కారులో తేనె టీగల గుంపు.. అవాక్కయిన యజమాని.. సాహసం చేసిన ఫైర్ ఫైటర్
Swarming: తేనె టీగలు కనిపిస్తే.. చాలు మనమంతా భయంతో పరుగులు తీస్తుంటాం. అవి ఎక్కడ కుడతాయోనని దాక్కుంటాం.. సురక్షిత ప్రదేశానికి పరుగులు పెడతాం. ఎందుకంటే తేనె టీగలు కుట్టి చాలా మంది
Swarming: తేనె టీగలు కనిపిస్తే.. చాలు మనమంతా భయంతో పరుగులు తీస్తుంటాం. అవి ఎక్కడ కుడతాయోనని దాక్కుంటాం.. సురక్షిత ప్రదేశానికి పరుగులు పెడతాం. ఎందుకంటే తేనె టీగలు కుట్టి చాలా మంది మరణించిన సందర్భాలున్నాయి. అయితే ఓ భారీ తేనె టీగల సమూహం కారులోకి చొరబడి తొట్టిని ఏర్పాటుచేసుకోగా.. వాటిని ఓ ఫైర్ ఫైటర్ చాకచక్యంగా తొలగించి సురక్షిత ప్రదేశంలో వదిలిపెట్టాడు. ఈ సంఘటన న్యూ మెక్సికోలో ఆదివారం ( మార్చి 28) జరిగింది. న్యూ మెక్సికోలో నివసిస్తున్న ఓ వ్యక్తి దుకాణానికి తన కారులో వెళ్లాడు. కారు ఆపి దుకాణంలోకి వెళ్లి వచ్చే సరికి సుమారు 15000 తేనె టీగల గుంపు లోపలికి వెళ్లి తొట్టి ఏర్పాటుచేశాయి. సాయంత్రం 4గంటల సమయంలో వాటిని గమనించిన కారు యజమాని వెంటనే.. లాస్ క్రూసెస్ అగ్నిమాపక దళానికి సమాచారమిచ్చాడు.
అగ్నిమాపక దళానికి చెందిన జెస్సీ జాన్సన్ వెంటనే అక్కడికి వెళ్లి.. ముందు జాగ్రత్తగా సరైన దుస్తులను ధరించి తేనె టీగలను సురక్షితంగా బయటకు తీశాడు. అనంతరం వాటిని నగరం బయట సురక్షిత ప్రాంతంలో వదిలేశాడు. వాటిని తొలగించడానికి రెండు గంటల సమయం పట్టిందని అధికారులు తెలిపారు. అయితే దీనికోసం ట్రాఫిక్‌ను సైతం నిలిపివేశారు.
అయితే జెస్సీ జాన్సన్ ఖాళీ సమయంలో తేనెటీగలను పెంచుతున్నాడు. అందుకే అతనికి సాధ్యం అయిందంటూ పేర్కొంటున్నారు. జెన్సీ జాన్సన్ చేసిన ఈ సాహసాన్ని లాస్ క్రూసెస్ ఫైర్ డిపార్ట్‌మెంట్ ఫెస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. అయితే జాన్సన్ చేసిన ఈ ప్రయత్నాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. గొప్ప పనిచేశాడంటూ కొనియాడుతున్నారు. కాగా.. తేనె టీగలు ఆ కారునే ఎందుకు ఎంచుకున్నాయి.. అసలు దానిలోకి ఎలా వెళ్లాయి అనేది మిస్టరీగా మారింది.
లాస్ క్రూసెస్ ఫైర్ డిపార్ట్‌మెంట్ షేర్ చేసిన పోస్ట్
Also Read: