న నాన్నా అంటూ కార్తీక్ కోసం వెదుకుతారు. లోపల ఉన్నాడేమో అని వెదుకుతూ.. అమ్మా నాన్న ఎడి అని అడుగుతారు.. దీప కన్నీరు పెట్టుకుని మీ నాన్న మనల్ని మళ్ళీ ఒంటరివాళ్లను చేసి వెళ్ళిపోయాడు అంటుంది. దీంతో శౌర్య వెళ్లిపోయాడా అంటూ తండ్రి కోసం కన్నీరు పెట్టుకుంటారు.

Also Read: ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి సొరంగ మార్గాన్ని ఢీకొట్టిన రైలు.. 36 మంది మృతి.. 72 మందికి గాయాలు..!

రంగ్ పంచమితో ముగిసే హొలీ వేడుకలు.. పంచభూతాలకు గుర్తుగా జరుపుకునే పండగ..

Latest Articles
పోలింగ్ రోజు అల్లర్లపై వేగంగా దర్యాప్తు.. ఈ నియోజకవర్గాల్లో సిట్
పోలింగ్ రోజు అల్లర్లపై వేగంగా దర్యాప్తు.. ఈ నియోజకవర్గాల్లో సిట్
స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా..
స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా..
రేపటితో ముగుస్తున్న తెలంగాణ లాసెట్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు
రేపటితో ముగుస్తున్న తెలంగాణ లాసెట్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
తాడిపత్రిలో సిట్ బృందం పర్యటన.. హింసాకాండపై దర్యాప్తు ముమ్మరం..
తాడిపత్రిలో సిట్ బృందం పర్యటన.. హింసాకాండపై దర్యాప్తు ముమ్మరం..
వ్యాపారంలో విజయానికి ఐదు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..
వ్యాపారంలో విజయానికి ఐదు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..