Rang De : పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న రంగ్ దే.. ఫస్ట్ వీక్ ఎంత వసూల్ చేసిందంటే..

నితిన్‌, కీర్తి సురేష్ జంట‌గా వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం 'రంగ్ దే'. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Rang De : పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న రంగ్ దే.. ఫస్ట్ వీక్ ఎంత వసూల్ చేసిందంటే..
Rangde
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 29, 2021 | 8:36 PM

Rang De: నితిన్‌, కీర్తి సురేష్ జంట‌గా వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ‘రంగ్ దే’. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం శుక్ర‌వారం (మార్చి 26) విడుద‌లై అన్ని ప్రాంతాల నుంచీ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం స‌క్సెస్ మీట్‌ను ఏర్పాటుచేసింది. ఈ కార్య‌క్ర‌మంలో హీరో నితిన్‌, డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి, ప్రొడ్యూస‌ర్ సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ, “సినిమాకు రెస్పాన్స్ చాలా బాగుంది. మూవీలోని ఫ‌న్‌, ఎమోష‌న్స్‌ను ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కీర్తి క్యారెక్ట‌ర్‌, నా క్యారెక్ట‌ర్ బాగా న‌చ్చాయంటున్నారు. మా ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ బాగా న‌చ్చిందంటున్నారు.

డీఎస్పీ, పీసీ శ్రీ‌రామ్ గార్ల వ‌ర్క్ బాగుంద‌ని ప్ర‌శంసిస్తున్నారు. అన్ని ప్లేస్‌ల నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ రావడం హ్యాపీ. ‘రంగ్ దే’ను ఆద‌రిస్తున్న అంద‌రికీ థాంక్స్ చెప్పుకుంటున్నా. ఈ సంస్థ‌లో నాకు ఇది మూడో సినిమా. ఇదివ‌ర‌కు నేను చేసిన ‘అ ఆ’, ‘భీష్మ’ బాగా ఆడాయి. ఈ సినిమాతో హ్యాట్రిక్ రావ‌డం సంతోషంగా ఉంది. ‘గుండెజారి గ‌ల్లంత‌య్యిందే’ మూవీ త‌ర్వాత ఆ జాన‌ర్‌లో నేను చేసిన సినిమా ఇది. హీరో క్యారెక్ట‌ర్ చేంజ్ అయ్యే సీన్లు అంద‌రికీ బాగా న‌చ్చుతున్నాయి. వ్య‌క్తిగ‌తంగా నాకూ అవి న‌చ్చాయి. కీర్తి గొప్ప న‌టి. అను పాత్ర‌ను చాలా బాగా చేసింది. మేమిద్ద‌రం ‘రంగ్ దే’ క‌థ‌ను బాగా న‌మ్మాం. అది మా ఇద్ద‌రి మ‌ధ్య సీన్ల‌లో రిఫ్లెక్ట్ అయ్యి, బాగా వ‌చ్చాయ‌నుకుంటున్నా. మార్నింగ్ షో కంటే మ్యాట్నీకి క‌లెక్ష‌న్లు ఇంప్రూవ్ అయ్యాయి. షోకి షోకీ క‌లెక్ష‌న్లు పెరుగుతుండ‌టం హ్యాపీ. వీకెండ్ నాటికి మ‌రింత బాగా క‌లెక్ష‌న్లు వ‌చ్చి, బ‌య్య‌ర్లంద‌రూ హ్యాపీగా ఉంటార‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం.” అన్నారు.

ఇక రంగ్ దే కలక్షన్స్ విషయానికొస్తే.. తొలి రోజు 5.43 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం.. మూడు రోజుల్లో దాదాపు 10 కోట్లకు పైగా షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.నైజాం – 3.79 కోట్లు.. సీడెడ్ – 1.66 కోట్లు.. వైజాగ్ – 1.30 కోట్లు.. గుంటూరు – 1.09 కోట్లు.. ఈస్ట్ – 0.85 కోట్లు.. వెస్ట్ – 0.57 కోట్లు.. కృష్ణ – 0.65 కోట్లు.. నెల్లూరు – 0.44 కోట్లు కలుపుకుని మొత్తం 10.35 కోట్ల షేర్ గా ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ.. స్వరరాజా ఇళయరాజా కలిసిన కిషన్ రెడ్డి

Chavu Kaburu Challaga Movie: ‘సినిమా నచ్చని వారు క్షమించి ఇంకో అవకాశం ఇవ్వండి’.. ఆసక్తికరమైన ట్వీట్ చేసిన హీరో..

Vakeel Saab Trailer Review: వేరే లెవల్‌‌‌‌లో ‘వకీల్ సాబ్’ ట్రైలర్.. పూనకాలతో ఊగిపోతున్న అభిమానులు..