RRR Movie Update: ‘ఆర్ఆర్ఆర్’ నుంచి మరో సర్‏ప్రైజ్ .. ఈసారి ఆ స్టార్ హీరో లుక్ రాబోతుందా ?

RRR Movie Update: దర్శకధీరుడు రాజమౌళీ భారీ బడ్జెట్‏తో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్'. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్,

RRR Movie Update: 'ఆర్ఆర్ఆర్' నుంచి మరో సర్‏ప్రైజ్ .. ఈసారి ఆ స్టార్ హీరో లుక్ రాబోతుందా ?
RRR
Follow us
Rajitha Chanti

| Edited By: Team Veegam

Updated on: Mar 30, 2021 | 3:06 PM

RRR Movie Update: దర్శకధీరుడు రాజమౌళీ భారీ బడ్జెట్‏తో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ హీరోలుగా నటిస్తుండగా.. వీరికి జోడీలుగా.. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఇద్దరు అగ్రహీరోలు నటిస్తున్న మెగా మల్టీస్టారర్ సినిమా గురించి ఆది నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇక అక్టోబర్ 13న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు గతంలోనే ప్రకటించింది చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో బాలీవుడ్, హాలీవుడ్ నటీనటులు కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, ఒలీవియా పాత్రలను పరిచయం చేశాడు జక్కన్న. తాజాగా అభిమానులకు మరో సర్‏ప్రైజ్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఏప్రిల్ 2న అజయ్ దేవగణ్ పుట్టిన రోజు కావడంతో ఆరోజున అజయ్ ఫస్ట్ లుక్‏తోపాటు మోషన్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అజయ్ దేవ్‏గణ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకున్నాడు. ఈ చిత్రం నాకొక ఉత్తేజకరమైన అనుభవాన్నిచ్చింది. ఇందులో రాజమౌళి సృష్టించిన నా పాత్రను మీకు పరిచయం చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అంటూ వెల్లడించారు. ఇందులో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌ల‌కు గురువుగా, స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడిగా అజ‌య్ దేవ‌గ‌ణ్ ఈ చిత్రంలో క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం. ఇప్పటికే హీరోహీరోయిన్ల పుట్టిన రోజు సందర్భంగా వారికి సంబంధించిన పోస్టర్లను రివీల్ చేస్తూ వస్తున్నాడు డైరెక్టర్. ఇక ఇందులో సముద్రఖని, రే స్టీవెన్​సన్, అలీసన్ డూడీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

అజయ్ దేవగణ్ ట్వీట్..

Also read:  Akshay Kumar: ‘రామ్ సేతు’ షూటింగ్ స్టార్ చేసిన అక్షయ్ కుమార్.. సైంటిస్ట్ లుక్‏లో ‘ఖిలాడి’ హీరో..

Nithiin BirthDay: ఫ్యామిలీతో నితిన్ బర్త్ డే వేడుకలు.. సందడి చేసిన సింగర్ సునీత దంపతులు..

జబర్ధస్త్ షూటింగ్ సెట్‏లో టీమ్‏ లీడర్ల మధ్య గొడవ.. ఆత్మహత్య ప్రయత్నం చేసిన వర్ష..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!