AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

COVID-19: మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు..

Maharashtra Corona Cases: దేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య నిత్యం భారీగా పెరుగుతోంది. వేలల్లో కేసులు పెరుగుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా

COVID-19: మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు..
Coronavirus
Shaik Madar Saheb
|

Updated on: Apr 01, 2021 | 11:27 PM

Share

Maharashtra Corona Cases: దేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య నిత్యం భారీగా పెరుగుతోంది. వేలల్లో కేసులు పెరుగుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. బుధవారం నుంచి గురువారం సాయంత్రం వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 43,183 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 249 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు మహారాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం రాత్రి హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 28,56,163 కి పెరగగా.. మరణించిన వారి సంఖ్య 54,898 కి చేరింది.

ఇదిలాఉంటే.. గత 24 గంటల్లో కరోనా నుంచి 32,641 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 24,33,368 కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం మహారాష్ట్ర వ్యాప్తంగా 3,66,533 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

కాగా మహారాష్ట్ర పూణే జిల్లాలో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఈ జిల్లాలో 8,011 కేసులు నమోదు కాగా.. 65 మంది మరణించారు. ఇదిలాఉంటే.. దేశంలో కరోనా కేసులు, మరణాల పరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఇప్పటికే.. పలు ప్రాంతాల్లో కఠినమైన లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూను సైతం అమలు చేస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో కోవిడ్ కేసులు నిరంతరం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కరోనా నిబంధనలు పాటించకపోతే.. కఠినమైన లాక్డౌన్‌ను అమలు చేయక తప్పదని హెచ్చరించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో ఇప్పటికే.. పలు ప్రాంతాల్లో కఠినమైన లాక్డౌన్, నైట్ కర్ఫ్యూను సైతం అమలు చేస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో కోవిడ్ కేసులు నిరంతరం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Also Read:

Hyderabad: దారుణ హత్య.. శవాన్ని ఫ్రిజ్‌లో ఉంచిన గుర్తు తెలియని వ్యక్తులు.. ఎక్కడంటే..?

ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే