న్యూ వెబ్ సిరీస్ స్టార్ట్ చేసిన మెహబూబ్ దిల్‏సే.. నాగార్జున చేతులమీదుగా పోస్టర్ రిలీజ్.. పేరెంటో తెలుసా..

Mehaboob Dilse: మెహబూబ్ దిల్ సే.. నటన మీద ఉన్న ఆసక్తితో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ చేస్తూ ఉండేవాడు. అలాగే సూపర్ హిట్ తనదైన స్టైల్లో అదిరిపోయే

న్యూ వెబ్ సిరీస్ స్టార్ట్ చేసిన మెహబూబ్ దిల్‏సే.. నాగార్జున చేతులమీదుగా పోస్టర్ రిలీజ్.. పేరెంటో తెలుసా..
Guntur Mirchi
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 28, 2021 | 2:18 PM

Mehaboob Dilse: మెహబూబ్ దిల్ సే.. నటన మీద ఉన్న ఆసక్తితో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ చేస్తూ ఉండేవాడు. అలాగే సూపర్ హిట్ తనదైన స్టైల్లో అదిరిపోయే స్టెప్పులేస్తాడు. మూవీలోని పాపులార్ డైలాగ్స్‏ను తన స్ట్రైల్లో పలికి ఆ వీడియోలను తన సొంత యూట్యూబ్ ఛానల్‏లో పోస్ట్ చేస్తుంటాడు. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్ని అతి తక్కువ కాలంలోనే ఎలిమేనేట్ అయ్యాడు. హౌస్ నుంచి బయటకు వచ్చాక మెహబూబ్ మళ్లీ తన వీడియోలను తీస్తూ బిజీగా మారిపోయాడు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమాలో మెహబూబ్ నటించనున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

తాజాగా మెహబూబ్ న్యూ వెబ్ సిరీస్ చేయబోతున్నాడు. గుంటూర్ మిర్చి అనే వెబ్ సిరీస్ చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. ఈ సిరీస్‏కు సంబంధించిన పోస్టర్‏ను అక్కినేని నాగార్జున చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ విషయాన్ని మెహబూబ్ తన ఇన్‏స్టా‏గ్రామ్‏లో షేర్ చేసుకోచ్చాడు. చాలా కాలం తర్వాత నా నెక్ట్స్ ప్రాజెక్ట్ గుంటూరు మిర్చి. న్యూ వెబ్ సిరీస్ పోస్టర్ అక్కినేని నాగార్జున గారు లాంచ్ చేసారు. నాకు సపోర్ట్ చేస్తున్న అందరికి థ్యాంక్స్.. ఈ స్టోరీని ఎస్డీ చాడా సర్ రాసారు అంటూ రాసుకోచ్చాడు మెహబూబ్. ఈ సిరీస్‏ను అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అటు నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

మెహబూబ్ ట్వీట్…

Also Read:

FilmFare Awards 2021: రికార్డు క్రియేట్ చేసిన ‘తప్పాడ్’.. మరోసారి ఉత్తమ నటిగా తాప్సీ..

Holi Theme Telugu Songs: రంగుల హోలీ.. రాగాల కేళీ.. మదిమదినీ పులకింపజేసే ‘సుస్వరాలు’.. ఎన్నటికీ చెరగని గుర్తులు..