AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chavu Kaburu Challaga Movie: ‘సినిమా నచ్చని వారు క్షమించి ఇంకో అవకాశం ఇవ్వండి’.. ఆసక్తికరమైన ట్వీట్ చేసిన హీరో..

Hero Karthikeya Tweet: 'ఆర్‌ఎక్స్‌ 100' సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు యంగ్‌ హీరో కార్తీకేయ. ఈ సినిమాలో అగ్రేసివ్‌ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హీరో తర్వాత వరుస అవకాశాలను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే..

Chavu Kaburu Challaga Movie: 'సినిమా నచ్చని వారు క్షమించి ఇంకో అవకాశం ఇవ్వండి'.. ఆసక్తికరమైన ట్వీట్ చేసిన హీరో..
Karthikeya Tweet
Narender Vaitla
|

Updated on: Mar 29, 2021 | 7:57 PM

Share

Hero Karthikeya Tweet: సినిమాలు అన్నప్పుడు కొన్ని విజయవంతమవుతాయి, మరికొన్ని వైఫల్యం చెందుతుంటాయి. ఆమాటకొస్తే జీవితమంటేనే గెలుపు, ఓటముల ప్రయాణం. ఓటమి నుంచి ఎంత త్వరగా కోలుకుంటే.. తర్వాత విజయాన్ని అంత త్వరగా సాధించవచ్చు. ఇప్పుడు ఇదే విషయాన్ని చెబుతున్నాడు హీరో కార్తీకేయ. ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు యంగ్‌ హీరో కార్తీకేయ. ఈ సినిమాలో అగ్రేసివ్‌ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హీరో తర్వాత వరుస అవకాశాలను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ దృష్టిని ఆకర్షించాడు. ఇందులో భాగంగానే కార్తీకేయ హీరోగా తెరకెక్కిన ‘చావు కబురు చల్లగా’ సినిమాను గీతా ఆర్ట్స్‌ తెరకెక్కించింది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన నాటి నుంచి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక చిత్ర ఫస్ట్‌ లుక్‌, ట్రైలర్‌లు సినిమాకు పాజిటివ్‌ టాక్‌ తెచ్చాయి. అయితే విడుదల తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఆ స్థాయిలో ఆడలేకపోయింది. ఈ విషయమై హీరో తాజాగా ట్విట్టర్‌ వేదికగా స్పందించాడు. సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయిందని చెబుతూ.. ‘చావు కబురు చల్లగా సినిమా నాలో కొత్త నటుడిని పరిచయం చేసింది. బస్తీ బాలరాజుగా ఎన్నో హృదయాలకు నన్ను దగ్గర చేసింది. ఈ సినిమా నచ్చని అందరూ చిన్న తప్పులున్నా క్షమించేసి ఇంకో అవకాశం ఇవ్వండి. తప్పకుండా దాన్ని సరిదిద్దుకుని మళ్లీ పుంజుకుంటాను’ అంటూ క్యాప్షన్‌ జోడించాడు. దీంతో హీరోకు మద్దతు నిలుస్తూ ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

హీరో కార్తికేయ చేసి ట్వీట్..

Also Read: Vakeel Saab Trailer Review: వేరే లెవల్‌‌‌‌లో ‘వకీల్ సాబ్’ ట్రైలర్.. పూనకాలతో ఊగిపోతున్న అభిమానులు..

Mahesh Babu Bollywood: మహేష్‌ బాబు బాలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్ధమైందా.? ఆ సినిమాతోనే బీటౌన్‌కి వెళ్లనున్నాడా.?

Prabhas New Car: హైదరాబాద్‌ రోడ్లపై కొత్త కారులో చక్కర్లు కొడుతోన్న ప్రభాస్.. కారు ధర ఎంతో తెలిస్తే..