Processed Meat Problem: ప్రాసెస్ చేసిన మాంసం తింటే గుండె జబ్బును కొని తెచ్చుకున్నట్టే!

ప్రాసెస్ చేసిన మాంసం తినడం ద్వారా గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు.

Processed Meat Problem: ప్రాసెస్ చేసిన మాంసం తింటే గుండె జబ్బును కొని తెచ్చుకున్నట్టే!
Processed Meat
Follow us
Anil kumar poka

|

Updated on: Apr 01, 2021 | 6:32 PM

Processed Meat Problem: మీరు ప్రాసెస్ చేసిన మాంసం అధికంగా తింటున్నారా? అయితే, మీకు హృదయ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టే.. అంతేకాదు త్వరగా మరణించే అవకాశమూ ఉందని చెబుతన్నారు పరిశోధకులు.

హామిల్టన్ పరిశోధకులు జరిపిన పరిశోధనల్లో విస్మయం కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా ప్రాసెస్ చేసిన రెడ్ మీట్, చికెన్ మంచివని అందరూ అనుకుంటాం. కానీ, ప్రాసెస్ చేసిన రెడ్ మీట్ తినడం వలన హృదయ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.

దాదాపుగా దశాబ్ద కాలపు పరిశోధనల్లో ప్రాసెస్ చేసిన మాంసం వినియోగానికి.. హృదయ సంబంధ వ్యాధులకు మధ్య లింక్ తాము గుర్తించామని హామిలిటన్ పరిశోధకులు చెబుతున్నారు. 21 దేశాలకు చెందిన 1,34,297 మందిపై పరిశోధనలు సాగించిన అనంతరం ఈ షాకింగ్ విషయం తెలిసిందని వారు చెబుతున్నారు.

పదేళ్లుగా చేసిన పరిశోధనల్లో ప్రాసెస్ చేయని మాంసం తినేవారితో పోలిస్తే, వారానికి ఒకసారి  150 గ్రాముల ప్రాసెస్ చేసిన రెడ్ మీట్ తినేవారిలో 41 శాతం మందికి గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉందనీ, 51 శాతం మందికి త్వరగా మరణించే ఛాన్స్ ఉందనీ పరిశోధనల్లో వెల్లడైందని చెప్పారు.

”మాంసం తినడం-హృదయ సంబంధమైన వ్యాధులకు గురికావడం అనేది ఎప్పుడూ ఒక అస్థిరమైన ప్రక్రియ. అందుకే.. ప్రాసెస్ చేసిన మాంసాన్ని తినే వారికి, ప్రాసెస్ చేయని మాంసం తినేవారికి మధ్య గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలపై, అదేవిధంగా మరణాలపై మేం పరిశోధనలు సాగించాం.” అని చెప్పారు పాకిస్థాన్ కరాచీకి చెందిన ఆగాఖాన్ యూనివర్సిటీ కి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ రొమైనా ఇక్బాల్ చెప్పారు. ఈయన ఈ పరిశోధనలపై మొదటి పత్రాన్ని ప్రచురించారు.

ఈ పరిశోధనలు  ప్రోస్పెక్టీవ్ అర్బన్ రూరల్ ఎపిడెమియోలజీ(PURE) ద్వారా 2003లో ప్రారంభించారు. అంతర్జాతీయంగా ఈరకమైన పరిశోధనల్లో ఇది మొదటిది. ప్యూర్ వివిధ జనసమూహాల మధ్య ఆహారపుటలవాట్ల వలన వచ్చే వ్యాధుల గురించి జరిపిన పరిశోధనల్లో భాగంగా ప్రాసెస్ చేసిన-ప్రాసెస్ చేయని మాంసం ద్వారా వచ్చే అనర్ధాలపై కూడా పరిశోధనలు సాగించాము అని సీనియర్ రచయిత, పీహెచ్చారై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సలీం యూసఫ్ తెలిపారు.

ఈ పరిశోధకులు చెబుతున్నదాని ప్రకారం పై పరిశోధనలు మరింత జరగాల్సి ఉంది. అయితే, ప్రాసెస్ చేసిన మాంసం తినడాన్ని తగ్గించడం ద్వారా గుండె జబ్బుల బారిన పడే ప్రమాదాన్ని నివారించవచ్చని వారు చెబుతున్నారు.

Also Read: Yoga for Summer: వేసవి వేడిని దాహాన్ని తగ్గించే సులభమైన.. చిట్కాలు.. ఈ ప్రాణాయామాలు

Eggs and Cholesterol: గుడ్డులోని తెల్ల సొన తిని.. పచ్చసొన పడేస్తున్నారా.. ఎన్ని పోషకాలను మిస్ చేసుకున్నారో తెలుసా..!