World’s Costliest Vegetable: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పంట.. కిలో అక్షరాల లక్ష..
బిహార్‌కు చెందిన అమరేశ్ సింగ్ ఈ అరుదైన పంటను పండిస్తున్నాడు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన పంటగా పిలిచే 'హాప్ షూటర్స్' మొక్కలను ప్రయోగ పద్ధతిలో సాగు చేస్తున్నాడు. వీటి ఖరీదు వింటే..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పంట ఏదై ఉంటుందా అంటే.. అది ఏ వంద రూపాయలో.. కాదు కూడదంటే రూ.1000 ఇంత వరకు మాత్రమే మనకు తెలుసు కాని ఓ పంట ఉంది అది కిలో ఓ లకార ఉంటుంది. అవుండి బాబు.. మీరు చదవుతున్నది నిజమే.. ఇంత ధర ఉంటుందని కాని ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా విన్నారా…? ఇలాంటి పంటను బిహార్ వాసి పండించాడు..
బిహార్‌కు చెందిన అమరేశ్ సింగ్ ఈ అరుదైన పంటను పండిస్తున్నాడు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన పంటగా పిలిచే ‘హాప్ షూటర్స్’ మొక్కలను ప్రయోగ పద్ధతిలో సాగు చేస్తున్నాడు. వీటి ఖరీదు వింటే మీరు ఖర్చితంగా షాక్ అవుతారు. కేజీ హాప్ షూట్స్ధర సుమారు రూ.లక్ష వరకు పలుకుతుంది.
ఔరంగబాద్ జిల్లా నబీనగర్‌లోని కర్మ్‌డీడ్ గ్రామానికి చెందిన అమరేశ్‌సింగ్… చదవుకున్నది మాత్రం ఇంటర్మీడియట్. అమరేశ్.. తనకు తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న ఐదు ఎకరాల పొలంలో ఓ ప్రయోగం చేద్దామని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువునా ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు.
One kilogram of this vegetable costs about Rs 1 lakh ! World’s costliest vegetable,’hop-shoots’ is being cultivated by Amresh Singh an enterprising farmer from Bihar, the first one in India. Can be a game changer for Indian farmers ?https://t.co/7pKEYLn2Wa @PMOIndia #hopshoots pic.twitter.com/4FCvVCdG1m
— Supriya Sahu IAS (@supriyasahuias) March 31, 2021
ఈ బిహారీ పండిస్తున్న పంటను చూసి ప్రపంచ వ్యవసాయ మార్కెట్లు ఆశ్చర్యపోతున్నాయి. ఈ పంటకు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున డిమాండ్ ఉండటమే కారణం. ఆ పంట తన పొలంలోని హాప్ షూట్స్ పంటతో అమరేశ్ అంతర్జాతీయ మార్కెట్లో ఆరేళ్ల క్రితమే వీటి ధర కిలోకు వెయ్యి పౌండ్లుగా ఉంది. దీని ప్రకారం ప్రస్తుతం హాప్ షూట్స్ కిలోకు రూ.లక్షకు పైగా పలికుతుంది అంటున్నాయి మార్కెట్ వర్గాలు.
ఔషధాల గని… అమెరికా, బ్రిటన్, జర్మనీ దేశాల్లో హాప్ షూట్స్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ మొక్కలకు పూసే పుష్పాలను బీర్ల తయారీలో ఉపయోగిస్తారు. హాప్ షూట్స్ పూలు, పండ్లు, కాడలను యాంటీ బయాటిక్స్ వంటి ఔషధాల తయారీలోనూ వినియోగిస్తారు. వీటితో తయారు చేసిన ఔషధాలు టీబీ వంటి వ్యాధుల నివారణలో మెరుగ్గా పనిచేస్తాయి.
“హాప్ షూట్స్” ఔషధాల గని…
ఈ మొక్కల్లో హ్యుములోన్స్, ల్యూపులోన్స్ అనే ఆమ్లాలు ఉంటాయని, మానవ శరీరంలో క్యాన్సర్ కణాలను నిర్మూలించేందుకు ఇవి ఉపయోగపడతాయని పరిశోధనలు వెల్లడించాయి. ఒత్తిడి, ఆందోళన, అనాల్జేసిక్తో పాటు నిద్రలేమిని కూడా ఈ హాప్ షూట్స్‌తో నయం అవుతుందని అంటున్నారు. ఈ హాప్ షూట్స్ మొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కవగా ఉన్నందున.. ఐరోపా దేశాల్లో బ్యూటీ కేర్‌లో ఉపయోగిస్తున్నారు.
బీరులో…
బీరులో సువాసన పెంచేందుకు ఇది చాలా ముఖ్యం. మూలికా ఔషధాల తయారీలో వీటిని వినియోగిస్తూ వచ్చారు. అయితే కాలక్రమేనా కూరగాయల పంటగానూ ఇది మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చింది. వీటి కాడలను వంటల్లో ఉపయోగిస్తారు.
పంట ఎక్కడ పండుతుంది…
ఈ పంట పండించాలంటే వాతావరణం చల్లగా ఉండాలి. మార్చి నుంచి జూన్ మధ్య పంట సాగు చేస్తుంటారు. తగినంత తేమ, సూర్యరశ్మి ఉంటే మొక్కలు వేగంగా పేరుగుతాయి. వారణాసిలోని ఇండియన్ వెజిటేబుల్ రీసెర్చ్‌కు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త డా. లాల్ సహకారంతో హాప్ షూట్స్‌ను అమరేశ్ పండిస్తున్నాడు.
ఎందుకు ఖరీదైనవి?
హాప్ షూట్స్ చాలా చిన్నగా ఉంటుంది. చాలా తేలికగా ఉంటాయి. కనకాంబరం పూలుతో ఇది సమానంగా బరువు ఉంటుంది. చాలా చిన్నవి కాబట్టి మీరు క్యారియర్ బ్యాగ్ నింపడానికి వందల సంఖ్యలో హాప్ షూట్స్ తీసుకోవాలి. అందుకే ఇది చాలా ఖరీదైన పంటగా చెప్పుకుంటాయి వ్యవసాయ మార్కెట్లు.
ఇవి కూడా చదవండి: లడ్డూ,పులిహోర తయారీ లెక్కల్లో తేడాలు..చీరల విక్రయాల్లోనూ ఆమ్యామ్యాలు.. లెక్క తేల్చే పనిలో విజిలెన్స్ అధికారులు