ప్రియురాలి కోసం చంద్రుడినే ముక్కలు చేసాడు… అక్కడి వరకు ఎలా వెళ్లాడో తెలిస్తే షాక్ అవుతారు..

ప్రియురాలు అడిగితే.. ఏమైనా చేయడానికి సిద్ధపడిపోతుంటారు కొందరు అబ్బాయిలు. తన కోసం వైరటీగా ఏదైనా ఇచ్చి ఇంప్రెస్ చేయాలనుకుంటారు.

ప్రియురాలి కోసం చంద్రుడినే ముక్కలు చేసాడు... అక్కడి వరకు ఎలా వెళ్లాడో తెలిస్తే షాక్ అవుతారు..
Yehh Jadu Hai Jinn Ka Seria

ప్రియురాలు అడిగితే.. ఏమైనా చేయడానికి సిద్ధపడిపోతుంటారు కొందరు అబ్బాయిలు. తన కోసం వైరటీగా ఏదైనా ఇచ్చి ఇంప్రెస్ చేయాలనుకుంటారు. అయితే ప్రియురాలికి కానుకగా.. దుస్తులు, వస్తువులు ఇవ్వడమే ఇంతవరకు చూసాం. కానీ ఓ అబ్బాయి మాత్రం తన ప్రేమికురాలికి కానుకగా చంద్రుడి ముక్కలుగా చేసి ఇచ్చేసాడు. ప్రియురాలు అడిగిందని క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెళ్ళి.. చంద్రుడిగా ముక్కలుగా చేసాడు. దీంతో అవి భూమిపై పడ్డాయి. అది చూసి ఆ ప్రియురాలి ఎంతో సంతోషపడింది. ఎంటీ ఈ విషయం కాస్తా చిత్రంగా అనిపిస్తుంది కదు. అవును మీరు చదివింది మాత్రం నిజమే. తన ప్రియురాలు అడిగిందని చంద్రుడినే ముక్కులుగా చేసాడు. ప్రేమికురాలు అడగడమే ఆలస్యం క్షణాల్లో తన కార్లో చంద్రుడి వద్ధకు వెళ్ళి మ్యాజిక్ స్టిక్‏తో చంద్రుడిని ముక్కులుగా చేసాడు. కానీ ఇదంతా నిజం కాదండోయ్.. ఈ స్టోరీ మొత్తం ఓ సీరియల్‏లోని సన్నివేశం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

స్టార్ ప్లస్ చానల్‏లో ప్రసారమయిన ‘హే జాదు హై జిన్ కా’ సీరియల్ తెలుగులో స్టార్ మాలో జిన్ మాయజాలం అనే పేరుతో డబ్ అయింది. అయితే ఈ సీరియల్లోని ఓ సన్నివేశం ఇప్పుడు నెట్టింట్లో నవ్వులు పూయిస్తుంది. అదెంటంటే.. ఇందులో హీరోయిన్.. తనను పెళ్లి చేసుకోవాలంటే.. చంద్రుడి ముక్కను తీసుకురావాలని హీరోతో చెబుతుంది. దీంతో వెంటనే తన కారులో గాల్లోకి వెళ్లి.. తన మ్యాజిక్ స్టిక్‏తో చంద్రుడిని ముక్కులు చేస్తాడు హీరో. వెంటనే ఆ చంద్రుడు ముక్కలై.. భూమి మీద అక్కడక్కడ ఆ ముక్కలు పడిపోతాయి. ఇక ఆ సన్నివేశాన్ని Gopi vau delrey అనే యూజన్ తన ఇన్‏స్టాలో షేర్ చేస్తూ.. దీని గురించి ఆలోచించండి.. జస్ట్ ఆలోచించండి అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు. టీవీ సీరియల్స్ అంటే ఎలా ఉంటాయో మరోసారి జిన్ మాయజాలం నిరుపించింది.

ట్వీట్..

Also Read:

బాలయ్య న్యూలుక్ అదుర్స్.. బోయపాటి సినిమా కోసమే ఇలా మారాడా.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్..

Drugs Case: సినీ ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కలకలం.. బిగ్‏బాస్ కంటెస్టెంట్ అరెస్ట్..