AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarangadariya: ‘లవ్‏స్టోరీ’లో నా పాట పెట్టుకున్నందుకే హిట్ అయ్యింది.. పైర్ అవుతున్న నెటిజన్స్..

సారంగదరియా.. ఇప్పుడూ ఈ పాటకు ఉన్న క్రేజ్ మాములుగా లేదు. శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లవ్ స్టోరీ సినిమా కోసం సుద్దాల అశోక్ తేజ రాసిన

Sarangadariya: 'లవ్‏స్టోరీ'లో నా పాట పెట్టుకున్నందుకే హిట్ అయ్యింది.. పైర్ అవుతున్న నెటిజన్స్..
Singer Komali
Rajitha Chanti
|

Updated on: Apr 02, 2021 | 8:18 AM

Share

సారంగదరియా.. ఇప్పుడూ ఈ పాటకు ఉన్న క్రేజ్ మాములుగా లేదు. శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లవ్ స్టోరీ సినిమా కోసం సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాటను జానపద సింగర్ మంగ్లీ అద్బుతంగా ఆలపించగా.. హీరోయిన్ సాయి పల్లవి మెరుపు తీగలా డ్యాన్స్ చేసింది. జానపదం… అద్భుతమైన వాయిస్.. చుడముచ్చటైన డ్యాన్స్.. అన్ని కలగలిపి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే విడుదలైన అతి తక్కువ సమయంలోనే 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. అయితే ఈ పాటను మొదటగా పాడింది జానపద సింగర్ కొమలి. రేలారేలారే ప్రోగ్రాంలో కోమలి ఈ పాటను పాడింది. ఆ సమయంలో ఆ షోకు సుద్దాల అశోక్ తేజ జడ్జిగా వ్యవహరించారు. అయితే ఈ పాట మొత్తం కాకుండా.. కేవలం పల్లవిని తీసుకుని.. అందుకు తగినట్టుగా మరిన్ని చరణాలను రాసాడు సుద్దాల అశోక్ తేజ.

అయితే ఈ పాట విడుదలైన కొన్ని రోజులకే.. ఆ పాట నాది అని కోమలి అనగా.. మరో జానపద సింగర్ శిరిష కూడా ఈ పాట నాది అంటూ వివాదానికి తెరతీసారు. ఇక ఆ గొడవపై స్పందించిన సుద్దాల అశోక్ తేజ.. అది జానపద గేయం.. దానిపై అందరికి హక్కు ఉంటుందని చెప్పుకోచ్చాడు. అలా చిలికి చిలికి ఆ వివాదం గాలివానలా మారింది. ఇక సారంగదరియా వివాదం ముదిరిపోయిన సమయంలో కోమలి మీడియాకెక్కింది. పిలిచిన ప్రతీ చానెల్ వద్దకు వెళ్లి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకొచ్చింది. అసలు తనకు ఏం తెలియదని, తనను కనీసం సంప్రదించలేదు, ప్రోమో విడుదలయ్యాక కాల్ చేశారని కోమలి చెప్పుకొచ్చింది. మంగ్లీ పాడిన పాట బాగా లేదని.. తాను పాడితేనే దానికి అందం వస్తుందని చాలా సందర్బాల్లో చెప్పింది. తనకు కనీసం క్రెడిట్ కూడా ఇవ్వడం లేదని.. సినిమాలో పాడే ఛాన్స్ ఇవ్వాలని కోరింది. ఇక డైరెక్టర్ శేఖర్ కమ్ముల స్పందించి… తర్వాతి సినిమాలో పాడిస్తామని.. సారంగదరియా క్రెడిట్ కూడా ఇస్తామని చెప్పడంతో ఈ వివాదం ముగిసింది.

ఇక ఈ వివాదంలో కోమలి బాగా ఫేమస్ అయ్యింది. దీంతో తనకు ప్రముఖ షోలు, టెలివిజన్ ఛానల్ల నుంచి భారీగా అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ బుల్లితెర నిర్వహించిన షోలో కోమలి మరోసారి సారంగదరియా పాటను ఆలపించింది. తాజాగా వదిలిన ప్రోమోలో కోమలి సాంగ్ పాడడమే కాకుండా.. కాస్త మాట్లాడినట్టుగా కనిపిస్తోంది. అందులో కోమలి మాట్లాడుతూ.. లవ్ స్టోరీ సినిమాలో నా పాట పెట్టుకున్నందుకే హిట్ అయ్యిందని నాకు అనిపిస్తోందని.. మరింత హిట్ కావాలని కోరుకుంటున్న అంటూ కాస్తా ఎక్కువగానే తనకు గురించి చెప్పుకోవడానికి ప్రయత్నించిన్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు కోమలి మాటలపై ఫైర్ అవుతున్నారు. నువ్వు కనుక సినిమాలో పాడితే అసలు హిట్ కాకపోయేదని.. మంగ్లీ పాడింది కాబట్టే హిట్ అయ్యిందని.. మంగ్లీ పాటకు ప్రాణం పోసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:

జాను కోసం అప్పుడే మూడు స్కూల్స్ మారాను… అమ్మకు ఏడో తరగతిలోనే తెలుసు.. సింగర్ యశస్వి…