India Corona Cases Updates: భారత్‌లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. భారీగా నమోదైన పాజిటివ్ కేసులు..
India Corona Cases Updates: భారతదేశం వ్యాప్తంగా కరోనా వ్యాప్తి విపరీతంగా పెరుగుతోంది. ఫలితంగా రోజు రోజుకు కరోనా బాధిత..
India Corona Cases Updates: భారతదేశం వ్యాప్తంగా కరోనా వ్యాప్తి విపరీతంగా పెరుగుతోంది. ఫలితంగా రోజు రోజుకు కరోనా బాధిత సంఖ్య భారీగా నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 81,466 కేసులు నమోదు అయ్యాయి. 2021 సంవత్సరంలో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. ఇక ఇవాళ 50,356 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 469 మంది మృత్యువాత పడ్డారు. రోజు రోజుకు కరోనా మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ప్రజల్లో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక ప్రస్తుతం దేశంలో 6,14,696 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,23,03,131 మంది కరోనా బారిన పడగా.. 1,15,25,039 మంది రికవర్ అయ్యారు. కరోనా వైరస్ ప్రభావంతో 1,63,396 మంది చనిపోయారు.
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. మరోవైపు కరోనాను నియంత్రించేందుకు గానూ వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 6,87,89,138 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని, కరోనాను అడ్డుకోవచ్చని ప్రజలకు ప్రభుత్వాలు ధైర్యం చెబుతున్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.
Also read: