Vakeel Saab Movie: వకీల్ సాబ్ చిత్ర బృందానికి , ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన పోలీసులు.. అనుమతులు నిరాకరణ
Vakeel Saab Movie:పవన్ కళ్యాణ్ అభిమానులకు నిరాశ కలిగించే న్యూస్.. మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ వకీల్ సబ్ తో వెండి తెరపై రావడానికి రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రై రిలీజ్ ఈవెంట్...
Vakeel Saab Movie:పవన్ కళ్యాణ్ అభిమానులకు నిరాశ కలిగించే న్యూస్.. మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ వకీల్ సబ్ తో వెండి తెరపై రావడానికి రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రై రిలీజ్ ఈవెంట్ ను అభిమానుల మధ్య యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లోని స్పోర్ట్స్ గ్రౌండ్స్‌లో ఏప్రిల్ 3వ తేదీన నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు చిత్ర బృందానికి , అభిమానులకు షాక్ ఇచ్చారు.
వకీల్‌సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు జూబ్లీహిల్స్ పోలీసులు అనుమతి నిరాకరించారు. వకీల్‌సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహణ అనుమతులు మంజూరు చేయమని జె.మీడియా ఫ్యాక్టరీ పోలీసులకుఓ లేఖను రాసింది. అయితే ప్రస్తుతం మళ్ళీ కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నందున ఎటువంటి మీటింగ్‌లు, సభలు, సమావేశాలకు అనుమతులు లేవని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఇటీవలనే జీవో జారీ చేశారు.
ఆ జీవో ప్రకారం వకీల్‌సాబ్ సిని మా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు అనుమతి నిరాకరించినట్లు జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ ఈవెంట్‌కు 5 నుంచి 6 వేల మంది హాజరవుతారని నిర్వాహకులు అర్జున్, ప్రశాంత్ తమకు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. తాజా జీవో ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ వాకిలీ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతులు కుదరవని స్పష్టం చేశారు. వకీల్ సాబ్ వేసవి వినోదంగా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.. మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ పై సందడి చేయనున్నారు. ఇప్పటికే బెన్ఫిట్ షో కి టికెట్స్ భారీ ధరకు అమ్ముడుపోతున్నాయి. పవన్ స్టామినా ఇది అంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.