AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాట ఇచ్చి తప్పిన అనుష్క శర్మ..! విరాట్‌ ఒప్పుకునేనా..? సోషల్‌ మీడియాల్ వైరల్‌ అవుతున్న వీడియో.. మీరు ఓ లుక్కేయండి..

Anushka Sharmas Video Viral : ఇటీవల తల్లిగా మారిన అనుష్కశర్మ తిరిగి తన పనిని ప్రారంభించింది. అయితే గతంలో ఆమె మాట్లాడిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్‌గా

మాట ఇచ్చి తప్పిన అనుష్క శర్మ..!  విరాట్‌ ఒప్పుకునేనా..? సోషల్‌ మీడియాల్ వైరల్‌ అవుతున్న వీడియో.. మీరు ఓ లుక్కేయండి..
Anushka Sharmas
uppula Raju
|

Updated on: Apr 01, 2021 | 5:35 PM

Share

Anushka Sharmas Video Viral : ఇటీవల తల్లిగా మారిన అనుష్కశర్మ తిరిగి తన పనిని ప్రారంభించింది. అయితే గతంలో ఆమె మాట్లాడిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారుతోంది. 2012 లో ఇండియాస్ మోస్ట్ డిజైరబుల్ టాక్ షో హోస్ట్ సిమి గరేవాల్‌తో ఇంటర్వ్యూ సందర్భంగా పెళ్లి గురించి, ఇండస్ట్రీ గురించి పలు విషయాలను వెల్లడించారు.

ఆ వీడియోలో వివాహం తర్వాత మీరు పనిచేయదలిచారా అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు అనుష్క ఈ విధంగా సమాధానమిచ్చింది. పెళ్లి తర్వాత తాను పనిచేయదలుచుకోలేదని చెప్పింది. వివాహం తనకు చాలా ముఖ్యమని, పెళ్లి చేసుకొని పిల్లలను కనాలని అనుకుంటున్నానని తెలిపింది. అంతేకాకుండా పెళ్లి తర్వాత సినిమాలు, యాడ్స్ వంటివి చేయనని వెల్లడించింది. అయితే అప్పుడు అలా మాట్లాడిన అనుష్క ఇప్పుడు పెళ్లి తర్వాత, పాప పుట్టిన తర్వాత యాడ్స్‌లో నటించడానికి సిద్ధమైంది. దీంతో గతంలో మాట్లాడిన ఆ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. అనుష్క శర్మ మాటి ఇచ్చి తప్పిందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

అనుష్క శర్మ, క్రికెటర్ విరాట్ కోహ్లీని 2017 లో వివాహం చేసుకుంది. సిమి గరేవాల్‌తో ఇంటర్వ్యూ తర్వాత సంవత్సరం 2013 లో ఈ జంట షాంపూ కోసం వాణిజ్య ప్రకటనలో కలిసి నటించారు. చాలా సంవత్సరాలు డేటింగ్ చేసిన తరువాత వారు టుస్కానీలోని గ్రామీణ రిసార్ట్‌లో డిసెంబర్ 2017 లో వివాహం చేసుకున్నారు. వామికా అనే కుమార్తెకు జన్మనిచ్చారు. అయితే.. తన కుమార్తె జన్మించిన మూడు నెలల తరువాత, అనుష్క శర్మ బుధవారం ఒక వాణిజ్య ప్రకటనలో నటించడానికి సిద్దమైంది. అనుష్క శర్మ 2008 లో రాబ్ నే బనా డి జోడి చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు . 2011-12లో, పాటియాలా హౌస్, లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్ , జబ్ తక్ హై జాన్ అనే మూడు చిత్రాల్లో నటించింది . తన వివాహం తరువాత, పరి, సంజు, సుయిధాగా, జీరో వంటి సినిమాలు చేసింది.

Vodafone Idea: జనవరిలో భారీస్థాయిలో వినియోగదారులను కోల్పోయిన వోడాఫోన్ ఐడియా

Assam Election 2021 2nd Phase Voting LIVE: అసోంలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు రెండో విడత పోలింగ్‌