AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

April 1st Planning: ఏప్రిల్ 1 నుంచి ఈ 5 పనులను ప్రారంభించండి… కష్ట సమయాల్లో కూడా డబ్బు కొరత ఉండదు..

ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం గట్టెక్కడం ఎలాగో తెలుసుకుందాం... వీటి సహాయంతో మీరు కొత్త ఆర్థిక సంవత్సరంలో డబ్బు విషయంలో మీ భవిష్యత్తును భద్రపరిచే దిశగా వెళ్ళగలుగుతారు. వాటి గురించి తెలుసుకుందాం…

April 1st Planning:  ఏప్రిల్ 1 నుంచి ఈ 5 పనులను ప్రారంభించండి... కష్ట సమయాల్లో కూడా డబ్బు కొరత ఉండదు..
Financial Planning Savings
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 31, 2021 | 6:23 PM

Financial Planning: గత ఏడాది దేశాన్ని కోవిడ్ ఉక్కిరిభిక్కిరి చేసింది.. ప్రతి కుటుంబ ఆర్ధిక పరిస్థితిని ఆందోళనకరంగా మార్చేసింది.  అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో తగినంత మూలధనం ఉంటే ఇబ్బందులు కొద్దిగా తేలికవుతాయి. ప్రతి ఒక్కరూ భవిష్యత్తును భద్రపరచడానికి ఆర్థిక ప్రణాళిక చేసుకోవాలి. ఇలాంటి ఒక అంటువ్యాధి వ్యాప్తి గురించి ముందుగానే ఊహించలేవు.. కానీ దాన్ని ఎదుర్కోవటానికి .. మన ఆర్ధిక పరిస్థితిపై ప్రభావాన్ని తగ్గించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఈ దృష్ట్యా…  ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం గట్టెక్కడం ఎలాగో తెలుసుకుందాం… వీటి సహాయంతో మీరు కొత్త ఆర్థిక సంవత్సరంలో డబ్బు విషయంలో మీ భవిష్యత్తును భద్రపరిచే దిశగా వెళ్ళగలుగుతారు. వాటి గురించి తెలుసుకుందాం…

1. ఆరోగ్య బీమా:

అనారోగ్యం త‌ర్వాత ఆసుప‌త్రి ఖ‌ర్చులు భ‌రించేందుకు క‌ష్ట‌ప‌డుతూ ఉండ‌టం మ‌నం అప్పుడ‌ప్పుడు చూస్తుంటాం. అన్ని ఫీచ‌ర్లు ఉండే ఉత్త‌మ పాల‌సీ లేద‌నే కార‌ణంతో ఆరోగ్య బీమా తీసుకోవ‌డాన్ని కొంత మంది వాయిదా వేస్తుంటారు. ఆరోగ్య సమస్యలు మీ ఖర్చులను పెంచడమే కాక, మీ ఆదాయాన్ని కూడా తగ్గిస్తాయి. అందుకే, మీ పెట్టుబడి ప్రణాళికలో ఆరోగ్య బీమాను ఉంచండి. ఆరోగ్య బీమా పాలసీ సహాయంతో మీరు మీ వైద్య ఖర్చులను పరిష్కరించవచ్చు, మీ కుటుంబ అవసరాలను తీర్చవచ్చు. యుక్త వ‌య‌సులో పాల‌సీ తీసుకుంటే పెద్ద‌గా ఆరోగ్య ప‌రీక్ష‌లు, ఎక్కువ ప్రీమియం బాధ లేకుండానే మంచి ఆరోగ్య బీమా పాల‌సీని కొనుగోలు చేయ‌వ‌చ్చు.

 2. టర్మ్ ప్లాన్/ పర్సనల్ ఎ యాక్సిడెంట్:

