Extra Jabardasth: జబర్ధస్త్ షూటింగ్ సెట్‏లో టీమ్‏ లీడర్ల మధ్య గొడవ.. ఆత్మహత్య ప్రయత్నం చేసిన వర్ష..

బుల్లితెరపై ఆల్ టైం నవ్వులు పూయిస్తూ టాప్‏లో దూసుకుపోతుంది జబర్ధస్త్ ప్రోగ్రామ్. ఏడెళ్లకు నుంచి వచ్చిన పోటీలను ఎదుర్కోంటూ..

Extra Jabardasth: జబర్ధస్త్ షూటింగ్ సెట్‏లో టీమ్‏ లీడర్ల మధ్య గొడవ.. ఆత్మహత్య ప్రయత్నం చేసిన వర్ష..
Jabardasth
Follow us

| Edited By: Team Veegam

Updated on: Mar 30, 2021 | 1:16 PM

బుల్లితెరపై ఆల్ టైం నవ్వులు పూయిస్తూ టాప్‏లో దూసుకుపోతుంది జబర్ధస్త్ ప్రోగ్రామ్. ఏడెళ్లకు నుంచి వచ్చిన పోటీలను ఎదుర్కోంటూ.. ఇప్పటికీ నిర్వీరామంగా కొనసాగుతుంది. ఈ షోకి ఇంత క్రేజ్ రావడానికి ఒకవైపు అందులో కంటెస్టెంట్స్ వేసే స్కిట్స్ అనుకున్నా..మరోవైపు జడ్జెస్, యాంకర్స్ మరింత బలం అనే చెప్పుకోవాలి. జబర్ధస్త్ షో ఎంతోమంది సామాన్యులకు సెలబ్రెటీ హోదా తెచ్చిపెట్టింది. ఈ వేదికపై చిన్న పాత్రలో అలరించిన కమెడియన్స్ వెండితెరపై ఛాన్సులు అందుకుంటున్నారు. తాజాగా జబర్ధస్త్ షూటింగ్ స్పాట్‏లో ఇద్దరు టీంలీడర్ల మధ్య ఘర్షణ నెలకొంది. చివరికి అక్కడున్న సిబ్బంది వచ్చి ఆ గొడవను ఆపే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను.. ఏప్రిల్ 2వ తేదీ షో తాలూకు ప్రోమోలో భాగంగా విడుదల చేసింది జబర్థస్త్ మేనేజ్ మెంట్. ఇందులో ఇద్దరు టీంలీడర్ల మధ్య గొడవ జరిగినట్టుగా.. అందుకు కారణం వర్ష అన్నట్టుగా.. దీంతో వర్ష ఆత్మహత్యకు ప్రయత్నించడం చూపించారు. ఇది చూసిన నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంతకీ ఎం జరిగుంటుంది… అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగమ్మాయి వర్ష.. ముందుగా హైపర్ ఆది టీం ద్వారా ఈ షోలోకి ఎంట్రి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాకింగ్ రాకేష్, కెవ్వు కార్తీక్ టీంలలో చేస్తోంది. అంతేకాకుండా.. వర్ష, ఇమాన్యూయేల్ మధ్య సమ్‏థింగ్ సమ్‏థింగ్ ఉందంటూ.. యాంకర్స్, టీంమెంబర్స్‏తోపాటు జడ్జెస్ కూడా హింట్ గతంలో హింట్ ఇచ్చారు. ఏప్రిల్ 2న ప్రసారం కానున్న ఎక్స్ స్ట్రా జబర్ధస్త్ ప్రోమోలో… వర్ష.. కెవ్వు కార్తీక్‏తో స్కిట్ చేస్తూ.. అతడిని ఫూల్ చేసింది.. ఇక ఆ సమయంలో జడ్జ్ రోజా మీరు మీరు ఫూల్ చేసుకోవడం కాదు బయట ఉన్న టీం లీడర్లను ఫూల్స్ చేయండి అంటూ చెప్పుకోచ్చింది. దీంతో మొదట హైపర్ ఆదిని ఫూల్ చేసే ప్రయత్నం చేసింది. ఇక ఆ సమయంలో ఆది తనదైన పంచ్ డైలాగ్స్ వేసి వారిద్దరిని అక్కడి నుంచి పంపించాడు. ఇక ఆ తర్వాత చలాకి చంటితో ప్రాంక్ చేసింది వర్ష. దీంతో చంటి.. డైలాగ్స్ వాడు చెబితే చేయడం కాదు.. నువ్వు పర్ఫెక్ట్‏గా ప్రాక్టీస్ చేసుకో.. అన్నీ చెబుతారా అంటూ వర్షకు చెప్పాడు. దీంతో కోపంతో అక్కడినుంచి వెళ్లి బిల్డింగ్ పైకి ఎక్కి దూకుతా అంటూ బెదిరించింది వర్ష. వెంటనే చంటి కోపంతో కార్తీక్‏తో గొడవకు దిగాడు. అంతే వెంటనే అక్కడున్న వారు గుమిగూడారు. ఇక ఆ తర్వాత ఇద్దరు టీం లీడర్లు కొట్టుకున్నారు. అది చూసి జడ్జెస్ షాక్ అయ్యారు. అయితే చూడాలి మరీ ఇది కూడా స్కిట్‏లో భాగమేనా.. లేకా నిజంగానే గొడవ జరిగిందా అనేది.

వీడియో..

Also read: ‘వీరయ్య’గా రాబోతున్న మెగాస్టార్ చిరంజీవి.. కొత్త ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకువచ్చే పనిలో చిరు..

సుశాంత్ ‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’ న్యూపోస్టర్ విడుదల.. స్టైలిష్ లుక్‏లో యంగ్ హీరో..

ఈరోజు ఉత్కంఠంగా మారిన కార్తీక్ దీపం .. దీప, పిల్లల వద్దకు చేరుకున్న డాక్టర్ బాబు

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో