AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eggs and Cholesterol: గుడ్డులోని తెల్ల సొన తిని.. పచ్చసొన పడేస్తున్నారా.. ఎన్ని పోషకాలను మిస్ చేసుకున్నారో తెలుసా..!

Eggs and Cholesterol: శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే మీ గుండె ఆరోగ్యం ప్రమాదకరంలో పడినట్లే. ఎందుకంటే కొలెస్ట్రాల్ రక్తనాళాలలో చేరుకుంటే.. రక్తం శరీరానికి సరఫరా అవ్వడం కష్టమవుతుంది. అప్పుడు..

Eggs and Cholesterol: గుడ్డులోని తెల్ల సొన తిని.. పచ్చసొన పడేస్తున్నారా.. ఎన్ని పోషకాలను మిస్ చేసుకున్నారో తెలుసా..!
Eggs For Cholesterol
Surya Kala
|

Updated on: Mar 31, 2021 | 12:35 PM

Share

Eggs and Cholesterol: శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే మీ గుండె ఆరోగ్యం ప్రమాదకరంలో పడినట్లే. ఎందుకంటే కొలెస్ట్రాల్ రక్తనాళాలలో చేరుకుంటే.. రక్తం శరీరానికి సరఫరా అవ్వడం కష్టమవుతుంది. అప్పుడు గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో మీ ఆహారం మీ కొలెస్ట్రాల్ స్థాయిలపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. దీంతో కొలెస్ట్రాల్ స్థాయిని పెంచే కొన్ని ఆహారపదార్ధాల ను తినడం మానెయ్యాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కొంతమంది గుడ్లు తింటే గుండె పనితీరుపై ప్రభావం చూపుతుందని.. గుడ్లు తినడం మానేస్తున్నారు. మరికొందరు తెల్ల సొన తిని.. పచ్చ సొన పడేస్తారు. అయితే నిజంగా గుడ్లు గుండె ఆరోగ్యానికి మంచివా.. చెడు ప్రభావాన్ని కలిగిస్తాయా ఇప్పుడు తెలుసుకుందాం..!

గుడ్డు సంపూర్ణ ఆహారం :

అయితే గుడ్డు సంపూర్ణ పోషకాల నిలయం. అయితే పచ్చసొన తింటే బరువు పెరుగుతామని అనుకుంటారు. అందులో కొలెస్ట్రాల్‌ ఉండడమే అలా అనుకోవడానికి కారణం. దీంతో గుడ్డులోని పచ్చసొన తింటే రక్తంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతాయని కొంత మంది దానిని తినడం మానేస్తున్నారు. అయితే అది కేవలం అపోహ మాత్రమేనని.. అందులో ఏ మాత్రం నిజం లేదని.. గుడ్డులో అధిక మొత్తంలో కొవ్వు కలిగి ఉన్నప్పటికీ దీని ద్వారా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు మాత్రం పెరగవని ఆరోగ్య పనిపుణులు చెబుతున్నారు.

గుండె ఆరోగ్యం: మీ కొలెస్ట్రాల్ స్థాయిపై గుడ్డు సొనలు ప్రభావం చూపిస్తాయా..?

పచ్చసొన తొలగిస్తే ముఖ్య పోషకాలైన కొలైన్, సెలీనియం, జింక్‌తోపాటు విటమిన్ ఎ, బి, ఇ, డి, కె కూడా కోల్పోతారు. బి కాంప్లెక్స్, విటమిన్ డిలకు ప్రధాన వనరుగా గుడ్డును పేర్కొంటారు. పచ్చసొనలో ఇనుము శాతం ఎక్కువ. దాన్ని మన శరీరం సులువుగా గ్రహిస్తుంది. గుడ్డులో ఉండే ల్యూటిన్‌ అనే యాంటీ ఆక్సిడెంటు కంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. పలు జీవక్రియలు సక్రమంగా జరిగేందుకు గుడ్డులోని పోషకాలు సహకరిస్తాయి. అంతే కాదు పచ్చసొనలో కేలరీలు కూడా తక్కువే ఉంటాయి. కాబట్టి తిన్నా బరువు పెరుగుతారన్న బెంగ లేదు. నిశ్చింతగా గుడ్డు మొత్తం తినొచ్చు.

మీ డైట్ లో గుడ్ల ను ఏ విధంగా తీసుకోవాలి :

గుడ్డు ను అనేక రకాలుగా తినవచ్చు. రోజు ఉడకబెట్టి తినవచ్చు.. లేదా అన్నం లేదా రోటీ ల్లో కూరగా తీసుకోవచ్చు. గుడ్డుతో అనేక రకాలైన కూరలను తయారు చేసుకోవచ్చు. ఆమ్లెట్ వేసుకుని తినవచ్చు.

రోజుకి ఎన్ని గుడ్లు తినాలి?

రోజుకి మరీ ఎక్కువ గుడ్లు తినకూడదు.. అదే సమయంలో రోజులో అసలు గుడ్డు తినడకుండా ఉండకూడదని పోషకాహార నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే గుడ్లు పోషకారాన్ని శరీరానికి సమతుల్యంలో ఇస్తుంది. తాజా అధ్యయనాల ప్రకారం రోజులో ఒకటి లేదా రెండు గుడ్లను తినవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

అయితే మీరు కొలెస్ట్రాల్ స్థాయి ని బట్టి ఈ గుడ్లు తినే సంఖ్య ఉంటుందని.. ఆహారం, జీవన శైలిలో మార్పులు అవసరమని సూచిస్తున్నారు

Also Read:  వకీల్ సాబ్ చిత్ర బృందానికి , ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన పోలీసులు.. అనుమతులు నిరాకరణ

Bank Holidays In April 2021: తెలుగు రాష్ట్రాల బ్యాంక్ వినియోదారులు బీ ఎలర్ట్.. ఏప్రిల్ లో ఎన్నిరోజులు బ్యాంక్ లకు సెలవులంటే..!