Prabhas New Car: హైదరాబాద్‌ రోడ్లపై కొత్త కారులో చక్కర్లు కొడుతోన్న ప్రభాస్.. కారు ధర ఎంతో తెలిస్తే..

Prabhas New Car: ప్రభాస్‌కు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్‌ కొనుగోలు చేసిన కారు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాహుబలితో ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీని..

Prabhas New Car: హైదరాబాద్‌ రోడ్లపై కొత్త కారులో చక్కర్లు కొడుతోన్న ప్రభాస్.. కారు ధర ఎంతో తెలిస్తే..
Prabhas
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 29, 2021 | 4:03 PM

Prabhas New Car: ‘ప్రభాస్‌’ పేరు తెలియని సగుటు భారతీయుడు.. అంతేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సగటు సినీ అభిమాని ఉండడు అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఛత్రపతి, వర్షం, డార్లింగ్‌ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా మారిన ప్రభాస్‌.. ‘బాహుబలి’ సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు. జపాన్, చైనా వంటి దేశాల్లో ఈ సినిమా డబ్బింగ్‌ కావడంతో అక్కడ కూడా డార్లింగ్‌కు అభిమానులు పెరిగిపోయారు. ఈ క్రమంలోనే ప్రభాస్‌కు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్‌ కొనుగోలు చేసిన కారు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాహుబలితో ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీని షేక్‌ చేసిన ప్రభాస్‌.. తన కారు విషయంలోనూ అలాంటి సంచలనమే సృష్టించాడు. తాజాగా ప్రముఖ ఇంటర్నేషనల్‌ కంపెనీ అయిన లంబోర్ఘినికి చెందిన అవెన్‌టోడోర్‌ ఎస్‌ రోడ్‌స్టర్‌ను సొంతం చేసుకున్నాడు ప్రభాస్. అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఈ కారు ధర ఏకంగా రూ.6 కోట్లకు పైమాటే. బెంగళూరు లంబోర్ఘిని షోరూమ్‌ నుంచి ఇటీవలే ఈ కారు హైదరాబాద్‌లోని ప్రభాస్‌ ఇంటికి చేరుకుంది. దీంతో ప్రస్తుతం ప్రభాస్‌ కారుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ రోడ్లపై డార్లింగ్‌ కారులో షికార్లు కూడా కొట్టాడు. ఇక ఈ కారు ప్రత్యేకత విషయానికొస్తే.. కేవలం 2.9 సెకండ్లలో గంటకు 100 కి.మీల వేగాన్ని అందుకోగలదు. అంతేకాకుండా అత్యధికంగా 350 కి.మీ/గంట వేగంతో దూసుకెళ్లగలదు.

ప్రభాస్‌ కొత్త కారును ఓపెన్‌ చేస్తోన్న వీడియో..

హైదరాబాద్‌ రోడ్లపై కారు నడిపిస్తోన్న ప్రభాస్‌..

ఇక ప్రభాస్‌ సినిమాల విషయానికొస్తే.. బాహుబలి తర్వాత నటించిన ‘సాహో’ తెలుగు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా బాలీవుడ్‌లో మాత్రం సంచలన విజయం సొంతం చేసుకుంది. ఇక ప్రభాస్‌ ప్రస్తుతం ఏకకాలంలో మూడు చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా మారాడు. రాధేశ్యామ్‌తో పాటు ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌తో ‘సలార్‌’ సినిమా, బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్‌తో ‘ఆదిపురుష్‌’లో నటిస్తున్నాడు. ఈ మూడు చిత్రాలు కూడా అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా నేపథ్యలో తెరకెక్కుతుండడం విశేషం. మరి ఈ సినిమాలు ప్రభాస్‌ క్రేజ్‌ను‌ ఇంకెంత దూరం తీసుకెళ్తాయో చూడాలి.

Also Read: Raashi Khanna: గ్లామర్‌‌‌‌‌తోపాటు ఊరమాస్‌‌‌‌‌తోనూ ఆడియన్స్ మతిపోగొడతానంటున్న ముద్దుగుమ్మ..

Raviteja: మెగాస్టార్ సినిమా స్పూర్తితో మాస్ రాజా మూవీ.. ఎక్స్ ట్రా ఎనర్జీతో కనిపించనున్న రవితేజ

JR. NTR TDP: పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ యాక్టీవ్ కావాలన్న టీడీపీ సీనియర్ నేత..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!