లడ్డూ,పులిహోర తయారీ లెక్కల్లో తేడాలు..చీరల విక్రయాల్లోనూ ఆమ్యామ్యాలు.. లెక్క తేల్చే పనిలో విజిలెన్స్ అధికారులు

దుర్గ గుడి ఆలయంలో ఎప్పుడో వివాదం చోటు చేసుకుంటోంది. తాజాగా విజిలెన్స్‌ అధికారులు దుర్గ గుడిలో సోదాలు నిర్వహించారు. నిత్యాన్నాదాన కాంట్రాక్టులో అవకతవకలు జరిగినట్టు గుర్తించారు విజిలెన్స్‌ అధికారులు...

లడ్డూ,పులిహోర తయారీ లెక్కల్లో తేడాలు..చీరల విక్రయాల్లోనూ ఆమ్యామ్యాలు.. లెక్క తేల్చే పనిలో విజిలెన్స్ అధికారులు
Vigilance Officials Raid Vi
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 01, 2021 | 7:34 AM

Vigilance Raid Durga temple: దుర్గ గుడిలో సోదాలు నిర్వహించిన విజిలెన్స్‌ అధికారులు లడ్డూ, పులిహోర తయారీ లెక్కల్లో తేడాలు ఉన్నట్టు గుర్తించారు. అటు దుర్గమ్మ చీరల విక్రయాల్లోనూ అవకతవకలు జరిగినట్టు తేల్చారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గ గుడి ఆలయంలో ఎప్పుడో వివాదం చోటు చేసుకుంటోంది. తాజాగా విజిలెన్స్‌ అధికారులు దుర్గ గుడిలో సోదాలు నిర్వహించారు. నిత్యాన్నాదాన కాంట్రాక్టులో అవకతవకలు జరిగినట్టు గుర్తించారు విజిలెన్స్‌ అధికారులు.

ఈవో సురేష్‌బాబు నిర్ణయంతో చీరలు విక్రయించినట్టు గుర్తించారు. చీరల కౌంటర్ లో దేవాదాయశాఖ కమిషనర్‌ అనుమతి లేకుండా సొంత నిర్ణయంతో చీరల విక్రయం జరిగినట్టు తేల్చారు. అటు లడ్డూ, పులిహోర తయారీ, అమ్మకాల్లో లెక్కలను తారుమారు చేసినట్టు గుర్తించారు. బుధవారం  మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు తనిఖీలు నిర్వహించారు విజిలెన్స్‌ అధికారులు. సెక్యూరిటీ, శానిటరీ టెండర్లలో అవకతవకలపై విజిలెన్స్‌కు ఫిర్యాదులు అందడంతో సోదాలు చేపట్టారు. ఇప్పటికే ఏసీబీ సోదాల్లో 15 మంది అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడింది.

ఇటీవల కూడా దుర్గగుడిలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. జమ్మిదొడ్డిలోని ఆలయ పరిపాలన కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఎస్టాబ్లిష్ మెంట్ విభాగంలో రికార్డుల పరిశీలించారు. 15 మంది ఏసీబీ అధికారుల బృందం తనిఖీలు చేసింది. గత ఫిబ్రవరి నెలలో మూడు రోజులపాటు దుర్గగుడిలో సోదాలు నిర్వహించిన ఏసీబీ బృందాలు కీలక విభాగాల్లో అవినీతిని గుర్తించారు.

అప్పటికే 15 మంది సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు పడటంతో…తమదాకా వస్తుందేమోనని మరికొందరు హడలిపోయారు. తాజాగా లడ్డూ, పులిహోర తయారీ, విక్రయాల లెక్కల్లో తేడాలున్నట్టు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. అటు ఈవో సురేష్‌బాబు సొంత నిర్ణయంతో చీరల విక్రయాలు జరిగినట్టు గుర్తించారు. దీంతో ఈసారి మళ్లీ ఎంత మందిపై వేటు పడుతుందోననే ఉత్కంఠ నెలకొంది.

ఇవి కూడా చదవండి: IPL 2021: ముంబై ఇండియన్స్ ‘క్యూటెస్ట్’ వైరల్ వీడియో.. తండ్రిని మించిన తనయ.. పుల్ షాట్ ఆడి దించేసిందిగా..