Nithiin: కళ్లు కనబడవు.. కానీ అతని వెనకాలే రక్తపు మరకలు.. ఆసక్తికరంగా నితిన్ ‘మాస్ట్రో’ ఫస్ట్‏లుక్ పోస్టర్…

Nithiin BirthaDay: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్..హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

Nithiin: కళ్లు కనబడవు.. కానీ అతని వెనకాలే రక్తపు మరకలు.. ఆసక్తికరంగా నితిన్ 'మాస్ట్రో' ఫస్ట్‏లుక్ పోస్టర్...
Nithiin
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 30, 2021 | 6:37 AM

Nithiin BirthaDay: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్..హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ సంవత్సరంలోని ఇప్పటికే రెండు సినిమాలను విడుదల చేసారు నితిన్. అందులో చెక్ సినిమా ఆశించనంతగా హిట్ కాకపోగా.. ఇటీవలే విడుదలైన రంగ్ దే మూవీ పాజిటివ్ టాక్‏తో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా… ముచ్చటగా మూడో చిత్రాన్ని వీలైనంత త్వరగా థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో నితిన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ నటిస్తుండగా.. మిల్కీబ్యూటీ తమన్నా ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

అయితే మార్చి 30న నితిన్ పుట్టిన రోజు కావడంతో.. ఆయన కొత్త సినిమా టైటిల్‏తోపాటు ఫస్ట్ లుక్‏ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ చిత్రానికి ‘మాస్ట్రో ‘ అనే పేరును ఖరారు చేస్తున్నట్లుగా ప్రకటించింది నితిన్ టీం. హిందీలో సూపర్ హిట్ సాధించిన అందాదున్ మూవీకి రీమేక్‏గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జూన్ 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది చిత్రయూనిట్. తాజాగా విడుదలైన ఫస్ట్‏లుక్ పోస్టర్‏లో చేతిలో స్టిక్ పట్టుకోని నడుస్తున్నాడు. అంటే ఈ మూవీలో అతను కళ్లు కనపడని వ్యక్తిలా నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా.. నితిన్ వెనకాల ఉన్న పియానో పై రక్తపు మరకలు ఉన్నాయి. ఓ కళ్లు కనపడని వ్యక్తి వెనకాల రక్తపు మరకలు ఉండడంతో ఈ వ్యక్తి హత్య చేశాడనే అనుమానం కలిగించేలా పోస్టర్ విడుదల చేసింది యూనిట్. అయితే నితిన్ ఇప్పటివరకు ఇలాంటి పాత్రలో ఎప్పుడూ నటించలేదు. దీంతో ఈ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తుండగా.. జె.యువరాజ్ కెమెరామెన్‏గా చేస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన నితిన్ రంగ్ దే మూవీ అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇందులో నితిన్‏కు జోడీగా కీర్తి సురేష్ నటించింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ట్వీట్..

Also Read:

Rang De : పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న రంగ్ దే.. ఫస్ట్ వీక్ ఎంత వసూల్ చేసిందంటే..

లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..
నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..
జియో రూ.175కే ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్‌.. ఉచితంగా 12 ఓటీటీ యాప్స్
జియో రూ.175కే ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్‌.. ఉచితంగా 12 ఓటీటీ యాప్స్