ఇన్సూరెన్సు తీసుకొనే వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని, చెల్లించిన ప్రీమియం ను తిరిగి పొందగలిగే అవకాశం ఉన్న టర్మ్ ప్లాన్ నే  టి ఆర్ ఓ పి అని పిలుస్తారు.  మిగిలిన ప్రామాణిక టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ వలె ఈ  టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ అఫ్ ప్రీమియం ప్లాన్ కూడా ఆర్ధిక భద్రత తో పాటు కుటుంబాన్ని ప్రతికూల పరిస్థితుల బారి నుండి సంరక్షిస్తుంది. టర్మ్ ప్లాన్ సహాయంతో మీరు మీ తర్వాత కూడా మీ కుటుంబాన్ని రక్షించుకోవచ్చు. అలాగే టర్మ్ ప్లాన్ సహాయంతో  మీరు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి కింద పన్నును కూడా ఆదా చేయవచ్చు. టర్మ్ ప్లాన్‌లో ఏదైనా కారణం వల్ల మరణం జరిగితే, కుటుంబానికి హామీ మొత్తం లభిస్తుంది. అయితే, వ్యక్తిగత ప్రమాద బీమా సహాయంతో, మరణం మరియు మరణం కారణంగా శాశ్వత వైకల్యం సంభవించినప్పుడు కవరేజ్ అందించబడుతుంది. అయితే, మీకు పూర్తి రక్షణ కావాలంటే, వ్యక్తిగత ప్రమాద కవర్ కూడా తీసుకోండి.

3. ఇల్లు లేదా ఆస్తి యొక్క భీమా:

మీరు మీ ఆరోగ్యంతోపాటు జీవితాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నట్లే, మీరు మీ ఆస్తిని కూడా కాపాడుకోవాలి. ప్రకృతి వైపరీత్యంలో కానీ మానవ తప్పిదాల వల్ల కలిగే సంక్షోభంలో మీకు ఆర్థిక భద్రత లభిస్తుంది. గృహ భీమా పాలసీ సహాయంతో మీ ఇల్లు కాని ఆస్తికి నష్టం జరిగినప్పుడు మీపై ఆ ఆర్థికం  ప్రభావితం  పడకుండా ఉంటుంది.

4. మ్యూచువల్ ఫండ్స్:

మ్యూచువల్ ఫండ్, పెట్టుబడిదారుల నుంచి సేకరించిన లక్ష్యాలతో పెట్టుబడి పెట్టిన ధన నిధి. అనేకమంది పెట్టుబడిదారుల నుండి జమచేసిన మొత్తాన్ని వృత్తిపరంగా నిర్వహిస్తూ దానిని స్టాక్లు, బోండ్లు, స్వల్పకాలపరిమితి ద్రవ్యమార్కెట్ వస్తువులు, ఇతరసెక్యురిటీలలోసామూహిక పెట్టుబడి పెట్టడమే మ్యూచువల్ ఫండ్ సెక్యురిటీ అని చెప్పవచ్చు. ఇలా పోగుచేసినమొత్తంతో క్రమబద్ధంగా వ్యాపారం చేయడానికి మ్యూచువల్ ఫండ్ కు ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు. నికర లాభం లేదా నష్టం పెట్టుబడిదారులకు ప్రతి సంవత్సరం ఒకే మాదిరిగా పంపిణీ చేయబడుతుంది.వ్యక్తిగత సెక్యూరిటీలలో ప్రత్యక్ష పెట్టుబడితో పోలిస్తే మ్యూచువల్ ఫండ్లకు ప్రయోజనాలు ఎక్కువ. మీరు 1 నెల నుండి 10 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.  అంతే కాకుండా మ్యూచువల్ ఫండ్లలో పెద్ద ఎత్తున పథకాలలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కూడా ఉంది. ఈ ఎంపికలో మీరు సరైన వ్యూహాన్ని రూపొందించడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చు. మీ రిస్క్ పరిమితిని బట్టి మీరు పెట్టుబడి ఎంపికను ఎంచుకోవచ్చు. కానీ దీని కోసం, మీరు సరైన సమాచారాన్ని సేకరించడం ద్వారా మాత్రమే ఏదైనా అడుగు వేయాలి.

5. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్:

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) అకౌంట్ అనేది చాలా పాపులర్ దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్. ఇందులో ఇన్వెస్ట్‌మెంట్లకు కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంది. కనీసం రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేయవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే పిపిఎఫ్ వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇది ప్రతి త్రైమాసికంలో సవరించబడుతుంది. స్థిర డిపాజిట్ల కంటే పిపిఎఫ్ అధిక వడ్డీ రేటును కలిగి ఉందని మునుపటి డేటా చూపిస్తుంది.

ప్రతి ఒక్కరూ వారి రిస్క్, ఆర్థిక అవసరాలను బట్టి ఎంచుకోవలసిన కొన్ని ఎంపికలు ఇవి. వాటిపై రాబడి, ఇతర ప్రయోజనాలు మీరు ఎంతకాలం పెట్టుబడి పెట్టాలి, ఎంతకాలం పెట్టుబడి  కొనసాగించాలి అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

ఇవి కూడా చదవండి : Petrol Diesel Rates: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి..!