- Telugu News Photo Gallery Cinema photos Happy birthday nithiin his birthday celebrations with family and special guests singer sunitha ram veerapaneni
Nithiin BirthDay: ఫ్యామిలీతో నితిన్ బర్త్ డే వేడుకలు.. సందడి చేసిన సింగర్ సునీత దంపతులు..
‘జయం’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు నితిన్. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు ఈ యంగ్ హీరో. ఆ తర్వాత నితిన్ కెరీర్లో లవర్ బాయ్‌గా ఎన్నో చిత్రాల్లో నటించాడు. మంగళవారం నితిన్ పుట్టిన రోజు.
Updated on: Mar 30, 2021 | 12:00 PM

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ మార్చ్ 30 మంగళవారం తన 38వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్బంగా తన ఫ్యామీలితో కలిసి బర్త్ డే సెలబ్రెషన్స్ చేసుకున్నాడు యంగ్ హీరో.

ఈ వేడుకలలో స్పెషల్ అట్రాక్షన్‌గా సింగర్ సునీత, రామ్ వీరపనేని నిలిచారు. వారితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు నితిన్ దంపతులు.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఏడాది నితిన్ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చెక్ ఆశించినంతగా విజయం సాధించలేదు.

ఇటీవల విడుదలైన రంగ్ దే మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది.

తాజాగా నితిన్ పుట్టిన రోజు సందర్బంగా.. తన తదుపరి సినిమా 'మాస్ట్రో' టైటిల్‌తోపాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.

ఇందులో నితిన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ నటిస్తుండగా.. మిల్కీబ్యూటీ తమన్నా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.





























