Karthika Deepam:కార్తీక్ నా చెప్పుడుమాటలు వినడానికి రాడా అని బాధపడుతున్న మోనిత.. దీప పిల్లల దగ్గరకు చేరుకున్న డాక్టర్ బాబు

Karthika Deepam Serial : తెలుగు లోగిళ్లలో బుల్లి తెరపై గత నాలుగేళ్ల నుంచి ఆకట్టుకుంటున్న కార్తీక దీపం సీరియల్ ఈరోజు 1001 వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. కార్తీక్ పిల్లలని వెదుకుతూ హిమ దగ్గరకు చేరుకుంటాడు.. దీంతో ఈరోజు ఎపిసోడ్...

Karthika Deepam:కార్తీక్ నా చెప్పుడుమాటలు వినడానికి రాడా అని బాధపడుతున్న మోనిత.. దీప పిల్లల దగ్గరకు చేరుకున్న డాక్టర్ బాబు
Karthika Deepam March 31st
Follow us

|

Updated on: Mar 31, 2021 | 10:46 AM

Karthika Deepam Serial :తెలుగు లోగిళ్లలో బుల్లి తెరపై గత నాలుగేళ్ల నుంచి ఆకట్టుకుంటున్న కార్తీక దీపం సీరియల్ ఈరోజు 1001 వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. కార్తీక్ పిల్లలని వెదుకుతూ హిమ దగ్గరకు చేరుకుంటాడు.. దీంతో ఈరోజు ఎపిసోడ్ ఉత్కంఠంగా మారింది.. ఈరోజు ఎపిసోడ్ లోని హైలెట్స్ ను చూద్దాం..!

హిమ తండ్రిని చూసి.. ఆనందంలో కన్నీరు పెట్టుకుంటుంది. తండ్రి కూతురు ఒకరినొకరు కౌగలించుకుని కన్నీరు మున్నీరవుతారు. ఇక మరోవైపు సౌందర్య.. ఆనందరావు దగ్గరకు వచ్చి.. దీప పిల్లలు.. నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర జనరల్ టికెట్ కౌంటర్ దగ్గర నిల్చున్న విజువల్స్ దొరికాయట అని చెబుతుంది. మరి ఏ ట్రైల్ ఎక్కారో తెలిసిందా అని ప్రశ్నిస్తాడు ఆనందరావు.. ఆ టైం కి నాలుగు ట్రైన్లు ఉంటాయట.. అంటుంది సౌందర్య.. దీంతో ఆనందనావు.. కోటీశ్వరులైన నా మనవరాలు… జనరల్ బోగీల్లో ప్రయాణిస్తున్నారు అంటూ కన్నీరు పెట్టుకుంటాడు.. ఇంతలో ఆదిత్య వచ్చి అన్నయ్య రాలేదు నేను వదిన వాళ్ళగురించి పోలీస్ కేసు పెదమనుకుంటున్నా అంటాడు. సౌందర్య వద్దు అని చెప్పి.. నేను సీక్రెట్ గా ఎంక్వైరీ చేయమన్నా అంటుంది.

ఇక మరోవైపు దీప ఇడ్లీ బండి దగ్గరకు వెళ్ళడానికి బయలుదేరుతుంది.. అదే సమయంలో కార్తీక్ హిమని తీసుకుని ఇంట్లోకి వస్తుంటాడు. దీప పరిస్థితిని గమనిస్తాడు కార్తీక్.. దీప దగ్గుతో బాధపడుతుంటే.. వెంటనే హిమ తండ్రిని వదిలేసి తల్లిదగ్గరకు పరిగెడుతుంది. అమ్మా నాన్న వచ్చాడు అంటూ కార్తీక్ ని చూపిస్తుంది.. అయితే దీప కార్తీక్ ని వెళ్లి కౌగిలించుకున్నట్లు కల కంటుంది. అయితే శౌర్య తండ్రిని చూసి ఆనందంగా నాన్నా అంటూ హత్తుకుని ఏడుస్తుంది.

కార్తీక్ కుర్చీ వేసి కూర్చోమంటుంది. కాఫీ తెస్తాను అంటూ లోపలి వెళ్ళబోతున్న దీప చేతిని పట్టుకుని ఆపి.. ఒక డాక్టర్ లా చెక్ చేస్తాడు.. ఇంతలో అదే సమయానికి మురళీకృష్ణ వస్తాడు. దీపని చెక్ చేసిన కార్తీక్ టెస్టులు ఏమైనా చేయించారా అని అడుగుతాడు.. ఆ బ్లెడ్ టెస్ట్ చేయించా అని మురళీ కృష్ణ చెబుతాడు. లోపలి పదండి బాబు అనడంతో.. పిల్లల్ని తీసుకుని లోపలి వెళ్తాడు.. తండ్రి దీపని తీసుకుని లోపలి వెళ్తాడు..

