Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

April 1 Changes: ఏప్రిల్ ఒకటి.. క్యాలెండర్ మారడమే కాదండోయ్.. మన జీవితాల్లో భారీ మార్పులు రాబోతున్నాయి.. భయపడొద్దే..!

ఏప్రిల్ ఒకటి వచ్చేసింది.. మార్చి నెల క్యాలెండర్ మారితే ఏప్రిల్ కదా అని లైట్ తీసుకోకండి.. ప్రతి ఏడా ఈ రోజు పెద్ద మార్పులకు అడుగు పడుతుంది. ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక...

April 1 Changes: ఏప్రిల్ ఒకటి.. క్యాలెండర్ మారడమే  కాదండోయ్.. మన జీవితాల్లో భారీ మార్పులు రాబోతున్నాయి.. భయపడొద్దే..!
April 1
Follow us
Sanjay Kasula

| Edited By: Team Veegam

Updated on: Apr 01, 2021 | 11:19 AM

April 1 Major Changes: ఏప్రిల్ ఒకటి వచ్చేసింది.. మార్చి నెల క్యాలెండర్ మారితే ఏప్రిల్ కదా అని లైట్ తీసుకోకండి.. ప్రతి ఏడా ఈ రోజు పెద్ద మార్పులకు అడుగు పడుతుంది. ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే తేది. కంపెనీలకు, ఉద్యోగులకు, ప్రభుత్వాలకు ఈ తేదీ నుంచే ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.  ఏప్రిల్ ఒకటి నుంచే చాలా మార్పులు, చేర్పులు చేసుకుంటాయి. పలు బ్యాంకుల పాస్ బుక్కులు పని చెయ్యవు.. ఇలాంటి అంశాలు చాలానే ఉన్నాయ్‌.. అవేంటో ఓ సారి లుక్కేద్దాం..

బడ్జెట్‌లో ప్రతిపాదించిన అనేక ప్రతిపాదనలు అమలులోకి వచ్చేది ఈ తేదీ నుంచే. ఈసారి కార్లు, బైక్‌లు, టీవీలు, ఏసీల రూపంలో సామాన్యులపై భారంపడే అవకాశం కనిపిస్తోంది.

ఇక సామాన్యులు కూడా ఎగిరిపోవాలని కలలుకనే విమాన ప్రయాణం కూడా మరింత ప్రియంగా మారిపోనుంది.  కొత్త ఆర్థిక ఏడాది నుంచి కార్లు, బైక్‌ల ధరలు దూర తీరాలుకు చేరబోతున్నాయి. నూతన ఆర్థిక సంవత్సరం తొలిరోజు నుంచే టీవీల ధరలు పెరగనున్నాయి. తాపం నుంచి ఉపశమనం పొందాలనుకునే వారిపై మరింత భారం పడనుంది. టీవీ, ఏసీలపై రూ. 3 వేల నుంచి 4వేలు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముడి పదార్థాల ధరలు పెరుగుతున్న కారణంగా వివిధ ఉత్పత్తుల ధరలు పెంచేందుకు ఏసీలు, ఫ్యాన్ల తయారీ కంపెనీలు సిద్ధం అవుతున్నాయి. తయారీ వ్యవయాలు పెరగడంతో ధరలు కొండెక్కనున్నాయి.

ఈపీఎఫ్‌ వడ్డీపై పన్నుపోటు..

ఏప్రిల్‌ 1, 2021 నుంచి ఉద్యోగ భవిష్య నిధి(EPF‌) ఖాతాలో పెట్టే పెట్టుబడులు ఆదాయ పన్ను నుంచి తప్పించుకోలేవు. ఎలాగంటే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షల కంటే (బడ్జెట్‌లో చెప్పిన దాని ప్రకారం) ఎక్కువ ఈపీఎఫ్‌లో పెట్టుబడులు పెడితే.. దానిపై వచ్చే వడ్డీకి పన్ను విధిస్తారు. అయితే.. తాజాగా ఈ పన్ను మినహాయింపు పెట్టుబడులను రూ.5 లక్షలకు పెంచారు.

ఈ పీఎఫ్‌ జమల్లో కంపెనీ వాటా ఉండకూడదు. ప్రైవేటు ఉద్యోగులు వడ్డీపై పన్ను పడకూడదనుకుంటే ఈపీఎఫ్‌, వీపీఎఫ్‌ కలిపి గరిష్ఠంగా రూ.2.5 లక్షల వరకే జమ చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సంస్థ  నుంచి ఎటువంటి వాటా ఉండదు కాబట్టి రూ.5 లక్షల వరకు వీళ్లు జమ చేసుకున్నా.. వడ్డీపై పన్ను పడదు.

ఇవి కూడా చదవండి : IPL 2021: ముంబై ఇండియన్స్ ‘క్యూటెస్ట్’ వైరల్ వీడియో.. తండ్రిని మించిన తనయ.. పుల్ షాట్ ఆడి దించేసిందిగా..

ఏప్రిల్ 1 నుంచి ఈ 5 పనులను ప్రారంభించండి… కష్ట సమయాల్లో కూడా డబ్బు కొరత ఉండదు..

తెలుగు రాష్ట్రాల్లో మరింత తగ్గిన బంగారం మరియు వెండి ధరలు…