AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raviteja: మెగాస్టార్ సినిమా స్పూర్తితో మాస్ రాజా మూవీ.. ఎక్స్ ట్రా ఎనర్జీతో కనిపించనున్న రవితేజ

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం 'ఖిలాడి' సినిమాతో షూట్ తో బిజీగా ఉన్నాడు. చాలా కాలం తరవాత రవితేజ క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు.

Raviteja: మెగాస్టార్ సినిమా స్పూర్తితో మాస్ రాజా మూవీ.. ఎక్స్ ట్రా ఎనర్జీతో కనిపించనున్న రవితేజ
Raviteja
Rajitha Chanti
|

Updated on: Mar 29, 2021 | 2:50 PM

Share

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ‘ఖిలాడి’ సినిమాతో షూట్ తో బిజీగా ఉన్నాడు. చాలా కాలం తరవాత రవితేజ క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ ఏడాది క్రాక్ సినిమాతో సంచలన విజయం అందుకున్న రవితేజ. ఇప్పుడు అదే జోష్ లో ఖిలాడి సినిమాను పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమాలో మాస్ రాజా డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇటీవలే ఇటలీకి వెళ్లిన చిత్రబృందం కీలక సన్నివేశాల్ని ఒక పాటను చిత్రీకరించారు. కొద్దిరోజుల పాటు చిత్రీకరణ మిగిలి ఉండగానే.. కరోనా సెకండ్ వేవ్ వల్ల ప్రస్తుతానికి షూటింగ్ కి బ్రేక్ పడిందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్సశకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత త్రినాద్ నక్కిన డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని మొదటినుంచి వార్తలు వస్తున్నాయి. సినిమా చూపిస్తా మామ, నేను లోకల్ వంటి సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న త్రినాద్ రావు ఇప్పుడు ఈ సినిమాను కూడా అదే తరహా కామెడీ యాంగిల్ లో తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది. అయితే ఈ సినిమా కథ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సినిమా స్ఫూర్తి తో ఉండనుందని తెలుస్తుంది. అయితే మొదట్లో చిరు నటించిన చంటబ్బాయి సినిమా లా ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే మాస్ మహారాజ్ కెరీర్ లో మునుపెన్నడూ కనిపించనంత కొత్తగా ఎనర్జిటిక్ గా ఈ చిత్రంలో కనిపిస్తారట. ఇందుకోసం ఆయన పాత్రను చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాడట త్రినాద్. మరో వైపు రవితేజ సినిమా తర్వాత యంగ్ హీరో నాగశౌర్య తో ఓ సినిమా చేస్తున్నాడు త్రినాద్ నక్కిన.

Also Read:

చక్రవ్యూహంలో చిక్కుకున్నప్పుడు దారి వెతికితే దొరకదు, సృష్టించుకోవాలి.. ఆసక్తికరంగా తమన్నా ’11th అవర్’ టీజర్..

‘నా జీవితంలో చాలా అందమైన దశను అనుభవిస్తున్నాను’.. బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసుకున్న టాప్ సింగర్..