కస్టమర్లకు బంపర్‌ ఆఫర్లు.. జియో, వోడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ పోస్టు పెయిడ్‌ ప్లాన్స్‌ ఇవే..!

వివిధ రకాల టెలికాం కంపెనీలు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా కంపెనీలు పోస్టు పెయిడ్‌ ప్లాలలో ఆఫర్లను...

  • Subhash Goud
  • Publish Date - 7:17 am, Thu, 1 April 21
1/4
Jio
వివిధ రకాల టెలికాం కంపెనీలు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. తాజాగా జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా కంపెనీలు పోస్టు పెయిడ్‌ ప్లాలలో ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. జియో రూ.1499 పోస్టుపెయిడ్‌ ప్లాన్‌: ఈ పోస్టు పెయిడ్‌ ప్లాన్‌ 500 జీబీ రోల్‌ఓవర్‌ డేటాతో 300 జీబీ డేటాను అందిస్తుంది. అలాగే రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత కాల్స్‌ కూడా అందిస్తుంది. అలాగే స్ట్రీమింగ్‌ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌, డిస్నీ+హట్‌స్టార్‌ ప్రయోజనాలు ఉన్నాయి.
2/4
Vi
వోడాఫోన్‌ ఐడియా రూ.10989 ప్లాన్‌ : వోడాఫోన్‌ ఐడియా నుంచి వచ్చిన పోస్టు పెయిడ్‌ ప్లాన్‌ రూ.1099. ఇది అపరిమిత డేటా, నెలకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత కాల్స్‌ అందజేస్తుంది. అమెజాన్‌ ప్రైమ్‌, డిస్ని, హట్‌స్టార్‌, సినిమాలను కూడా అందిస్తుంది. అలాగే అమెజన్‌ ప్రైమ్‌కు సంవత్సరం పాటు సభ్యత్వాన్ని అందిస్తుంది.
3/4
Idea
Ideaవోడాఫోన్‌ ఐడియా రూ.1348 ఫ్యామిలీ పోస్టుపెయిడ్‌ ప్లాన్‌: రూ.1348 ఫ్యామిలీ పోస్టుపెయిడ్‌ ప్లాన్‌తో అపరిమిత డేటాతో పాటు అపరిమిత కాల్స్‌, రెండు కనెక్షన్లు, నెలకు 100 ఎస్‌ఎంఎస్‌లు అందించనుంది. అలాగే నెట్‌ప్లిక్స్‌, అమెజన్ ప్రైమ్‌, వీఐపీ డిస్నీ, హట్‌స్టార్‌లకు ఒక సంవత్సరం పాటు సభ్యత్వాన్ని కూడా అందిస్తుంది. సెకండరీ కనెక్షన్‌కు ఏ నెట్‌ వర్క్‌కు అయినా అపరిమిత కాల్స్‌, 50 జీబీ డేటా, హైస్పీడ్‌ ఇంటర్నెట్‌, నెలకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.
4/4
Airtel
ఎయిర్‌టెల్ రూ .1599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్: ఎయిర్‌టెల్ యొక్క అత్యంత ఖరీదైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్ 3 జి లేదా 4 జి రోల్‌ఓవర్ డేటాతో అపరిమిత డేటాను మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను ఇస్తుంది. ఇది అపరిమిత కాల్స్ మరియు అమెజాన్ ప్రైమ్, డిస్నీ + హాట్స్టార్ మరియు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్‌లకు ఒక సంవత్సరం సభ్యత్వం ఇస్తుంది.