AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drugs Case: సినీ ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కలకలం.. బిగ్‏బాస్ కంటెస్టెంట్ అరెస్ట్..

Ajaz Khan : బాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది. ఈకేసు విచారణలో భాగంగా.. ప్రముఖ నటుడు.. హిందీ బిగ్‏బాస్ సీజన్

Drugs Case: సినీ ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కలకలం.. బిగ్‏బాస్ కంటెస్టెంట్ అరెస్ట్..
Ajaz Khan
Rajitha Chanti
|

Updated on: Mar 31, 2021 | 8:12 AM

Share

Ajaz Khan : బాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది. ఈకేసు విచారణలో భాగంగా.. ప్రముఖ నటుడు.. హిందీ బిగ్‏బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ ఎజాజ్ ఖాన్‏ను అరెస్ట్ చేశారు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు. ఎజాజ్ ఖాన్.. తెలుగులో రక్త చరిత్ర, నాయక్ వంటి సినిమాల్లో విలన్‏గా నటించాడు. ఎజాజ్‏కు సంబంధించిన అంధేరి, లోఖండ్ వాలాలోని పలు చోట్ల సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మంగళవారం ఎజాన్ ఖాన్ రాజస్థాన్ నుంచి ముంబై వస్తున్న క్రమంలో ఎయిర్ పోర్టులోనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు ముంబై పోలీసులు.

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణం తర్వాత ఎన్సీబీ రంగంలోకి దిగింది. సుశాంత్ ఆత్మహత్యకు డ్రగ్స్ వ్యవహారం ప్రేరణగా నిలిచిందనే ఆరోపణలపై ఎన్సీబీ బాలీవుడ్‌లోని కొందరు ప్రముఖులపై పంజా విసిరింది. పలు సెలబ్రిటీల నివాసాలపై మెరుపు దాడులు నిర్వహించి అరెస్ట్‌లు చేసిన విషయం తెలిసిందే. ఇందులో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు, షోవిక్ చక్రవర్తిని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఆ తర్వాత అర్జున్ రాంపాల్, భారతీ సింగ్ దంపతులను విచారించింది. ఇలా దర్యాప్తు చేస్తూనే డ్రగ్స్ డీలర్లతో సంబంధాలు ఉన్న ఎజాజ్ ఖాన్‌ను అరెస్ట్ చేసింది. అయితే ఎజాజ్ ఖాన్‏ను అరెస్ట్ చేసింది ఇది మొదటి సారికాదు. 2018లో నవీ ముంబై పోలీసులు ముందుగా అరెస్ట్ చేశారు. నిషేధిత మాదకద్రవ్యాలను కలిగి ఉన్నాడనే ఆరోపణలతో అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 2020 ఏప్రిల్ నెలలో ఫేస్ బుక్ లో అభ్యంతకరమైన పోస్ట్ చేసినందుకుగానూ అతన్ని మరోసారి పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరోసారి డ్రగ్స్ కేసులో ఎజాజ్ పోలీసులకు చిక్కాడు.

ఎజాజ్ ఖాన్ సినిమాల్లో నటించడమే కాకుండా.. బుల్లితెరపై కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 7తోపాటు, కామెడీ నైట్ విత్ కపిల్, కరం అప్నా అప్నా, కహానీ హమారా మహాభారత కి, రహే తేరా ఆషిర్వాడ్ వంటి సీరియల్స్‏లో నటించారు. బిగ్ బాస్ హౌస్‏లో తోటి కంటెస్టెంట్లపై చేయి చేసుకోవడంతో అతడిని షో నుంచి ఎలిమినేట్ చేశారు. ఎజాజ్ తన ప్రవర్తన, నటన పరంగా ఎప్పుడూ వివాదాల్లోనే ఉండేవాడు. గతంలో కూడా కామెడీ నైట్స్ విత్ కపిల్ షోలో పాల్గోన్నాడు. కానీ తాను పాల్గోన్న ఎపిసోడ్ టీవీలో ప్రసారం కాలేదు. దీంతో కపిల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు ఎజాజ్.

ట్వీట్..

Also Read: అలనాటి సోగ్గాడితో విక్టరీ వెంకటేష్.. నవ్వులు చిందిస్తూ.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్..

సినిమాలకు మార్గదర్శకాలు ఉండాలి.. కానీ.. సెన్సార్ షిప్ అవసరం లేదు.. ‘వైల్డ్ డాగ్’ బ్యూటీ..