Aadhar Card: పాన్ కార్డుకు ఆధార్ కార్డును లింక్ చేశారా ? ఈరోజే లాస్ట్ .. మిస్ చేసారో ఇక అంతే సంగతులు..

Aadhar Card Link With Pan Card: ఆధార్ కార్డుకు పాన్ కార్డు లింక్ చేసుకున్నారా ?.. అయితే అలర్ట్. వెంటనే లింక్ చేసుకోండి.. మార్చి 31తో ఆర్థిక

Aadhar Card: పాన్ కార్డుకు ఆధార్ కార్డును లింక్ చేశారా ? ఈరోజే లాస్ట్ .. మిస్ చేసారో ఇక అంతే సంగతులు..
Aadhaar Pancard Link
Follow us

|

Updated on: Mar 31, 2021 | 9:49 AM

Aadhar Pan Link: ఆధార్ కార్డుకు పాన్ కార్డు లింక్ చేసుకున్నారా ?.. అయితే అలర్ట్. వెంటనే లింక్ చేసుకోండి.. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. కనుక మార్చి 31లోపు మీ ఆధార్ కార్డుకు పాన్ లింక్ చేసుకోవాలి. ఒక వేళ లింక్ చేయకపోతే.. మీకు ఇబ్బందులు తప్పవు. మీ బ్యాంకు లావాదేవీలలో ఇబ్బందులు తలెత్తుతాయి. అంతేకాకుండా.. రూ.1,000 వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. అయితే ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని సెంట్రల్‌ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) గతేడాది ఫిబ్రవరి 13న నోటిఫికేషన్‌ జారీ చేసింది. మార్చి 31, 2021లో పాన్, ఆధార్ లింక్ చేసుకోవాలని సూచించింది. ఈ లోపు ఈ రెండింటిని అనుసంధానించకపోయినట్లయితే ఏప్రిల్‌ 1, 2021 నుంచి ఆ పాన్‌ కార్డు ఉన్న వ్యక్తి దగ్గర నుంచి వేయ్యి రూపాయాల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

ఒకవేళ పాన్ కార్డులు ఆర్థిక లావాదేవిలకు సంబంధించిన వాటిల్లో ఇవి కీలకంగా పనిచేస్తాయి. ముఖ్యంగా బ్యాంకు అకౌంట్ప్రారంభించేందుకు, మ్యూచువల్‌ ఫండ్లు, షేర్‌లలో ఇది ఎంతో ముఖ్యం. అయితే రూ. 50 వేలకు మించి నగదు లావాదేవీల సమయంలోనూ పాన్‌ కార్డు తప్పనిసరి అవసరం. పాన్‌ చెట్లుబాటులో లేకపోతే ఇవన్నీ చేయడం సాధ్యం కాదు. ఇబ్బందులు తలెత్తే అవకాశాలుంటాయి. జరిమానా చెల్లించి పాన్‌తో ఆధార్‌ను అనుసంధానం చేసుకున్నప్పుడే వీటిని అనుమతి ఇస్తారు.

పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఎలా లింక్ చేయాలి..

☛ పాన్ కార్డును ఆధార్ కార్డుతో కేవలం 2 నిమిషాల్లో లింక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఆధార్, పాన్ కార్డులలో మీ పేరు, పుట్టినతేదీలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ☛ ఆ తర్వాత ఇన్‏కమ్ ట్యాక్స్ వెబ్‏సైట్ పై క్లిక్ చేయాలి. ☛ ఆ తర్వాత హోం పేజీలో పాన్ కార్డు, ఆధార్ కార్డ్ నంబర్లు, ఆధార్ కార్డ్ మీద ఉన్న పేరు ఇవ్వాలి. ☛ ఆ తర్వాత ఐ అగ్రీ టు వాలిడేట్ మై ఆధార్ డీటేయిల్స్ విత్ UIDAI చెక్ బటన్ మీద్ క్లిక్ చేయాలి. ☛ దాని కింద చూపిస్తున్న క్యాప్చా కోడ్ సరిగ్గా టైప్ చేసి లింక్ ఆధార్ మీద క్లిక్ చేయాలి. ☛ అంతే క్షణాల్లో మీ ఆధార్, పాన్ కార్డులు అనుసంధానం అవుతాయి.

SMS ద్వారా లింక్ చేయడం ఎలా..

☛ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 567678 లేదా 56161 కు SMS చేయాలి. ☛ ఇలా చేసేందుకు మీరు మీ మొబైల్‌లో యుఐడిపిఎన్ UIDAI (12 అంకెల ఆధార్ నంబర్) (10 అంకెల పాన్) అని టైప్ చేసి 567678 లేదా 56161 కు పంపాలి.

ఇన్‌కమింగ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ఆధార్, పాన్ కార్డుల అనుసంధానం..

☛ ముందుగా ఇన్‌కమింగ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ యొక్క ఇ-ఫైలింగ్ పోర్టల్‌ను ఓపెన్ చేయాలి. ☛ ఆ తర్వాత ఎడమ వైపున ఉన్న లింక్ బేస్ విభాగంపై క్లిక్ చేయాలి. ☛ ఆ తర్వాత మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్‌తోపాటు పేరు ఫిల్ చేయాలి. ☛ ఆ తర్వాత ‘లింక్ ఆధార్’ ఎంపికపై క్లిక్ చేయాలి. మీ పాన్ ఆధార్ లింకింగ్ పూర్తవుతుంది. ☛ మీ ఆధార్ వివరాలకు వ్యతిరేకంగా, ఐటి విభాగం మీ పేరు, పుట్టిన తేదీతోపాటు లింగాన్ని ధృవీకరిస్తుంది. ఆ తరువాత లింక్ చేయబడుతుంది.

Also read:

Holi Bhai Dooj 2021: హోలీ భాయ్ దూజ్ ప్రాముఖ్యత.. పురాణాల్లో ఉన్న స్టోరీ ఎంటో తెలుసా..