AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vodafone Idea: జనవరిలో భారీస్థాయిలో వినియోగదారులను కోల్పోయిన వోడాఫోన్ ఐడియా

ట్రాయ్ కి తెలిపిన లెక్కల ప్రకారం వోడాఫోన్ ఐడియా టెలికాం నెట్వర్క్ జనవరి నెలలో పెద్ద సంఖ్యలో వినియోగదారులను కోల్పోయింది.

Vodafone Idea: జనవరిలో భారీస్థాయిలో వినియోగదారులను కోల్పోయిన వోడాఫోన్ ఐడియా
Vodafone Idea
Anil kumar poka
|

Updated on: Apr 01, 2021 | 5:35 PM

Share

Vodafone Idea: వోడాఫోన్ ఐడియా మొబైల్ నెట్ వర్క్ జనవరి నెలలో 2.3 మిలియన్ వైర్ లెస్ వినియోగదారులను కోల్పోయినట్టు ప్రకటించింది.  నిజానికి ట్రాయ్ కి సమర్పించిన నివేదికలో ఈ సంవత్సరం జనవరి నెలలో తమకు 1.7 మిలియన్ వినియోగదారులు  కొత్తగా యాడ్ అయినట్టు తెలిపింది. అయితే, తమ లెక్కల్లో అనుకోకుండా జరిగిన పొరపాట్ల కారణంగా కొత్తగా వినియోగదారులు తమ నెట్ వర్క్ కు కనెక్ట్ అయినట్టు పేర్కొన్నట్లు కంపెనీ తమ వెబ్సైట్ లో తెలిపింది.

ఇదేవిషయాన్ని ఎకనామిక్ టైమ్స్ తన రిపోర్టులో తెలిపింది. ట్రాయ్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం వోడాఫోన్ ఐడియా (వీఐ) జనవరి నెలలో 2.3 మిలియన్ వైర్ లెస్ వినియోగదారులను కోల్పోయిందని తెలిపింది. అదేవిధంగా డిసెంబర్ 2020లో వీఐ 5.7 మిలియన్ల కస్టమర్లను కోల్పోయింది.  గత సంవత్సరం మార్చి నెల తరువాత ఇంత మొత్తంలో వినియోగదారులను వీఐ కోల్పోవడం ఇదే తొలిసారి అని ఆ రిపోర్టులో చెప్పుకొచ్చారు.

ఇక ఈ విషయంపై వీఐ తన వెబ్ సైట్ లో వివరాలు తెలిపింది. అనుకోకుండా జరిగిన ఒక తప్పిదం వలన తమ వినియోగదారుల లెక్కల్లో పొరపాట్లు దొర్లాయని ఆ వెబ్ సైట్ లో చెప్పారు. ట్రాయ్ కు జనవరి లో సమర్పించిన నివేదికలో జరిగిన పొరబాటును సరిచేశామని పేర్కొన్నారు.

ఇక ఇదే సమయంలో వీఐ కంపెనీ పోటీ కంపెనీలు ఎయిర్ టెల్, రిలయన్స్ జియో లు బాగా పుంజుకున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఎయిర్ టెల్ 5.9 మిలియన్ల వినియోగదారులను, జియో 2 మిలియన్ల వినియోగదారులను కొత్తగా ఆకట్టుకోగలిగాయి. అదేవిధంగా జియో మార్కెట్ లో తన నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకుంది. జియోకు మొత్తం టెలికాం వైర్లెస్ మార్కెట్ లో 35.30 శతం వాటా ఉండగా.. ఎయిర్ టెల్ కు 29.62 శాతం మార్కెట్ వాటా ఉంది.

అలాగే, మొత్తం వైర్లెస్ వినియోగదారులు డిసెంబర్ 2020లో 1153.77 మిలియన్ ఉండగా జనవరి 2021లో వీరి సంఖ్య 1163.41 మిళియన్లకు చేరుకుంది. దీంతో టెలికాం పరిశ్రమలో వినియోగదారుల సంఖ్యలో 0.84 శాతం వృద్ధి చెందినట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : April 1 Changes: ఏప్రిల్ ఒకటి.. క్యాలెండర్ మారడమే కాదండోయ్.. మన జీవితాల్లో భారీ మార్పులు రాబోతున్నాయి.. భయపడొద్దే..!

సందిగ్ధతను తొలగించిన నిర్మలా సీతారామన్, ఇప్పటివరకూ ఉన్న వడ్డీరేట్లు కొనసాగుతాయని క్లారిటీ