ఇక మోనిత దిగులుగా కూర్చుని ఆలోచిస్తుంటుంది.. ప్రియమణి ఏమైంది అని అడిగితె.. ఏమౌతుంది.. నా కార్తీక్ నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నాకు ఫోన్ చేయడం లేదు.. మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వడంలేదు.. ఎం జరుగుతుంది.. మంచికి మంచి జరిగే రోజులు వస్తున్నాయా..? తల్లి మీద కోపంతో వచ్చేవాడు. భార్యమీద ఫ్రస్టేషన్ తో వచ్చేవాడు. పిల్లల మీద బెంగతో వచ్చేవాడు., అత్తాకోడళ్లు ఒకటి అయ్యారు అని చెప్పడానికి వచ్చేవాడు.. నా చెప్పుడు మాటలు వినడానికి వచ్చేవాడు.ఇప్పుడు ఏమైంది.. ఎందుకు రావడంలేదు.. ఎందుకు ఫోన్ చేయడంలేదు.. అని బాధపడుతుంది. నేను ఏమైనా నోరు జారితే.. అప్పటికప్పుడు తిట్టేవాడు.. మళ్ళీ సాయంత్రానికి కూల్ అయ్యిపోయేవాడు.. ఊరు వెళ్లేముందు బాగానే మాట్లాడుకున్నాం.. మంచివాళ్ళు ఏమైనా కోరుకుంటే జరిగే రోజులువచ్చాయి. దీపకి మంచి జరగాలని ఎవరైనా కోరుకుంటున్నారేమో అంటుంది.. ప్రియమణి మోనిత ని ఎం కాదు అంటూ ఓదారుస్తుంది.

ఇక సౌందర్య దేవుడి ముందు కూర్చుని కన్నీరు పెట్టుకుంటూ.. ఒక్క సాయం చెయ్యి స్వామీ.. ఒకేఒక్కసారి అందరిని కలుపు అని వేడుకుంటుంది. తర్వాత తల్లిపక్షిలా తన కుటుంబాన్ని కాపాడుకుంటా అంటూ కన్నీరు పెట్టుకుంది వేడుకుంటుంది. తర్వాత శ్రావ్య తో మాట్లాడుతుంది.

మురళీకృష్ణ టిఫిన్ సెంటర్ లో పనిచేస్తుంటే.. కార్తీక్ చూసి .. పలకరిస్తారు.. మీ ఉద్యోగం ఏమిటి..? మీరు చేస్తున్న పని ఏమిటి? అని ప్రశ్నిస్తాడు. ‘కన్నరుణం.. అంటాడు మురళీకృష్ణ.. అయితే అని మళ్ళీ ప్రశ్నిస్తాడు కార్తీక్.. వెంటనే మురళీ కృష్ణ మీరు వదిలేసినట్లు నేను వదిలెయ్యలేను కదా బాబు.. కన్నతండ్రిని కదా.. నా కూతురు కష్టపడుతుంటే చూడలేకపోయాను.. హిమ కష్టపడితే మీరు చూడలేరుకదా.. నేను అంతే.. తండ్రే అంతా..’అంటాడు మురళీ కృష్ణ.

మీకు వీళ్ళు ఎక్కడున్నది తెలియదన్నారు?’ అని కార్తీక్ ప్రశ్నించగానే.. మీరు అడిగినప్పుడు నిజంగా తెలియదు బాబు.. ఒకరోజు మీ అమ్మగారు నా దగ్గరకు వచ్చి.. డబ్బు ఇచ్చి వెతకమని చెప్పడంతో అలా ప్రతి ఊరు వెతుకుతూ ఉండగా..ఒకఆమె ఫోటోలు చూసి.. విజయనగరంలో రైలు దిగుతుంటే తానె సా మన్లు ఇచ్చినట్లు చెప్పింది. అప్పుడు ఇక్కడ ఉన్న దీపని పట్టుకున్నాను.. అంటాడు మురళీ కృష్ణ..దీంతో కార్తీక్ .. మమ్మీకి నిజంగా వీళ్ళు ఎక్కడ ఉందో తెలియదా.. నేను అనవసరంగా అనుమానించి బాధపెట్టాను.. నేను ఎంత మూర్ఖుడిలా కనిపించి ఉంటాను అని మనసులో బాధపడతాడు..

తార్వత మరి దీప ఆచూకీ దొరికిన తర్వాత మమ్మీకి చెప్పారా.. అని అడుగుతాడు. లేదు బాబు , మీ అమ్మగారికి కోడలు తో పాటు.. మనవరాళ్లు కావాలి.. కానీ మీకు మాత్రం కూతుర్లు కావాలి.. నా కూతురు అక్కర్లేదు మీరు మీ అమ్మగారి మాట వినరు. దీప ఇంత దూరం వచ్చి.. ఈ కష్టాన్ని తలకెత్తుకుంది.. రాత్రనక పగలనక కష్టపడుతూ.. తన కూతుర్లను డాక్టర్ బాబు కూతుళ్ళగా పెంచాలని ఆరోగ్యం పాడు చేసుకుంది. పిల్లల మీదే అన్ని ఆశలు పెట్టుకుని బతుకుతున్న దీప.. ఇప్పుడు మీరు వచ్చి మీకు మీ కూతుర్లే కావాలని అని అంటే.. అది ఏమైపోతుంది బాబు .. అది ఒంటరిదైపోతుంది.. అప్పుడు ఎవరికోసం బతుకుంటుంది… అంటూ మురళీ కృష్ణ .. కార్తీక్ కి తన ఆవేదన చెబుతాడు.. దీంతో కార్తీక్ ఆలోచనలో పడతాడు.. మరి దీప దగ్గర పిల్లలని వదిలేసి వచ్చేస్తాడా..? లేక దీప, పిల్లలని తీసుకుని ఇంటికి వస్తాడా.. తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే..!

Also Read: పాన్ కార్డుకు ఆధార్ కార్డును లింక్ చేశారా ? ఈరోజే లాస్ట్ .. మిస్ చేసారో ఇక అంతే సంగతులు..

ఏప్రిల్ 1 నుంచి ఈ 5 పనులను ప్రారంభించండి… కష్ట సమయాల్లో కూడా డబ్బు కొరత ఉండదు..