Coronavirus: కవలలను వదలని కరోనా మహమ్మారి.. 15 రోజుల కవల పిల్లలకు కరోనా పాజిటివ్.. వారి ఆరోగ్యం ఎలా ఉందంటే..
Coronavirus: కరోనా మహమ్మారి పెద్దల నుంచి చిన్నల వరకు అందరికి వ్యాపిస్తుంది. చివరికి కవల పిల్లలను సైతం వదిలిపెట్టడం లేదు. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో..
Coronavirus: కరోనా మహమ్మారి పెద్దల నుంచి చిన్నల వరకు అందరికి వ్యాపిస్తుంది. చివరికి కవల పిల్లలను సైతం వదిలిపెట్టడం లేదు. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా గుజరాత్‌లోని వడోదరలో కవలలకు కరోనా పాజిటివ్ తేలింది.
ఈ కవలలు జన్మించిన 15 రోజుల తర్వాత తీవ్రమైన విరేచనాలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా ఇద్దరు కవలలు కూడా డీహైడ్రేషన్‌కు గురయ్యారు. దీంతో వైద్యులు వారిని చికిత్స నిమిత్తం పిల్లల ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యులు వారికి పరీక్షలు నిర్వహించారు. అందులో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే ప్రస్తుతం వారి ఆరోగ్య నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి పీడియాట్రిక్స్ హెడ్ డిపార్ట్‌మెంట్ డాక్టర్ అయ్యర్ తెలిపారు.
కాగా, దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి వేగంగా కొనసాగుతోంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. పెద్దల నుంచి పిల్లల వరకు కరోనా ఎవ్వరిని వదిలి పెట్టడకుండా ఇబ్బందులకు గురి చేస్తోంది. కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టినా.. కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇక ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటిని వారికి కూడా కరోనా టీకా వేస్తున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. కొంత కాలం నుంచి కరోనా పాజిటివ్ కేసులు తగ్గినట్లే తగ్గి ఇటీవల నుంచి మళ్లీ పెరిగిపోతున్నాయి.
ఇవీ చదవండి: COVID-19: మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు..
Night Curfew in Telangana: తెలంగాణలో రాత్రి పూట కర్ఫ్యూ.. సోషల్ మీడియాలో హల్‌చల్.. ఇది నిజమేనా?