AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akshay Kumar: ‘రామ్ సేతు’ షూటింగ్ స్టార్ చేసిన అక్షయ్ కుమార్.. సైంటిస్ట్ లుక్‏లో ‘ఖిలాడి’ హీరో..

Akshay Kumar: బాలీవుడ్‏లో వరుస సినిమాలు చేస్తూ.. టాప్ హీరోలుగా కొనసాగుతున్న వారిలో అక్షయ్ కుమార్ ఒకరు. ప్రస్తుతం 'అత్రంగి రే'

Akshay Kumar: 'రామ్ సేతు' షూటింగ్ స్టార్ చేసిన అక్షయ్ కుమార్.. సైంటిస్ట్ లుక్‏లో 'ఖిలాడి' హీరో..
Akshay Kumar
Rajitha Chanti
|

Updated on: Mar 30, 2021 | 1:10 PM

Share

Akshay Kumar: బాలీవుడ్‏లో వరుస సినిమాలు చేస్తూ.. టాప్ హీరోలుగా కొనసాగుతున్న వారిలో అక్షయ్ కుమార్ ఒకరు. ప్రస్తుతం ‘అత్రంగి రే’ సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకున్నాడు అక్షయ్. ఇందులో  ధనుశ్, సారా అలీ ఖాన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం 6 ఆగష్టున విడుదల కానుంది. ఇదిలా ఉండగా..  తాజాగా మరో మూవీని పట్టాలెక్కించేసాడు అక్షయ్ కుమార్. ఈ విషయాన్ని స్వయంగా తన ఇన్‏స్టాగ్రామ్‏లో షేర్ చేసుకున్నాడు ఈ ఖిలాడి హీరో. అభిషేక్ శర్మ దర్శకత్వంలో అక్షయ్ రామసేతు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 18న అయోధ్య రామ జన్మభూమిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. తమిళనాడులోని ‘రామ్ సేతు’ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

“నాకు ప్రత్యేకమైన సినిమాలలోని ఓ మూవీ ప్రయాణం ఈరోజు ప్రారంభమవుతుంది. రామ్ సేతు షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాలో నేను పురావస్తు శాస్త్రవేత్తగా నటిస్తున్నాను. నా కొత్త లుక్ పై మీ అభిప్రాయాలను వినడానికి ఇష్టపడుతున్నాను. అవి నాకు ఎల్లప్పుడు ముఖ్యమైనవే”.. అంటూ ట్వీట్ చేశాడు అక్షయ్. ప్రస్తుతం ఈ హీరో న్యూలుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ లుక్ చూసిన అభిమానులు.. వావ్, సర్ జీ మీ లుక్ అమెజింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రామ్ సేతు సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ భారుచా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ మొత్తం ముంబైలోనే జరుగుతుందని డైరెక్టర్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అక్షయ్ పురావస్తు శాస్త్రవేత్తగా నటించనున్నాడని.. అనేక మంది భారతీయ, అంతర్జాతీయ ప్రొఫెషనల్ పురావస్తు శాస్త్రవేత్తల నుంచి ప్రేరణ పొందినట్లుగా తెలిపారు. ఇక అక్షయ్ నటించిన సూర్యవంశి, బెల్ బాటమ్, పృథ్వీ రాజ్, బచ్చన్ పాండే, అత్రాంగి రే సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.

అక్షయ్ కుమార్ ట్వీట్..

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

Also read:

Nithiin BirthDay: ఫ్యామిలీతో నితిన్ బర్త్ డే వేడుకలు.. సందడి చేసిన సింగర్ సునీత దంపతులు..