Raw Milk Beauty Tips : పచ్చిపాలతో జిడ్డు చర్మాన్ని కడిగేయండి..! ఫలితం ఎలా ఉంటుందంటే మీరు ఊహించలేరు.. ఎవ్వరైనా సరే..

Raw Milk Beauty Tips : పాలు తాగడం ద్వారా శక్తి లభిస్తుందని అందరికి తెలుసు. అయితే ఒక శక్తియే కాకుండా పాల ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా

Raw Milk Beauty Tips : పచ్చిపాలతో జిడ్డు చర్మాన్ని కడిగేయండి..! ఫలితం ఎలా ఉంటుందంటే  మీరు ఊహించలేరు.. ఎవ్వరైనా సరే..
Raw Milk Beauty Tips
Follow us
uppula Raju

|

Updated on: Apr 01, 2021 | 6:15 PM

Raw Milk Beauty Tips : పాలు తాగడం ద్వారా శక్తి లభిస్తుందని అందరికి తెలుసు. అయితే ఒక శక్తియే కాకుండా పాల ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా పచ్చిపాలు ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి, జుట్టు సమస్యలకు చాలా బాగా ఉపయోగపడుతాయి. పాలలో విటమిన్ ఎ, డి, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా వేసవి కాలంలో చర్మం పొడిబారిపోతుంది. ఈ సీజన్‌లో చర్మాన్ని తేమగా ఉంచడానికి పచ్చి పాలకంటే గొప్పది ఏదీ లేదు. పొడి చర్మం నుంచి తప్పించుకోవడానికి పచ్చిపాలను ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే విటమిన్లు చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి పనిచేస్తాయి. చర్మ సమస్య నుంచి బయటపడేలా చేస్తుంది. ముడి పాలు మన చర్మానికి, జుట్టుకు ఎలా ఉపయోగపడుతాయో తెలుసుకుందాం.

1. పచ్చి పాలు, పసుపు ప్యాక్ ముడి పాలు ముఖాన్ని శుభ్రపరచడంతో పాటు చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అదే సమయంలో, పసుపు అనేది సహజమైన బ్లీచింగ్ ఏజెంట్, ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడానికి అలాగే ముఖ మచ్చలను వదిలించుకోవడానికి పనిచేస్తుంది. చర్మ సమస్య నుంచి బయటపడటానికి, పాలు, పసుపు పేస్ట్ లా తయారు చేసుకోండి. ఈ పేస్ట్ ను ముఖం మీద పూయండి.. చేతులతో 5 నుంచి 7 నిమిషాలు మసాజ్ చేయండి. కొద్ది సేపటికి చల్లటి నీటితో కడుక్కోండి.. మంచి ఫలితాల కోసం ఈ పేస్ట్‌ను వారానికి రెండుసార్లు అప్లై చేయండి..

2. తేనె, పచ్చి పాల ప్యాక్ మీ చర్మ సమస్యలకు తేనె అనేది చక్కటి పరిష్కారం.. చర్మం పొడిగా లేదా సున్నితంగా ఉంటే ఈ రెండిటిని కలిపిన పేస్ట్‌ను అప్లై చేయండి. ఇందుకోసం మీరు 2 టీస్పూన్ల పచ్చి పాలలో ఒక టీస్పూన్ తేనె కలపాలి. పేస్ట్‌లా చేసి ముఖానికి రాయండి. సుమారు 10 నుంచి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కోండి. మీరు ఈ పేస్ట్ ను చర్మంపై మాత్రమే కాకుండా జుట్టుకు కూడా అప్లై చేసుకోవచ్చు. జుట్టుకు అప్లై చేసిన తరువాత, సహజమైన షాంపూతో కడగాలి.

3. పచ్చి పాలు, క్యారెట్ రసం ప్యాక్‌ క్యారెట్లలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి. . ఒక కుండలో 2 నుంచి 3 టీస్పూన్ల పచ్చి పాలు, ఒక టీస్పూన్ పెరుగు, 2 నుంచి 3 టీస్పూన్ల క్యారట్ జ్యూస్ కలపండి. ఈ ముఖాన్ని పేస్ట్ లా చేసి ముఖంపై పూయండి. 10 నుంచి 15 నిమిషాల తరువాత శుభ్రమైన నీటితో కడుక్కోండి. ఇక చూసుకోండి మీ చర్మం ఆరోగ్యంగా మెరుస్తూ కనిపిస్తుంది.

World’s Costliest Vegetable: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పంట.. కిలో అక్షరాల లక్ష..

Telangana Inter Hall Tickets: తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్స్ వచ్చేశాయి… డౌన్‌లోడ్ లింక్ ఇదే.. ఇలా పొందండి..

మాట ఇచ్చి తప్పిన అనుష్క శర్మ..! విరాట్‌ ఒప్పుకునేనా..? సోషల్‌ మీడియాల్ వైరల్‌ అవుతున్న వీడియో.. మీరు ఓ లుక్కేయండి..