- Telugu News Photo Gallery Spiritual photos Pm narendra modi offers prayers at tamil nadu madurai meenakshi sundareshwarar temple photos
PM Modi Prayers at Madurai Temple Photos: మదురైలోని మీనాక్షి దేవి ఆలయంలో ప్రధాని మోదీ పూజలు..
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు, కేరళల్లో పర్యటన చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కేరళలో రెండు, తమిళనాడులో రెండు సభల్లో పాల్గొననున్నారు. అయితే ఈ సంర్భంగా ఆయన మదురైలోని ప్రసిద్ధ మీనాక్షి అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Updated on: Apr 02, 2021 | 8:06 AM

మదురైలోని ప్రసిద్ధ మీనాక్షి అమ్మన్ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రార్థనలు చేశారు. ప్రధానమంత్రి మోడీ ఆలయ సందర్శన సందర్భంగా సాంప్రదాయ ధోతి, కుర్తా ధరించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ విషయాన్ని తమిళనాడు బిజెపి యూనిట్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో తెలిపింది. అందులో ఆలయ పూజారులు ఆయనను పూర్ణకుంభంతో స్వాగతించారు. మోదీ రోడ్డు మార్గంలో ఆలయానికి చేరుకున్నారు. శుక్రవారం మదురై, కన్యాకుమారిలో బహిరంగ సభల్లో మోదీ ప్రసంగించనున్నారు.

ప్రధాని మోదీ మీనాక్షి సుందరేశ్వర ఆలయానికి చేరుకున్నప్పుడు ఆయన దుస్తులు చాలా సాంప్రదాయంగా ఉన్నాయి. తమిళనాడు సంప్రదాయ దుస్తులలో ప్రధాని కనిపించారు.

ఆలయ ప్రాంగణానికి చేరుకున్న వెంటనే ప్రధాని స్వయంగా ఆరాధన సామగ్రిని కొని ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మీనాక్షి అమ్మవారకి ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రధాని మోదీ.. అర్చకులు ఇచ్చిన హారతిని స్వీకరించారు.

తమిళ సంస్కృతికి అతిపెద్ద చిహ్నాంగా మదురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయ ప్రకారాలపై చెక్కిన శిల్ప సంపదను ఆలయ అధికారులు ప్రధాని మోదీకి వివరించారు.

శుక్రవారం ప్రధాని మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఓ.ఎం. పన్నీర్‌సెల్వం మరియు ఇతర నాయకులతో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తారు.

ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మద్దతుదారులు అక్కడికి చేరుకోవడంతో ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.




