బైక్ అడ్డగించి పొదల్లోకి లాక్కెళ్లి.. భర్త ముందే మహిళపై గ్యాంగ్ రేప్, వీడియో చిత్రీకరణ, ఆపై నిలువు దోపిడీ
Agra Woman gang-raped : చారిత్రక నగరం ఆగ్రాలో ఒక ఘోరమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సోమవారం సాయంత్రం బైక్‌పై వెళ్తోన్న దంపతుల్ని ముగ్గురి వ్యక్తులు అడ్డగించారు. భార్యాభర్తలిద్దర్నీ కొట్టి, భర్త ముందే మహిళపై..
Agra Woman gang-raped : చారిత్రక నగరం ఆగ్రాలో ఒక ఘోరమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సోమవారం సాయంత్రం బైక్‌పై వెళ్తోన్న దంపతుల్ని ముగ్గురి వ్యక్తులు అడ్డగించారు. భార్యాభర్తలిద్దర్నీ కొట్టి, భర్త ముందే మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. అంతేకాదు, ఈ పైశాచికాన్నంతా వీడియో తీశారు. ఆపై బాధితుల దగ్గరున్న పదివేల రూపాయలు, మహిళ చెవిపోగులు, పలు వస్తువులు సహా సర్వస్వం దోచుకుపారిపోయారు. బాధిత మహిళ జరిగిన ఘటనపై ఆగ్రాలోని ఎత్మదుల్లా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
నిందితులను వెతకడానికి ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ సత్యజిత్ గుప్తా తెలిపారు. బాధిత మహిళను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి పంపారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో జరిగింది. దంపతులిద్దరూ బైక్ పై ఎత్మద్దులా లోని మహిళ తల్లిదండ్రుల ఇంటికి వెళుతుండగా, సాయుధులైన ముగ్గురు మృగాళ్లు అకస్మాత్తుగా దాడి చేసి బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టారని బాధితులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.