చక్రవ్యూహంలో చిక్కుకున్నప్పుడు దారి వెతికితే దొరకదు, సృష్టించుకోవాలి.. ఆసక్తికరంగా తమన్నా ’11th అవర్’ టీజర్..

Thamannah Web Series: అటు వెండితెరపై టాప్ హీరోయిన్‏గా వరుస సినిమాలు చేస్తూనే.. ఓటీటీలోకి అడుగుపెడుతుంది మిల్కీబ్యూటీ తమన్నా.

చక్రవ్యూహంలో చిక్కుకున్నప్పుడు దారి వెతికితే దొరకదు, సృష్టించుకోవాలి.. ఆసక్తికరంగా తమన్నా '11th అవర్' టీజర్..
11th Hour
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 29, 2021 | 2:05 PM

Thamannah Web Series: అటు వెండితెరపై టాప్ హీరోయిన్‏గా వరుస సినిమాలు చేస్తూనే.. ఓటీటీలోకి అడుగుపెడుతుంది మిల్కీబ్యూటీ తమన్నా. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 11th అవర్ అనే వెబ్ సిరీస్ చేస్తుంది. థ్రిల్లర్ జోనర్‏లో రూపొందుతున్న ఈ సిరీస్ ఏప్రిల్ 9న ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సిరీస్ టీజర్ విడుదల చేసింది ప్రవీణ్ సత్తారు టీం. మగవాళ్ళ వ్యాపార సామ్రాజ్యంలో ఒక మహిళ ప్రవేశించి.. వారిని ధీటుగా ఎలా ఎదుర్కోందనేది చిత్ర నేపథ్యంలో తెరకెక్కినట్టుగా టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఇందులో తమన్నా అరాత్రికారెడ్డి అనే పాత్రలో నటిస్తుంది.

చక్రవ్యూహంలో చిక్కుకున్నప్పుడు దారి వెతికితే దొరకదు, సృష్టించుకోవాల్సి ఉంటుంది అని తమన్నా చెబుతున్న డైలాగ్స్ మరింత ఆసక్తిని కలిగిస్తుంది. ఇందులో అరుణ్ ఆదిత్ , వంశీ కృష్ణ ,రోషిణి ప్రకాష్ ,జయప్రకాష్ ,శత్రు ,మధుసూదన్ రావు ,పవిత్ర లోకేష్ ,అనిరుధ్ బాలాజీ ,శ్రీకాంత్ అయ్యంగార్ ,వినయ్ ,ప్రియా బెనర్జీ తదితరులు కీలకపాత్రలో నటించారు. ఇటీవల థియేటర్లు తెరుచుకున్నప్పటికీ ఓటీటీల క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే పలువురు నటీనటులు డిజిటల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

11th అవర్ టీజర్..

Also read:

‘నా జీవితంలో చాలా అందమైన దశను అనుభవిస్తున్నాను’.. బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసుకున్న టాప్ సింగర్..