Raashi Khanna: గ్లామర్‌‌‌‌‌తోపాటు ఊరమాస్‌‌‌‌‌తోనూ ఆడియన్స్ మతిపోగొడతానంటున్న ముద్దుగుమ్మ..

ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రాశిఖన్నా. ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో అటు తమిళ్ లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

Raashi Khanna: గ్లామర్‌‌‌‌‌తోపాటు ఊరమాస్‌‌‌‌‌తోనూ ఆడియన్స్ మతిపోగొడతానంటున్న ముద్దుగుమ్మ..
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 29, 2021 | 4:23 PM

Raashi Khanna: ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రాశిఖన్నా. ఈ అమ్మడు ఇటు తెలుగులో అటు తమిళ్ లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇటివరకు దాదాపు టాలీవుడ్ యంగ్ హీరోలందరి సరసన సినిమాలు చేసి ఆకట్టుకుంది. ఇక ఈ అమ్మడు సారైన హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తుంది. తెలుగు లో చివరిగా నటించిన ప్రతిరోజు పండుగే సినిమా హిట్ ను అందుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మ నటనకు ప్రదాన్యత ఉన్న పాత్రల్లో నటించాలని ఎంతోకాలంగా ఎదురుచూస్తుంది. ఇప్పటివరకు గ్లామర్ పాత్రల్లో నటించిన ఈ చిన్నది ఇక పై నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు, మాస్ ఆడియన్స్ ను అలరించే క్యారెక్టర్స్ చేయాలనీ చూస్తుంది.

ప్రస్తుతం రాశిఖన్నా తమిళ్ లో నాలుగు సినిమాలు చేస్తుంది. తెలుగులో ఒక సినిమా చేస్తుంది. దర్శకుడు మారుతి దర్శకత్వంలో ‘పక్క కమర్షియల్ ‘అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాలో మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటిస్తున్నాడు. ఇక గోపీచంద్, రాశిఖన్నా కలిసి గతంలో రాధాకృష్ణ దర్శకత్వంలో ‘జిల్’ అనే సినిమా చేశారు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి మరోసారి స్క్రీన్ పై అలరించనున్నారు. ఈ సినిమాను మారుతి మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కించాలని చూస్తున్నాడట. ఇందుకోసం రాశిఖన్నా పాత్రకు గ్లామర్ తో పాటు మాస్ ను కూడా జోడించాడట. అలాగే ఈ సినిమాతో పాటు మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇంచిందట రాశి. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో మాస్ రాజా రవితేజ నటిస్తున్న సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలో కూడా రాశి మాస్ పాత్రలో కనిపించనుందని తెలుస్తుంది. ఇలా ఈ అమ్మడు ఇప్పుడు వరుసగా మాస్ పాత్రలు ఎంచుకుంటూ మాస్ ఆడియన్స్ ను ఆ’కట్టుకోవడానికి సిద్దమవుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Raviteja: మెగాస్టార్ సినిమా స్పూర్తితో మాస్ రాజా మూవీ.. ఎక్స్ ట్రా ఎనర్జీతో కనిపించనున్న రవితేజ

JR. NTR TDP: పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ యాక్టీవ్ కావాలన్న టీడీపీ సీనియర్ నేత..

చక్రవ్యూహంలో చిక్కుకున్నప్పుడు దారి వెతికితే దొరకదు, సృష్టించుకోవాలి.. ఆసక్తికరంగా తమన్నా ’11th అవర్’ టీజర్..