Lockdown: మాస్క్ పెట్టుకోండి మొర్రో అంటున్నా వినరు.. మరోసారి దూసుకొచ్చింది.. మూడు వారాాలు లాక్‌డౌన్‌ పడింది…

మళ్లీ లాక్‌డౌన్‌ వస్తుందా? వస్తే తట్టుకోగలమా? మూతికి మాస్క్‌ పెట్టుకోమంటే పెట్టుకోరు కానీ.. ఇలాంటి చర్చకు మాత్రం తక్కువేమీ లేదు. ఫ్రాన్స్‌లో మాత్రం డెసిషన్ తీసేసుకున్నారు. మూడు వారాల లాక్‌డౌన్‌ విధించేశారు..

Lockdown: మాస్క్ పెట్టుకోండి మొర్రో అంటున్నా వినరు.. మరోసారి దూసుకొచ్చింది.. మూడు వారాాలు లాక్‌డౌన్‌ పడింది...
France Lockdown
Follow us

|

Updated on: Apr 02, 2021 | 7:01 AM

Three-Week Lockdown: కరోనా మహమ్మారి ఊసరవెల్లిని మించిపోయింది. ఎప్పటికప్పుడు రంగులు మార్చుకుంటూ కొత్త సవాళ్లు విసురుతోంది. వైరస్ బారి నుంచి తప్పించుకోవాలంటే మాస్క్ పెట్టుకోవడం, సామాజిక దూరం పాటించడమే మార్గం. మాస్క్ పెట్టుకోండి మొర్రో అంటున్నా కొందరు పట్టించుకోవడం లేదు. అసలు.. ఆ వైరస్‌ ధాటికి ప్రపంచ దేశాలే వణికిపోతున్నాయి. అమెరికా, ఐరోపా అల్లాడిపోతున్నాయి. ఫ్రాన్స్‌లో థర్డ్‌వేవ్‌ కొనసాగుతోంది. కేసుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుండడంతో.. లాక్‌డౌన్‌ విధించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మూడోసారి లాక్‌డౌన్‌ విధించక తప్పట్లేదని ఆ దేశ అధ్యక్షుడు మేక్రాన్‌ ప్రకటించారు.

కరోనా వైరస్‌ తీవ్రతకు ఫ్రాన్స్‌ విలవిల్లాడిపోతోంది. కోవిడ్ కారణంగా సంభవిస్తున్న మరణాలు లక్షకు చేరువయ్యాయి. కరోనా బాధితులతో అక్కడి ఆసుపత్రులు నిండిపోయాయి. ఎమర్జెన్సీ వార్డుల్లో ఖాళీ ఉండట్లేదు. కొత్త రోగులను ఎక్కడ ఉంచాలో కూడా అర్థంకాక తలపట్టుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గమని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

లాక్‌డౌన్ కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉన్నా.. ప్రజల ప్రాణాలను కాపాడుకునేందుకు ఇంతకుమించిన మార్గం కనిపించడం లేదన్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్. ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోకుంటే.. పరిస్థితులు చేజారిపోతాయన్నారు. లాక్‌డౌన్‌ విధించాల్సిన అవసరం ఉందని.. నివేదికలు స్పష్టంచేసినా.. మెక్రాన్‌ మాత్రం ఇన్నాళ్లు ఆ ఆలోచన చేయలేదు.

ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సమయంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తే ఎలాగని ఆలోచించారు. కానీ, కరోనా మహమ్మారి కోరలు చాచడంతో.. మూడోసారి లాక్‌డౌన్‌ విధించాల్సి వచ్చింది. ఫ్రాన్స్‌లో కొవిడ్‌ కేసులు అరకోటి సమీపించినట్టు అంచనా. కరోనా కేసుల్లో ప్రపంచంలో నాలుగోస్థానంలో ఉంది. టీకా అందుబాటులోకి వచ్చినప్పటికీ వ్యాక్సినేషన్‌ ఏమంత వేగంగా సాగడం లేదు. లాక్‌డౌన్‌ కారణంగా వ్యాక్సినేషన్ మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని నిపుణుల హెచ్చరిక. అలాంటిదేమీ ఉండదని.. జూన్‌ నాటికి దేశ జనాభాలో సగం మందికి వ్యాక్సిన్‌ అందించే ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది.

ఇవి కూడా చదవండి : MS Dhoni IPL 2021: సిక్సర్ల తలైవా.. కింగ్ ఆఫ్ ఐపీఎల్… ఎంఎస్ ధోనీ రికార్డుల హిస్టరీని ఓ సారి చూద్దాం..

Indian Traditional Games: ఇంటర్నెట్ జనరేషన్ పిల్లలకు తెలియని మన సాంప్రదాయ భారతీయ ఆటలు ఇవే..