‘వీరయ్య’గా రాబోతున్న మెగాస్టార్ చిరంజీవి.. కొత్త ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకువచ్చే పనిలో చిరు..

Megastar Chranjeevi New Movie Update: రీఎంట్రీ తర్వాత జోరు పెంచాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న చిరు.

'వీరయ్య'గా రాబోతున్న మెగాస్టార్ చిరంజీవి.. కొత్త ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకువచ్చే పనిలో చిరు..
Megastar Chiranjeevi Bobby
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 30, 2021 | 7:46 AM

Megastar Chranjeevi New Movie Update: రీఎంట్రీ తర్వాత జోరు పెంచాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న చిరు.. తాజాగా మరో ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో ఉన్నాడట. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నాడు చిరంజీవి. ఇందులో కాజల్ హీరోయిన్‍గా నటిస్తుండగా.. రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యా్ట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లపై మెగా పవర్ స్టార్ రాంచరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీని మే 13న దేశ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది. ఇదిలా ఉంటే.. వేదాళమ్, లూసిఫర్ రీమేక్‏లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మెగాస్టార్. వీటితోపాటు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లుగా గతంలో ప్రకటించాడు చిరు.

తాజాగా వీరిద్ధరి కాంబోలో తెరకెక్కనున్న సినిమా గురించి మరో అప్‏డేట్ సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. కమర్షియల్ పాట్ బాయిర్ స్పెషలిస్ట్ రాసిన ఒరిజినల్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని టాక్ వినిపిస్తోంది. పూర్తిగా పల్లెటూరి బ్యాక్ డ్రాప్‏లో వచ్చే ఈ చిత్రానికి ‘వీరయ్య’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట చిత్రయూనిట్. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ మూవీ నిర్మించనున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి తీసుకెళ్లెందుకు సన్నాహాలు చేస్తున్నారట చిత్రయూనిట్. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఆచార్య సినిమా చిత్రీకరణలో పాల్గోంటున్న చిరు.. ఆ సినిమా తర్వాత మోహన్‌ రాజా దర్శకత్వంలో మలయాళ ‘లూసిఫర్‌’ తెలుగు రీమేక్‌లో నటిస్తారు చిరంజీవి. ఆ తర్వాత బాబీ తెరకెక్కించే సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు.

Also read: సుశాంత్ ‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’ న్యూపోస్టర్ విడుదల.. స్టైలిష్ లుక్‏లో యంగ్ హీరో..

Nithiin: కళ్లు కనబడవు.. కానీ అతని వెనకాలే రక్తపు మరకలు.. ఆసక్తికరంగా నితిన్ ‘మాస్ట్రో’ ఫస్ట్‏లుక్ పోస్టర్…