బాలయ్య న్యూలుక్ అదుర్స్.. బోయపాటి సినిమా కోసమే ఇలా మారాడా.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్..

బాలయ్య న్యూలుక్ అదుర్స్.. బోయపాటి సినిమా కోసమే ఇలా మారాడా.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్..
Balakrishna

Balayya New Look: నందమూరి బాలకృష్ణ.. 60 ఏళ్ల వయసులోనూ.. యంగ్ హీరోలకు సైతం గట్టిపోటి ఇస్తున్నాడు. సినిమాలకు ఆయన

Rajitha Chanti

|

Mar 31, 2021 | 8:55 AM

Balayya New Look: నందమూరి బాలకృష్ణ.. 60 ఏళ్ల వయసులోనూ.. యంగ్ హీరోలకు సైతం గట్టిపోటి ఇస్తున్నాడు. సినిమాలకు ఆయన ఎంత ఇంపార్టెంట్ ఇస్తాడనే విషయం పలు సందర్బాల్లో బయటపడుతూనే ఉంటాయి. ఇక సినిమాల కోసం కొత్త కొత్త లుక్స్ ట్రై చేస్తునే ఉంటాడు. ఇటీవల బోయపాటి సినిమా నుంచి విడుదలైన పోస్టర్‏లో కాస్తా బరువు తగ్గి ఫిట్‏గా కనిపించాడు ఈ హీరో. తాజాగా బాలకృష్ణ ఓ పాపతో హోలీ జరుపుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అందులో చిన్నారి చెంపకు రంగు రాస్తున్న ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఇక బాలయ్య న్యూలుక్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆ ఫోటోలో నెరిసిన గడ్డం.. చిన్నపాటి జుట్టుతో కొత్తగా డిఫరెంట్‏గా కనిపిస్తున్నాడు. బోయపాటి సినిమా కోసమే ఈ న్యూలుక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్లో చేస్తున్న నిమాలో బాలయ్య అఘోరా పాత్రలో నటించనున్నట్లుగా గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ పాత్ర కోసం బాలయ్య ఇలా మారిపోయినట్లుగా తెలుస్తోంది. అఘోరా పాత్ర సినిమా మొత్తానికే కీలకం కావడంతో.. ఫోకస్ మొత్తం దీనిపైనే పెట్టాడట డైరెక్టర్. పక్కా కమర్షియల్ మాస్ ఫార్ములాతో ఈ మూవీ రాబోతుందని… ఇందులో బాలయ్య డబుల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తోంది. ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో ఆర్ఎఫ్‌సీలో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. అఘోరా పాత్ర ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి చివరి వరకు కూడా సినిమా రేంజ్ మరో స్థాయిలో ఉంటుందని తెలుస్తుంది. ఇక సినిమా చిత్రీకరణ ప్రారంభం నుంచి అంచనాలు పెంచేస్తున్నాడు బోయపాటి. ఇందులో బాలయ్య ఎలా ఉండబోతున్నాడనేదానిపై అభిమానులు మరింత ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇందులో ప్రగ్వా జైస్వాల్, సయోషా సైగల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.

Also Read:

RRR Movie Update: ‘ఆర్ఆర్ఆర్’ నుంచి మరో సర్‏ప్రైజ్ .. ఈసారి ఆ స్టార్ హీరో లుక్ రాబోతుందా ?

సినిమాలకు మార్గదర్శకాలు ఉండాలి.. కానీ.. సెన్సార్ షిప్ అవసరం లేదు.. ‘వైల్డ్ డాగ్’ బ్యూటీ..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu