Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే రాత్రి పూట ఎలాంటి ఆహారం తినాలో తెలుసా..?

Night Time Snacks - Weight Loss: ఉరుకుల పరుగుల జీవితంలో.. ఆహార అలవాట్లు పలు రోగాల బారిన పడేలా చేస్తున్నాయి. ప్రతిఒక్కరూ బిజీబిజీగా ఉండటం వల్ల సమయానికి దొరికి ఏదో ఒక ఆహారాన్ని తిని.. రోగాలతోపాటు.. ఊబకాయం

Shaik Madar Saheb

|

Updated on: Apr 02, 2021 | 5:43 AM

Night Time Snacks - Weight Loss: ఉరుకుల పరుగుల జీవితంలో.. ఆహార అలవాట్లు పలు రోగాల బారిన పడేలా చేస్తున్నాయి. ప్రతిఒక్కరూ బిజీబిజీగా ఉండటం వల్ల సమయానికి దొరికి ఏదో ఒక ఆహారాన్ని తిని.. రోగాలతోపాటు.. ఊబకాయం బారిన పడుతున్నారు. అయితే మన జీవక్రియ బరువుపై ఆధారపడి ఉంటుంది. జీవక్రియ సాఫిగా సాగాలంటే.. బరువు తక్కువగా ఉండడం మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.

1 / 6
రాత్రివేళల్లో చాలామంది ఎక్కువగా తిని నిద్రపోతుంటారు. ఇలా చేయడం వల్ల బరువు మరింత పెరుగుతారు. అయితే.. బరువు తగ్గాలని అనుకున్న చాలా మంది రాత్రిపూట తక్కువ తినాలి.. లేకపోతే అన్నం, రోటి పదార్థాలను దూరం చేసి ఇలాంటి స్నాక్స్ తినాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇవి తింటే బరువు తగ్గడంతోపాటు ఆరోగ్యంగా ఉండవచ్చని పేర్కొంటున్నారు.

2 / 6
అరటి పండులో ఉండే కార్బోహైడ్రేట్లు త్వరగా జీర్ణమవుతాయి. కావున బరువు పెరగకుండా ఉండాలనుకునే వారు తొందరగా జీర్ణమయ్యే ఆహారాలని తీసుకోవాలి. అలాంటప్పుడు అరటి పండు తింటే కడుపు నిండటంతోపాటు.. పలు సమస్యలు దూరమవుతాయి.

3 / 6
కూరగాయలు దోసకాయ, క్యారెట్, బీట్‌రూట్ లాంటివి తినడం మంచింది. వీటితోపాటు.. శనగలు లాంటివి తీసుకోవడం ఉత్తమం. శనగలలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లతోపాటు బీ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర జీవక్రియకు బాగా సహకరించి బరువును తగ్గిస్తాయి.

4 / 6
పెరుగులో పండ్లని కలుపుకుని తింటే చాల మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే పెరుగుతోపాటు.. ఆపిల్, ద్రాక్ష, దానిమ్మ, అరటి పండు లాంటివి కలిపి తింటే ఇంకా మంచిది. దీనివల్ల ఆకలి వేయదని.. దీంతోపాటు ఆరోగ్యానికి మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.

5 / 6
ముఖ్యంగా రాత్రి వేళల్లో నూనే పదార్థాలను దూరం చేయాలి. ఎందుకంటే వాటివల్ల ఎక్కువ అనర్థాలు కలుగుతాయి. దీంతోపాటు బరువు కూడా పెరుగుతారు.

6 / 6
Follow us