AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమాలకు మార్గదర్శకాలు ఉండాలి.. కానీ.. సెన్సార్ షిప్ అవసరం లేదు.. ‘వైల్డ్ డాగ్’ బ్యూటీ..

Wild Dong Movie Update: దియా మీర్జా.. పుట్టింది, పెరిగింది మొత్తం హైదరాబాద్‍లోనే. కానీ బీటౌన్‏లో వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సినిమాలకు మార్గదర్శకాలు ఉండాలి.. కానీ.. సెన్సార్ షిప్ అవసరం లేదు.. 'వైల్డ్ డాగ్' బ్యూటీ..
Dia Mirza
Rajitha Chanti
|

Updated on: Mar 31, 2021 | 9:54 AM

Share

Wild Dog Movie Update: దియా మీర్జా.. పుట్టింది, పెరిగింది మొత్తం హైదరాబాద్‍లోనే. కానీ బీటౌన్‏లో వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా అక్కినేని నాగార్జున సరసన వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తోంది ఈ ముద్దు గుమ్మ. ఈ మూవీ ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర ప్రమోషన్స్‏ను వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా.. మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడింది దియా.

టీనేజ్ సమయంలోనే నాకు తెలుగులో ఆఫర్స్ వచ్చాయి. కానీ.. ఆ సమయంలో నా నటనపై నాకే అనుమానం వచ్చింది. దీంతో సినిమాలకు నో చెప్పేదాన్ని. కానీ ఇన్నేళ్ళకు తెలుగులో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా తర్వాత తెలుగులో నాకు మరిన్ని అవకాశాలు వస్తాయని అనుకుంటున్నాను.. నాకు ఇష్టమైన నటులు నాగార్జున, వెంకటేష్‏లతో నటించడం ఆనందంగా ఉంది. ఇప్పటికి నా కల సగం నెరవేరినట్టుగా ఉంది. కానీ మరో సగం కల నెరవేరాల్సి ఉంది అంటూ చెప్పుకోచ్చింది. దేశం కోసం పోరాడే వారికి సంబంధించిన స్టోరీనే ఈ వైల్డ్ డాగ్. వారి కుటుంబ జీవితం గురించి ఈ మూవీ సాగుతుంది అంటూ తెలిపింది.

ప్రస్తుతం కాలంలో ఓటీటీ ఫ్లాట్ ఫాంలు ప్రజలు ఆదరిస్తున్నారు. సిని పరిశ్రమ అభివృద్దికి ఈ ఓటీటీలు మరింత తోడ్పాటు అందిస్తాయి. ఇప్పటివరకు మనకు చాలా మంది నటీనటులు, డైరెక్టర్స్, రచయితలు ఉన్నారు. ఇలాంటి వారికి ఈ ఓటీటీలు చాలా ఉపయోగపడుతున్నాయి. ఇక మార్గదర్శకాలనేవి.. కేవలం ఓటీటీ సంస్థలకే కాకుండా.. సినిమాలకు కూడా ఉండాలి. అంతేకానీ సెన్సార్ ఉండాల్సిన అవసరం లేదు అంటూ చెప్పుకోచ్చిది దియా. సరైన ఆలోచనలు ఉన్న ప్రేక్షకులుగా సినిమాలను చూడాలి కానీ.. మరొకరి అభిప్రాయాలతో కాదు. నేను సినీ పిరిశ్రమలోనే పెరిగాను. నాకు మనుషులతోపాటు ప్రపంచాన్ని కూడా అర్థమయ్యేలా చేసింది ఈ పరిశ్రమ. కేవలం నటిగానే కాకుండా.. నా వ్యక్తిగతంగా నేను చేసిన పనుల వలన నేవు ఆనందంగా ఉంటాను. నిర్మాణ రంగంలో మరింత గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది.. ఇప్పటికే నేను నిర్మాతగా ఓ వెబ్ సిరీస్ చేశాను అంటూ చెప్పింది. ఇదిలా ఉంటే.. అక్కినేని నాగార్జున, దీయా మీర్జా నటించిన వైల్డ్ డాగ్ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కానుంది. హైదరాబాద్‏లో జరిగిన బాంబు దాడుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో నాగార్జున నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ (ఎన్ఐఏ)లో ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున కనిపించబోతున్నాడు.

Also Read:

అలనాటి సోగ్గాడితో విక్టరీ వెంకటేష్.. నవ్వులు చిందిస్తూ.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్..